శ్రీరామ సుప్రభాతము
సరసిజేక్షణా! రామ! జ్ఞానసాగరా!
పరమపూరుషా! రామ! భక్తపాలకా!
సరసవాఙ్మయా! రామ! జానకీప్రియా!
సురవరస్తుతా! రామ! సుప్రభాతమౌ!
త్రిజగదీశ్వరా! రామ! దివ్యవిగ్రహా!
విజయభూషణా! రామ! విక్రమోన్నతా!
అజ ముఖార్చితా! రామ! యజ్ఞరక్షకా!
సుజనబాంధవా! రామ! సుప్రభాతమౌ!
శుకవరస్తుతా! రామ! సూర్యవంశజా!
సకలయోగదా! రామ! సర్వదర్శనా!
అకలుషాత్మకా! రామ! హర్షవర్ధనా!
సుకృతవైభవా! రామ! సుప్రభాతమౌ!
లలిత భావనా! రామ! రాజశేఖరా!
కలితవైభవా! రామ! జ్ఞానభాసురా!
అలఘుదర్శనా! రామ! ఆగమస్తుతా!
సులభసిద్ధిదా! రామ! సుప్రభాతమౌ!
కమలలోచనా! రామ! కర్మమోచనా!
సమరభీకరా! రామ! శత్రుతాపనా!
అమరరక్షకా! రామ! ఆర్తినాశకా!
సుముఖశోభితా! రామ! సుప్రభాతమౌ!
త్రిభువనాధిపా! రామ! దీనబాంధవా!
శుభఫలప్రదా! రామ! సుస్మితాననా!
సుభుజభాసురా! రామ! శూరశేఖరా!
శుభగుణాకరా! రామ! సుప్రభాతమౌ!
జగదభిష్ఠుతా! రామ! సాధుసేవితా!
సుగతిదాయకా! రామ! సూరిసన్నుతా!
నిగమవందితా! రామ! నిత్యవైభవా!
సుగుణభూషణా! రామ! సుప్రభాతమౌ!
ఘనయశోధనా! రామ! కామితార్థదా!
మునిజనావనా! రామ! పూరుషాగ్రణీ!
దనుజనాశకా! రామ! ధర్మతత్పరా!
సునయనాంబుజా! రామ! సుప్రభాతమౌ!
పండిత రామజోగి సన్యాసిరావు గారి
‘శ్రీమదధ్యాత్మరామాయణము’ నుండి
సరసిజేక్షణా! రామ! జ్ఞానసాగరా!
పరమపూరుషా! రామ! భక్తపాలకా!
సరసవాఙ్మయా! రామ! జానకీప్రియా!
సురవరస్తుతా! రామ! సుప్రభాతమౌ!
త్రిజగదీశ్వరా! రామ! దివ్యవిగ్రహా!
విజయభూషణా! రామ! విక్రమోన్నతా!
అజ ముఖార్చితా! రామ! యజ్ఞరక్షకా!
సుజనబాంధవా! రామ! సుప్రభాతమౌ!
శుకవరస్తుతా! రామ! సూర్యవంశజా!
సకలయోగదా! రామ! సర్వదర్శనా!
అకలుషాత్మకా! రామ! హర్షవర్ధనా!
సుకృతవైభవా! రామ! సుప్రభాతమౌ!
లలిత భావనా! రామ! రాజశేఖరా!
కలితవైభవా! రామ! జ్ఞానభాసురా!
అలఘుదర్శనా! రామ! ఆగమస్తుతా!
సులభసిద్ధిదా! రామ! సుప్రభాతమౌ!
కమలలోచనా! రామ! కర్మమోచనా!
సమరభీకరా! రామ! శత్రుతాపనా!
అమరరక్షకా! రామ! ఆర్తినాశకా!
సుముఖశోభితా! రామ! సుప్రభాతమౌ!
త్రిభువనాధిపా! రామ! దీనబాంధవా!
శుభఫలప్రదా! రామ! సుస్మితాననా!
సుభుజభాసురా! రామ! శూరశేఖరా!
శుభగుణాకరా! రామ! సుప్రభాతమౌ!
