27, డిసెంబర్ 2012, గురువారం

సమస్యా పూరణం - 919 (రామ మనోరథమ్ము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
రామ మనోరమ్ము భళిరా నెరవేర్చెను కైక రాణియై!
ఆకాశవాణి సౌజన్యంతో ఈ సమస్యను సూచించిన కవిమిత్రునకు ధన్యవాదములు.



11 కామెంట్‌లు:

  1. రాముడు భూమిపైన మరి రావణు జంపగ వచ్చె గాన తా
    క్షేమము గానె రాజు యయి సీతను గూడి యయోధ్య నున్నచో
    యేమగు రామ గాధ సరి నెన్నగ తప్పది కాదు చూడగా
    రామ మనోరథమ్ము భళిరా నెరవేర్చెను కైక రాణియై !

    రిప్లయితొలగించండి
  2. రాముడు రాక్షసాన్వయ విరాముడు కావలె నంచు గోరు సు
    త్రామ మనోరథమ్ము భళిరా! నెరవేర్చెను కైక రాణియై
    స్వామిని గోరగా వరము పంక్తిరథుం డొనగూర్చె నవ్విధిన్
    రాముని లీలలున్ దెలియరావు కదా పరమేష్ఠి కేనియున్

    రిప్లయితొలగించండి
  3. వేమరు వేడినన్ వినదు, వీడదు పట్టిన పట్టు నక్కటా!
    యేమనెదన్? ప్రియాత్మజుని, యిక్ష్వకులాబ్ధికి సోము! రామునిన్
    ప్రేమను త్రుంచి పంపుమనె భీకర కానలకున్ వసింప నారామ! మనోరథమ్ము భళిరా! నెరవేర్చెను కైక రాణియై!

    రిప్లయితొలగించండి


  4. మువ్వురు మునులు శాపము ఇచ్చిరట
    సతీ వియోగమున నీవు తపించెదవని
    ఔరా,వారి శాపమ్ము నెరవెర్ప,రామ
    రామ, మనోరథమ్ము భళిరా నెరవేర్చెను కైక రాణియై!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. రాముని బెంచు పుణ్యమది రామకు దక్కెను భాగ్య,మెప్పుడున్
    ప్రేమను జూపితల్లి గను పేరిమి కేకయ రాకుమారి, యా
    కోమలి దైత్య సంహరణకున్ పతి యొద్ద వరమ్ముల కోరుచున్
    రామ మనోరథమ్ము భళిరా నెరవేర్చెను కైక రాణియై!

    రిప్లయితొలగించండి
  6. రాముని బెంచు పుణ్యమది రామకు దక్కెను భాగ్య,మెప్పుడున్
    ప్రేమను జూపితల్లి గను పేరిమి కేకయ రాకుమారి, యా
    కోమలి దైత్య సంహరణకున్ పతి యొద్ద వరమ్ము కోరుచున్
    రామ మనోరథమ్ము భళిరా నెరవేర్చెను కైక రాణియై!

    రిప్లయితొలగించండి
  7. ఏమని ద్వారపాలకుల కిచ్చెనొ యా వర మాచరింపగన్
    సేమము నీయ నీ జగతిఁ శ్రీరఘు రాముడు ధర్మమూర్తిగా
    భూమిన పల్లెపల్లెలను మ్రొక్కెడు నీయవ తారమెత్త నా
    రామ మనోరథమ్ము భళిరా నెరవేర్చెను కైక రాణియై!

    రిప్లయితొలగించండి
  8. నీమము వీడి నారదుడు నేరక యాహరినే శపింపగా
    యేమని జెప్పుదున్ మునుపు నేమరు పాటున కైక కోర్కెయై
    సోముని వంటి రాముగని శోకము నొందుచు ప్రేమ మీరగా
    రామ మనోరధమ్ము భళిరా నెర వేర్చెను కైక రాణియై !

    రిప్లయితొలగించండి
  9. ఈనాటి సమస్యకు మనోహరమైన పూరణలు చెప్పిన కవిమిత్రులు....
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    పండిత నేమాని వారికి,
    మిస్సన్న గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    సహదేవుడు గారికి,
    రాజేశ్వరి అక్కయ్య గారికి
    అభినందనలు, ధన్యవాదములు.
    *
    జిలేబీ గారూ,
    మీ భావానికి ఎవరైనా పద్యరూపం ఇస్తారేమో అని చూసాను. ప్చ్! అయినా స్పందించినందుకు మీకు అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    ‘ఇక్ష్వాకు కులాబ్ధికి సోము’ కంటే ‘ఇక్ష్వాకు కులాబ్ధి శశాంకు’ అంటే ఎలా ఉంటుందంటారు?
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యంలో అన్వయలోపం ఉన్నట్టు నా అనుమానం?

    రిప్లయితొలగించండి
  10. కలియుగ రామాయణం:

    జామున జామునన్ జరుగు స్ట్రైకులు బందులు రాళ్ళు రువ్వుటల్
    భామల కేకలన్ గనుచు భద్రత లేదని నిశ్చయించుచున్
    గోముగ కాననమ్ములకు గొప్పగు రీతిని పారదల్చెడిన్
    రామ మనోరథమ్ము భళిరా నెరవేర్చెను కైక రాణియై!

    రిప్లయితొలగించండి