గురువుగారు, ఇడుమ అంటే కష్టము, క్లేశము అని అర్థము. మీరు ఇక్కడ ఇడుము అని ఇచ్చియున్నారు.ఇడుము అంటే చేర్చు అని నిఘంటువు చూపిస్తున్నది. ఇంకొక అర్థమేమైనా ఉన్నదా?దయచేసి సందేహము తీర్చమని ప్రార్థన.
ఓ అజ్ఞాత కవి శివ అను పేరు గల కవిమిత్రునితో : వివరములెవ్వియు దెలుపక సువిశాలంభైనజాలశోభావేదిన్ కవితలు వ్రాయుదము, వలదు శివ! నామము మనకుఁ గలుగఁజేయు - నిడుములన్.
అవగత మైనద శుభములు
రిప్లయితొలగించండిశివనామము మనకుఁ గలుగఁజేయు - నిడుములన్
భవ రోగములను దీరుచు
నవనీతపు మానసుండు నాగేశ్వరుడే.
భవ సాగర మీదుటకని
రిప్లయితొలగించండిభవ బంధములు వీడి పరమ భక్తిని కొలువన్ !
లవలేశము మతి తప్పిన
శివనామము మనకు గలుగ జేయు నిడుములన్ !
ప్రవిమలమతి గీర్తించిన
రిప్లయితొలగించండిశివనామము మనకు గలుగజేయు నిడుములన్
భువి దాట గలుగు యోగము
వివిధ శుభాధిక్యములును విశ్రుత విభవా!
భవహర మగు వినుట వలన
రిప్లయితొలగించండిశివనామము మనకు ; గలుగ జేయు నిడుములన్
శివనామమ్మును మరచిన
శివ శివ యనుచున్ పలికిన చింతలు తొలగున్
భవబంధముఁ ద్రెంచెడి భవ
రిప్లయితొలగించండినవములు పాపప్రక్షాళనము గావించున్
అవసరమౌ ప్రక్రియలో
శివనామము మనకుఁ గలుగఁజేయు నిడుములన్.
అవమానించుటకై కే-
రిప్లయితొలగించండిశవభక్తుల, సాధు, సంత సంఘమ్ముల రే-
బవలులు జపింప చేటగు
శివనామము మనకు గలుగ జేయు నిడుములన్ !
అవధానియు హరిభక్తుడు
రిప్లయితొలగించండిశ్రవణమ్ముల విష్ణు దక్క శంభుని వినడున్
కవనమ్ముల నడిగితిమా
శివనామము మనకుఁ గలుగఁజేయు నిడుములున్ !
ఎవరెంత శ్రద్ధ , సహనమ
రిప్లయితొలగించండిలవరుచు కొనిరో పరీక్షల పరిగణించన్
భవహరణ మొందఁ జేసెడు
శివనామము మనకుఁ గలుఁగ జేయునిడుములన్
గురువుగారు,
రిప్లయితొలగించండిఇడుమ అంటే కష్టము, క్లేశము అని అర్థము.
మీరు ఇక్కడ ఇడుము అని ఇచ్చియున్నారు.ఇడుము అంటే చేర్చు అని నిఘంటువు చూపిస్తున్నది.
ఇంకొక అర్థమేమైనా ఉన్నదా?దయచేసి సందేహము తీర్చమని ప్రార్థన.
రిప్లయితొలగించండి"శివ శివ "యనినను శుభముల్
శివ నామము గలుగ జేయు, నిడుముల్
అవరోధంబులు గలుగవు
భవుడందరి భక్త జనుల పాలకుడయ్యా!
శివ శివ యేమని యంటిరి ?
రిప్లయితొలగించండిశివ నామము మనకు గలుగ జేయును నిడుముల్ ?
శివ యన శుభ మందురు కద
శివుడే యిల వేల్పు మాకు శివ శివ యందున్
అవనీగర్భశుభంబుల
రిప్లయితొలగించండిశివనామముమనకుఁగలుగ@జేయు, నిడుములన్
భవసాగరములబాపును
శివతత్వముముక్తినొసగు, శ్రేష్టంబిలలోన్.
"శివ శివ" యనినను శుభములు
రిప్లయితొలగించండిశివనామము మనకు గలుగ జేయు, నిడుములన్
అవరోధంబుల బాపును
భవుడందరి భక్త జనుల పాలకుడయ్యా !
సతీ దేవి తండ్రికి చేసిన హిత బోధ:
రిప్లయితొలగించండిఅవివేకమేల తండ్రీ?
శివనామము మనకు గలుగ జేయు శుభములన్
సవనము నొనరింప వినా
శివనామము మనకు గలుగ జేయు నిడుములన్
రిప్లయితొలగించండిభవబంధ ముక్తిని బరమ
శివనామము మనకు గలుగజేయు; నిడుమలన్
దవులగజేయును నరులకు
భవబంధముల ననురక్తి బ్రాప్తించుగదా!
రిప్లయితొలగించండిఓ అజ్ఞాత కవి శివ అను పేరు గల కవిమిత్రునితో :
వివరములెవ్వియు దెలుపక
సువిశాలంభైనజాలశోభావేదిన్
కవితలు వ్రాయుదము, వలదు
శివ! నామము మనకుఁ గలుగఁజేయు - నిడుములన్.
[మిస్సన్న గారికి ధన్యవాదములతో]
ఊక దంపుడు గారూ మీ పూరణలోని భావం, చమత్కారం బలే ఉన్నాయి. నాకూ ఈ ఆలోచన వచ్చింది గానీ, మీకు తట్టిన చమత్కారం తట్టలేదు. అభినందనలు.
రిప్లయితొలగించండితెలుగు పండితుడు రంగాచారి ఉవాచ:
రిప్లయితొలగించండిఅవనిని వైష్ణవు లందరు
చవిగొని నామము నిలువుగ సవరించవలెన్
చవటలు దిద్దెడి యడ్డపు
శివ-నామము మనకుఁ గలుగఁజేయు నిడుములన్!
అవునుర రాహులు బాబా!
రిప్లయితొలగించండిజవురగ వోట్లను వడివడి జంజాటమునన్
భవుభవుమని జేసెడి యా
శివనామము మనకుఁ గలుగఁజేయు నిడుములన్