4, డిసెంబర్ 2012, మంగళవారం

సమస్యా పూరణం - 896 (దురద కందకు లేదు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
దురద కందకు లేదు కత్తులకు హెచ్చె.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదములు.

31 కామెంట్‌లు:

  1. తండ్రి వనముల కనుపగా దాశరథికి
    బాధ లేదయ్యె కాని యా పౌరులెల్ల
    ప్రభువు నాజ్ఞకు గడు బాధపడుటను గన
    దురద కందకు లేదు కత్తులకు హెచ్చె

    రిప్లయితొలగించండి
  2. కంద బచ్చలి యావల కలుపు గూర
    జిహ్వ కింపని బేరము జేయ నేను
    నోట దురదగు నని వాదు మాట వింటి
    దురద కందకు లేదు కత్తులకు హెచ్చె !

    రిప్లయితొలగించండి
  3. ఈ సమస్య చూస్తే మిస్సన్న మహాశయులిచ్చినట్లున్నది. అందుకే ఆ మోతాదులోనే, చతురోక్తిగా:
    ముద్దుఁగూడెడి కాపురంబును ముసలము
    వోలెకూల్చె రంకుమొగుడు కాల మహిమ
    దురద కందకు లేదు కత్తులకు హెచ్చె
    నన్నతిరుగు సామెత మాదిరాయె చంద్ర!

    రిప్లయితొలగించండి
  4. శుభ్రతనల వరచుకొను చూడగ మరి
    దురదకందకు, లేదు కత్తులకు హెచ్చె
    ననుచు చెప్పగాను కరుణ నట్టి తీట
    తాట లేచెడు నట్లుగ తాము గోకు.

    రిప్లయితొలగించండి
  5. పండిత నేమాని వారూ,
    ‘రామునకు లేని దుఃఖం ప్రజలకు’ అన్న భావంతో మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    మీ పూరణలోని చతురత బాగుంది. అభినందనలు.
    ప్రసిద్ధమైన సామెతను సమస్యగా ఇచ్చింది మిస్సన్న గారు కాదు. కానీ ఇచ్చింది మన ‘రెగ్యులర్’ కవిమిత్రులలో ఒకరే!
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ అచ్చమైన దురద పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. భర్త కొట్టగ భార్యను వాయి ముడిచి
    యేమి యనలేదు సరికదా యిష్ట బడెను
    కాని దూషించె యాతని గన్న తల్లి
    దురద కందకు లేదు కత్తులకు హెచ్చె

    రిప్లయితొలగించండి
  7. అంచె లంచెలుగా మించు లంచములకు
    కళ్లెమును వేయు ప్రభుతయే కనులు మూసె
    ప్రజలు పత్రిక లనుదినం బరచుచుండె
    దురద కందకు లేదు కత్తులకు హెచ్చె.

    రిప్లయితొలగించండి
  8. గురువు గారు కొన్ని తప్పులను చూసీ చూడనట్లు వదిలేస్తున్న విషయం నేనూ గమనించాను.
    నేను కూడా కొన్ని పొరబాట్లు చూసినపుడు చెపుదామనుకొని కూడా పెద్దలందరు ఊరుకున్నపుడు నేను చెపితే "కందకు లేని దురద...." అనుకుంటారేమోనని సందేహించి ఊరుకుంటున్నాను.

    కానీ నా విన్నపం ఒక్కటి. గురువుగారు, నేమాని పండితులవారు, పెద్దలందరూ, మిత్రులు ఎవరైనా నా పూరణల్లో పద్యాల్లో ఏ చిన్న లోపమున్నా దయచేసి దయచేసి తెలుపగలరని ప్రార్థిస్తున్నాను. మరీ మరీ ప్రార్థిస్తున్నాను.

    చిన్ని పొరబాటు నేదేని జేసినపుడు
    కొంత సరిదిద్ద వలయును కూర్మితోడ.
    దురద కందకు లేదు కత్తులకు హెచ్చె
    ననుచు దలపగ బోనందు నార్యులార!

    రిప్లయితొలగించండి
  9. మనదేశములో క్రీడాకారులకన్నా క్రీడాభిమానులే ఎక్కువ హడావిడిచేస్తారు కదా..... దానిని దృష్టిలో పెట్టుకొని...............


