పండిత నేమాని వారూ, మనోహరంగా ఉంది మీ పద్యం. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, విష్ణువు అంటే సర్వవ్యాపకుడని అర్థం. ‘శుక్లాంబరధరం విష్ణుం..’ శ్లోకం విష్ణు పరమైన దనే వారున్నారు. మీ పద్యం బాగుంది. అభినందనలు. * సుబారావు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు ‘తోన్ + ఉన్మత్తుల’ అన్నప్పుడు ద్విత్వం రాకూడదు. ‘తాదాత్మ్యతతో/ మన్మన మలరింపంగన్’ అందామా? * లక్ష్మీదేవి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * కమనీయం గారూ, మీ శబ్దం చిత్రం చాలా బాగుంది. అభినందనలు. * సహదేవుడు గారూ, బాగుంది మీ పద్యం. అభినందనలు.
లీలా మానుష విగ్రహా! యదుకుల శ్రేష్ఠా! సరోజేక్షణా!
రిప్లయితొలగించండిబాలార్క ప్రతిమాన తేజ! గజరా డ్వక్త్రాంక మందొప్పు నో
నీలాబ్దాంగ! నుతింతు నీ విభవమున్ నిత్య ప్రమోద ప్రదా!
శ్రీలాలిత్య మనోంబుజాత! మునిసంసేవ్యా! యశోదాసుతా!
గజముఖ! శుక్లాంబరధర !
రిప్లయితొలగించండినిజమిదె విష్ణుండవైన నీవే కాదా !
సుజనులు మెచ్చెడు భంగిమ
సృజియించెను భక్తుడొకడు చిత్రము లోనన్.
రిప్లయితొలగించండిచిన్మయ మూర్తుల జూడుడు
తన్మయులై యొకరి నొకరు తాదాత్మ్య్తత త
న్నున్మత్తుల దరి జేర్చగ
సన్మతితో నుండి రచట జటిలుడు ,కృష్ణు ల్ .
రిప్లయితొలగించండిబాలురుగానె పూజ గొని భక్తుల పాలన జేయుచుంద్రు, గో
పాలుడు, విఘ్ననాయకుడు; పంతము తోడను వింతగొల్పుచున్;
లాలన జేయు తల్లులకు లభ్యములైన వరమ్ముమూటలే;
లీలల జేతురెల్లపుడు లెక్కకు మిక్కిలి మోదమొప్పగా.
రిప్లయితొలగించండివిష్ణులిద్దరు ,గుదురుగా వేదవేద్యు
లైనవారు వేరైనట్టి యాకృతులను
నొక్కచోట దర్శనమిచ్చి యొప్పునట్లు ,
చిత్రకారుడు చూపించె చిత్రమందు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిబొజ్జ గణపయ్య, కన్నయ్య యొజ్జ వలెను
రిప్లయితొలగించండిచిత్ర మందున గొప్పగా జిలుగు లీన
విఘ్న నాయకు డొక్కరు విశ్వ మొకరు
కరుణ జూపుచు గావరే ఘటికు లార !
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిమనోహరంగా ఉంది మీ పద్యం. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
విష్ణువు అంటే సర్వవ్యాపకుడని అర్థం. ‘శుక్లాంబరధరం విష్ణుం..’ శ్లోకం విష్ణు పరమైన దనే వారున్నారు.
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
సుబారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు
‘తోన్ + ఉన్మత్తుల’ అన్నప్పుడు ద్విత్వం రాకూడదు. ‘తాదాత్మ్యతతో/ మన్మన మలరింపంగన్’ అందామా?
*
లక్ష్మీదేవి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
కమనీయం గారూ,
మీ శబ్దం చిత్రం చాలా బాగుంది. అభినందనలు.
*
సహదేవుడు గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
కరిరాజ వదనుండు కరిరాజ వరదుడు
రిప్లయితొలగించండి............ముచ్చట లాడుచు మురియు వేళ!
నాగ సూత్ర ధరుడు నాగారి వాహను-
............డుల్లాస హృదయులై యున్న వేళ !
ఆది పూజ్యుండును నాదిజు తండ్రియు
............భక్తావనమ్మున బరగు వేళ!
ఏక దంతుండు లోకైక నాథుండును
.............విష్ణు రూపమ్ముల వెలయు వేళ!
చవితి యైనను నష్టమి యైన నేమి ?
అను దినమ్మును శుభములు తనరవేమి?
విఘ్నములును విపత్తుల బెడద యేమి?
లోకముల కెల్ల పండుగ గాక యేమి?
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండికవిలోకమునకు పండుగ చేస్తున్నట్లు అద్భుతంగా ఉంది మీ పద్యం. అభినందనలు.
గురువుగారు,
రిప్లయితొలగించండిధన్యవాదములు.
మిస్సన్నగారి పద్యము మంచి పోలికలతో వైవిధ్యంగా ఉంది.
సుబ్బారావు గారి పద్యము దుష్కరప్రాస తో బాగున్నది.
మిస్సన్న గారి పద్యము చిత్రానికి తగినట్టుగా అద్భుతంగా ఉంది.
రిప్లయితొలగించండిఅయ్యా! మిస్సన్న గారూ! అద్భుతము. అదరగొట్టేసేరు. సంతోషము. అభినందనలు.
రిప్లయితొలగించండిఅయ్యా! మిస్సన్న గారూ! మీ పద్యములో చిన్న చుక్క బొట్టు కనిపించింది. తేటగీతి 1వ పాదములో యతి మైత్రి తప్పినది. స్వస్తి.
రిప్లయితొలగించండిగురువుగారూ ధన్యవాదములు.
రిప్లయితొలగించండినేమాని పండితార్యా! ధన్యుడను.
మీరు సూచించిన తప్పును దిద్దుతున్నాను.
లక్ష్మీ దేవి గారూ, రవీందర్ గారూ ధన్యవాదాలు.
తప్పు సవరించిన పద్యం:
కరిరాజ వదనుండు కరిరాజ వరదుడు
............ముచ్చట లాడుచు మురియు వేళ!
నాగ సూత్ర ధరుడు నాగారి వాహను-
............డుల్లాస హృదయులై యున్న వేళ !
ఆది పూజ్యుండును నాదిజు తండ్రియు
............భక్తావనమ్మున బరగు వేళ!
ఏక దంతుండు లోకైక నాథుండును
.............విష్ణు రూపమ్ముల వెలయు వేళ!
ఏమి చవితిని నష్టమి నిడుములేమి?
అను దినమ్మును శుభములు తనరవేమి?
విఘ్నములును విపత్తుల బెడద యేమి?
లోకముల కెల్ల పండుగ గాక యేమి?