మాష్టారికి నమస్సులు. ముందుగ మీరు వ(సూ)చించినటులే తలచి, “భువిన్+అనృత= భువిననృత అని యగునేమోనని, పదమధ్యస్తము గాన గురువుగా భ్రమపడితిని. మీ సవరణకు ధన్యవాదములు. సవరణ తరువాత
తవభవ నాశన మంత్రము భువిని యనృత వాక్యములను పూజ్యులు పలుకన్ శివ తత్త్వమెరిగి కొలువుము శివ నామము, చేదు నరుల జిహ్వల, కెపుడున్
గురువుగారూ ధన్యవాదాలు. డా. ఏల్చూరి మురళీధరరావుగారూ! కృతజ్ఞతాభి వందనములండీ. ఏమిటో నన్ను మునగ చెట్టు నెక్కిస్తూన్నారనిపిస్తోంది. నేమాని పండితార్యులూ, మీరు, గురువుగారూ, విష్ణునందనులు మొదలైన మీరందరూ చందన వృక్షాలైతే శంకరాభరణ వనంలో మీ ప్రక్కనున్న మామూలు మొక్కను. అంటిన కాస్త సువాసన. అంతే. మీ అందరి ఆశీస్సులూ, గురువుగారన్నట్లు మీ అందరి ప్రోత్సాహం ఉండాలి. మిత్రులందరి తోడూ ఉండాలి.
భవరోగము బాగుందని
రిప్లయితొలగించండిలవలేశము మందు వలదు లంపటమందే
జవ సత్వము కలదనగా
శివనామము చేదు నరుల జిహ్వల కెపుడున్.
ప్రవచించి యొక్క మూర్ఖుడు
రిప్లయితొలగించండిశివ నామము చేదు నరుల జిహ్వల కెపుడున్
భువి ననుచు వైర భక్తుడు
శివ! శివ! నీ పాదసీమ జేరెను కాదే
శివ శివ యని స్మరియించిన
రిప్లయితొలగించండిశివముల్ కలిగించు శివుడు చెంతనె యుండన్
భవ జాడ్య మంటు కతమున
శివనామము చేదు నరుల జిహ్వల కెపుడున్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీ మిస్సన్న గారికి
రిప్లయితొలగించండిప్రణామం!
అమోఘమైన భక్తిభావన తొణికిసలాడుతున్న మీ పద్యంలోని కవితాత్మకత అభినందనీయంగా అలరారుతున్నది. దైవదత్తమైన ప్రతిభ, "శంకరాభరణం"లో అభ్యాసం మిమ్మల్ని భగవత్కవిగా ఉన్నతోన్నతకక్ష్యలకు అధిరోహింపజేస్తుండటం ఆనందావహంగా ఉన్నది.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
చవులూరు మిఠాయిలు తొలి,
రిప్లయితొలగించండిజవరాలి పెదవుల తీపి చక్కెరలాపై,
నవసానదశ కలుగకను
శివనామము చేదు నరుల జిహ్వల కెపుడున్.
తవభవ నాశన మంత్రము
రిప్లయితొలగించండిభువిననృత వాక్యములను పూజ్యులు పలుకన్
శివ తత్త్వమెరిగి కొలువుము
శివ నామము, చేదు నరుల జిహ్వల, కెపుడున్
భవసాగరతారకమగు
రిప్లయితొలగించండిశివనామము "చేదు నరుల జిహ్వల కెపుడున్
శ్రవణకఠోరం" బనియెడు
ప్రవచనములు కల్లగాదె భావనకైనన్.
చెవి కింపగు మధురంబౌ
రిప్లయితొలగించండిశివనామమె భక్తుని మది జేయును మధురం
శివ తత్వంబును మరచిన
శివనామము చేదు నరుల జిహ్వల కెపుడున్
భవమును దాటించు వరము
రిప్లయితొలగించండిశివనామము చేదు నరుల జిహ్వల కెపుడున్
చవి చూడకనున్న;నుమా
ధవు జపమది జేర్చు మోక్షధామము కడకున్.