    గెలుపునోటమి సహజముల్ క్రీడలందు
    యనుచు క్రీడింతురెల్లరు యవనియందు
    వెఱ్ఱివీరాభిమానులే వింతగొలుపు
    దురద కందకులేదు కత్తులకు హెచ్చు

    రిప్లయితొలగించండి
  10. సచినుని క్రికెట్టుఁ గూర్చియె సకల జనుల
    చర్చలను,వాదములఁ,విమర్శలనుఁ గనగ
    స్పురియించెనీ సామెత చోద్య మగనె?
    దురద కందకులేదు కత్తులకు హెచ్చు

    రిప్లయితొలగించండి
  11. రాముఁ బ్రేమించె భరతుండు రాగమలర
    రాజు కా గోరనే లేదు రాజ్యమునకు
    కైక, మంధర పురిగొల్ప గయ్యు మనియె
    దురద కందకు లేదు కత్తులకు హెచ్చె!

    రిప్లయితొలగించండి
  12. అయ్యా! శ్రీ చంద్రశేఖర్ గారూ! శుభాశీస్సులు.

    "దురద కందకు లేదు కత్తులకు హెచ్చె" అనే సమస్యను శ్రీ మిస్సన్న గారు ఇచ్చేరు అనుకొని మీరు పూరించేరు. పూరణ బాగున్నది. నేను ఇస్తే ఎలా పూరిస్తారో - ఒకమారు ముచ్చటించండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  13. అయ్యా శ్రీ రామకృష్ణ గారూ (ఊ.దం.)
    మీ పద్యము చాల బాగున్నది. అభినందనలు. 3వ పాదములో "స్ఫురియించెనీ......" అనుటలో గణములు సరిపోవుట లేదు. కొంచెము మార్చండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  14. ఇతరుల విషయమ్మున జోక్యమేల గొనుట ?
    మిన్నకుండిన మేల్ గదా కొన్నిమార్లు
    దురద కందకు లేదు కత్తులకు హెచ్చె
    ననెడు రీతిగ మనమేల నడువ వలయు ?

    రిప్లయితొలగించండి
  15. దారి యందున నొకచోట తగవు లాడు
    చుండిరి మనుజు లిద్దరు చోద్యముగను
    పాంథు డొక్కడు వారించె వారిని గని;
    “దురద కందకు లేదు కత్తులకు హెచ్చె "

    రిప్లయితొలగించండి
  16. శ్రీగురుభ్యోనమ:
    శ్రీనేమానివారికాత్మసదృశమూ, నాకు ప్రాణమూ అయిన శ్రీ రామాయణంతర్గతంగానే, నా పూరణ:
    కన్నకొడుకేను యువరాజు గావలెనన
    కల్ల కపట మెరుగని కైక వలదనె
    కటుకు దాసి మంథర కేల? కాల మహిమ
    దురద కందకు లేదు కత్తులకు హెచ్చె!

    రిప్లయితొలగించండి


  17. “దురద కందకు లేదు కత్తులకు హెచ్చె "
    ననెడు సామెత యొక్కటి నలగు చుండు
    ను తెలుగు జనుల కెప్పుడు నోటి యందు ;
    దీని భావ మేమి గలదు తిరుమలేశ ?

    రిప్లయితొలగించండి
  18. శ్రీనాగరాజుగారు పూరణకోసం ఊరకే ప్రశ్న వేశారని అనుకొంటున్నాను. ఏమైనా, అసలు సామెత, "కందకిలేని దురుద కత్తిపీటకెందుకు?", "కందకి లేనిదురద కత్తిపీటకన్నట్లుంది" "చోద్యంకాకపోతే, కందకిలేనిదురద కత్తిపీటకట" అని రకరకాలుగా సందర్భాన్ని బట్టి వాడతారు. ఇక మిగతాది మీరు ఊహించుకోవచ్చు:-)

    రిప్లయితొలగించండి



  19. నాదొక సూచన;ఇప్పటికి సమస్యాపూరణలు, పద్యరచనలు కలిపి వేయి సంఖ్య 1000 దాటింది.వీటన్నిటినీ శంకరయ్యగారు (computerలో)భద్రపరచారనుకొంటున్నాను.ఈ బ్లాగుని ఇదేవిధంగా కొనసాగించవచ్చును.కాని మొదటి 1000 ని యథాతథంగా ( రచయితల పూరణలు,కవితలు,వ్యాఖ్యలతో )పుస్తకం ప్రచురిస్తే చాలా బాగుంటుంది.దానికి ఖర్చవుతుంది.ఇందులో పాల్గొన్న అందరు కవులు తలా కొంత భరించాలి.నావంతు ఇచ్చుటకు నేను సిద్ధంగా ఉన్నాను.బ్లాగు మిత్రులందరూ తమతమ అభిప్రాయాలను తెలియజేయగోరుతున్నాను.

    రిప్లయితొలగించండి
  20. శ్రీ పండిత నేమాని వారికి ధన్యవాదములు..

    ఇలా సవరిస్తున్నాను..

    సచినుని క్రికెట్టుఁ గూర్చియె సకల జనుల
    చర్చలను,వాదములఁ,విమర్శలనుఁ గనగ
    దోచెనొక్కసామెత సత్యదూరమగునె?
    దురద కందకులేదు కత్తులకు హెచ్చు

    భవదీయుడు

    రిప్లయితొలగించండి
  21. డా.కమనీయంగారికి, మీ ఆలోచన బాగుంది. ఈ దిశలోనే అదివరకు మాష్టారు పి.డి.ఎఫ్. ఫైలుగా మొదటి 500 సమస్యలు తయారుచేసి పెడతానన్నారు. పరిష్కరించిన పూరణలు ముద్రిస్తే మనకీ, కొత్తవాళ్ళకీ, మిగతా అందరికీ ఉపయోగపడతాయి. తలా ఒకచేయి వేస్తే ధనసహాయం సమస్య కాదనిపిస్తోంది వేద్దాము. మాస్టారి పూనిక కావాలి.

    రిప్లయితొలగించండి
  22. గురువు గారిచ్చిన ఈ సమస్యకిన్ని పూరణలు వస్తాయని ఊహించ లేదు. అద్భుతం.
    చంద్రశేఖరులు మొత్తం మీద నన్నూహించుకొని వేడి వేడి కందాబచ్చలిలో కాలేశారు.
    నేమాని పండితుల ప్రశ్నకు వారు చెప్పిన పూరణ అతికినట్లుంది.
    ఇక లక్ష్మీ దేవిగారి పూరణ నాకు చాలా నచ్చింది.

    రిప్లయితొలగించండి
  23. భర్త కొట్టిన తానేమి బాధ పడక
    అత్త వారించె కొడుకును చిత్త మలర
    తోటి కోడలు దెప్పెను ఘాటు గాను
    దురద కందకు లేదు కత్తులకు హెచ్చె !

    రిప్లయితొలగించండి
  24. అయ్యా మిస్సన్నగారూ, కందాబచ్చలిలో కాలేసింది తూర్పు తీర వాసులు డా.గన్నవరపు మూర్తి గారూ. పైగా ఆవ పెట్టి మరీ కాలేశారు.

    రిప్లయితొలగించండి
  25. వేయిని దాటిన 'పూరణ'
    వేయించగ వలయు పొత్త విత్తంబున కై
    వేయగ వలయును మిత్రులు
    చేయిని మరి గురువు గారి చిత్తంబేదో ?

    రిప్లయితొలగించండి




  26. చిత్రసీమలో,తారలు,చెలులు, ప్రియుల
    ప్రణయ వృత్తాంతముల్,పుకార్లు ప్రజలకెంతొ
    గొప్ప యాసక్తి చదువుటకును వినంగ
    అసలు పాత్రధారులకన్న యధికముగను
    దురద కందకులేదు కత్తులకు హెచ్చు.


    రిప్లయితొలగించండి
  27. మిస్సన్న గారు,ధన్యవాదాలండి.
    మీరు మాత్రం దురద నుండి కత్తులనుండి తప్పించుకున్నట్టున్నారు. :)

    రిప్లయితొలగించండి