6, డిసెంబర్ 2012, గురువారం

శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రము

శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రము

వందే సుబ్రహ్మణ్యం
వందే సేనాన్య మఖిల భక్త శరణ్యమ్|
వందే బుధాగ్రగణ్యం
వందే నాగార్చితం శివాతనయమహమ్||


వందే తారకహారిం
వందే శక్రాది దేవ వందిత చరణమ్|
వందే రుద్రాత్మభవం
వందే షాణ్మాతురం శివాతనయమమ్||


వందే వల్లీసహితం
వందే కరుణాకరం శుభప్రద మూర్తిమ్|
వందే మయూరవాహం
వందే వరదం గుహం శివాతనయమహమ్||


వందే వీరవరేణ్యం
వందే వందారు భక్తవర సురభూజమ్|
వందే భవ భయహారిం
వందే గణపానుజం శివాతనయమహమ్||


వందే శరవణజనితం
వందే జ్ఞాన ప్రభావిభాసుర మమలమ్|
వందే పరమానందం
వందే ముక్తిప్రదం శివాతనయమహమ్||


వందే కుమారదేవం
వందే గాంగేయ మగ్నిభవ మమరనుతమ్|
వందే వరశక్తిధరం
వందే మంగళకరం శివాతనయమహమ్||


వందే సుందరరూపం
వందే వేదాంత రమ్య వనసంచారిమ్|
వందే సురదళనాథం
వందే జ్ఞానప్రదం శివాతనయమహమ్||


వందే భవ్యచరిత్రం
వందే శుభగాత్ర మబ్జపత్ర సునేత్రమ్|
వందే పరమపవిత్రం
వందే వల్లీప్రియం శివాతనయమహమ్||


తారకు సంహరించుటకు ద్ర్యక్షకుమారుడవై జనించి నీ
వారు దినాల ప్రాయమున నాహవరంగమునందు శత్రు సం
హారమొనర్చినాడవు కదా! బళిరా! అరి వీర భీకరా!
ఆరుమొగాలసామి! రిపు లార్వుర గూల్చుము నా మనమ్ములో.


భవసుత వాసమ! పళనీ!
వివిధైశ్వర్యముల నిధిగ వెలుగొందు గిరీ!
ప్రవిమలమతి నిను గాంచిన
భవ భయహర మగును పరమ పావన చరితా!


పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

3 కామెంట్‌లు:

 1. మిత్రులారా!
  2011 మే నెలలో నేను అమెరికాలో నున్నప్పుడు నాకు వరుసగా 3 వారములలో కలలో 3 మారులు నాగు పాములు కనుపించినవి. ఏ నాడును భయంకరముగా లేవు. 3వ మారు చాలా పెద్దది తెల్లనిది దర్శన మిచ్చినది. ఆ మరునాడు నేను ఈ సుబ్రహ్మణ్య స్తోత్రమును వ్రాసితిని. 3 గంటలలో ఈ స్తోత్రము పూర్తి అయినది. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 2. శక్తి హస్తుని పై నిన్ని శ్రధ్ధ గలిగి
  భక్తి మీరగ వ్రాయంగ పద్యములను
  శక్తి హస్తుడ వయ్య యాసక్తి తోడ
  చదువ కరుణను జూపునా స్కందు డెపుడు.

  రిప్లయితొలగించండి
 3. నెమలి వాహన ! గరు ణిం చు మమ్ము నెపుడు
  పుట్ట లోపల బోయుదు పొదు గు పాలు
  చవితి చవితికి దప్పక నవి ర ళ ముగ
  ఆర గించుము కడుపార హాయి గాను

  రిప్లయితొలగించండి