శివనామం బతిమధురము
రిప్లయితొలగించండిస్తవములలో కీర్తనల భజన ముఖ్యములన్
శివ శివ! లేకుండినచో
శివనామము చేదు నరుల జిహ్వల కెపుడున్
రిప్లయితొలగించండిజవరాలి మోవి నానుచు
భవబంధముల దగులుకొను పాపాత్ములకున్
చివరి ఘడియలవరకు గన
శివనామము చేదు నరుల జిహ్వల కెపుడున్.
ఈనాటి సమస్యకు చక్కని పూరణలు చెప్పిన కవిమిత్రులు....
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
పండిత నేమాని వారికి,
ఏల్చూరి వారి ప్రశంస లందిన మిస్సన్న గారికి,
రామకృష్ణ గారికి,
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
నాగరాజు రవీందర్ గారికి,
లక్ష్మీదేవి గారికి,
కమనీయం గారికి,
అభినందనలు, ధన్యవాదములు.
*
ఏల్చూరి మురళీధరరావు గారూ,
మిస్సన్న గారిని ప్రశంసిస్తూ ప్రోత్సహించినందుకు ధన్యవాదములు.
*
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ,
రెండవ పాదంలో గణదోషం. ‘భువి ననృత’ అన్నప్పుడు ‘న’ లఘువే. ‘భువిని యనృత’ అంటే సరి!
*
నాగరాజు రవీందర్ గారూ,
‘మధురం’ అని ముప్రత్యయం లేకుండా ప్రయోగించారు. ‘చేయు మధిరిమన్’ అందామా?
మాష్టారికి నమస్సులు. ముందుగ మీరు వ(సూ)చించినటులే తలచి, “భువిన్+అనృత= భువిననృత అని యగునేమోనని, పదమధ్యస్తము గాన గురువుగా భ్రమపడితిని. మీ సవరణకు ధన్యవాదములు. సవరణ తరువాత
రిప్లయితొలగించండితవభవ నాశన మంత్రము
భువిని యనృత వాక్యములను పూజ్యులు పలుకన్
శివ తత్త్వమెరిగి కొలువుము
శివ నామము, చేదు నరుల జిహ్వల, కెపుడున్
నవనాగరికత మోజూలు
రిప్లయితొలగించండినవధులు దాటగ పరమతపడుగులఁ నడవన్!
భవహరమగు పంచాక్షరి
శివనాము చేదు నరుల జిహ్వలకెపుడున1
గురువుగారూ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిడా. ఏల్చూరి మురళీధరరావుగారూ! కృతజ్ఞతాభి వందనములండీ. ఏమిటో నన్ను మునగ చెట్టు నెక్కిస్తూన్నారనిపిస్తోంది.
నేమాని పండితార్యులూ, మీరు, గురువుగారూ, విష్ణునందనులు మొదలైన మీరందరూ చందన వృక్షాలైతే శంకరాభరణ వనంలో మీ ప్రక్కనున్న మామూలు మొక్కను.
అంటిన కాస్త సువాసన. అంతే.
మీ అందరి ఆశీస్సులూ, గురువుగారన్నట్లు మీ అందరి ప్రోత్సాహం ఉండాలి.
మిత్రులందరి తోడూ ఉండాలి.
భవహరణము దగ జేయుచు
రిప్లయితొలగించండిచెవులకు నింపును గలిగించి చివరకు ముక్తిన్
జవమున నిడు;నే సరణిన్
శివనామము చేదు నరుల జిహ్వల కెపుడున్?
శివుడన భక్తియు లేకయె
రిప్లయితొలగించండివివిధపు సినిమాలు జూడ విచ్చల విడిగా
శివరాత్రి జాగరణమున;
శివనామము చేదు నరుల జిహ్వల కెపుడున్
శివరాత్రి జాగరణమున
రిప్లయితొలగించండినవలీలగ గోడ దూకి హడలుచు మదినిన్
జవరాండ్రను జేరు తడవు
శివనామము చేదు నరుల జిహ్వల కెపుడున్