జగదభిష్ఠుతా! రామ! సాధుసేవితా!
సుగతిదాయకా! రామ! సూరిసన్నుతా!
నిగమవందితా! రామ! నిత్యవైభవా!
సుగుణభూషణా! రామ! సుప్రభాతమౌ!
ఘనయశోధనా! రామ! కామితార్థదా!
మునిజనావనా! రామ! పూరుషాగ్రణీ!
దనుజనాశకా! రామ! ధర్మతత్పరా!
సునయనాంబుజా! రామ! సుప్రభాతమౌ!
పండిత రామజోగి సన్యాసిరావు గారి
‘శ్రీమదధ్యాత్మరామాయణము’ నుండి
నేమాని వారు రచనను
రిప్లయితొలగించండిఆ ముని సత్తముల వోలె నందించితిరే
రామునిదిది భక్తి జదువ
కామితములు దీరు మనకు కష్టము తొలగున్.
భజన గీతంగా బాగుంటుంది.
రిప్లయితొలగించండిమిత్రులారా!
రిప్లయితొలగించండిఈ సుప్రభాతము ఛందోబద్ధముగానే వ్రాయబడినది. దీనిని చక్రవాక వృత్తము అని చూచినట్లు జ్ఞాపకము. అంతేకాదు దీనిని సంగీత శైలిలో కూడ గానము చేయవచ్చును - బౌళిరాగము - ఖండగతి తాళమునకు వీలుగా ఉంటుంది. స్వస్తి.
శ్రీరామ సుప్రభాత గీత(పద్య) ప్రదాత పండిత నేమాని వారికి పాదాభివందనములు. లక్ష్మీదేవి గారు అన్నట్లు భజన కీర్తనగా గూడ చాల బాగుంటుంది. పాడుతూ ఉంటే కర్ణపేయంగా, మానసిక ప్రశాంతత చెకూరుచున్నది. మీ బ్లాగు సాంగత్యమునకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండినమస్కారములు
రిప్లయితొలగించండిశ్రీ పండితుల వారి సుప్రభాతం మృదు మధురం గా ఉంది. . పాటగా వీనుల విందుగా ఉంటుంది. మా కందించి నందుకు ధన్య వాదములు
రిప్లయితొలగించండిశ్రీరామ సుప్రభాతం
బీ రీతిని మధురగతి రచించియు మము సం
సారాంబుధి దాటించితె,
నీ రచనల మెత్తు మెపుడు నేమాని కవీ!
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ,
రాజేశ్వరి అక్కయ్య గారూ,
ధన్యవాదాలు.
శ్ర్రీ గురువులకు ప్రణామములు!
రిప్లయితొలగించండిఅమోఘమైన మీ శ్రీరామ సుప్రభాతము యొక్క పునఃప్రకాశితాన్ని ఇప్పుడే చూడగలిగాను. చూచి, మీ భక్తిభావనకు, ధారాగతికి, పదసంపదకు, గానయోగ్యమైన కవిత్వ భంగీభణితికి మఱొక్క పర్యాయం నిష్పర్యాయమైన పారవవశ్యం కలిగింది.
అపూర్వమైన ఈ ఛందస్సును శ్రీ చైతన్యుల శిష్యులు రూప గోస్వామి, జీవ గోస్వామి దేశమంతటా ప్రచారంలోనికి తెచ్చారు. వారు దీని "విలాసిని" అన్నారు. తెలుగు లాక్షణికులు చెప్పినట్లు లేదు.
ప్రముఖ గాయకులు జేసుదాసు గారు గానంచేసిన అయ్యప్ప స్తవం మలయాళంలో మణిప్రవాళశైలిలో ఈ ఛందస్సులోనే ఉన్నది.
అందులోని ఒక చరణం:
శరణ మయ్యపా! స్వామి శరణ మయ్యపా!
హరివరాసనం స్వామి విశ్వమోహనం
హరిదధీశ్వరం ఆ(-)రాధ్యపాదుకమ్
అరివిమర్దనం స్వామి నిత్యనర్తనం
హరిహరాత్మజం స్వామి దేవ మాశ్రయే.
అని.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు