భూతలమందు నీ భరతభూమి వధూటికి జర్గినట్టి ఈ జాతి శిరస్సువాల్చుకొను సంఘటనన్ గని నిద్రరాక నా చేతములో విచారమును జేయుచునుండ సమాప్తమాయె నీ రాతిరి, తూర్పుకొండ లభిరామము లైనవి సూర్య కాంతితో .
పోతన వంటి యా కవులు భోగము లందెడి రాజ రాజు లన్ ప్రీతిక ప్రస్తు తించి మది భేషజ మొందగ కావ్య కల్ప నల్ శీతల గాలులన్ మురిసి సేదను దీరి సుఖంబు నుండ నా రాతిరి తూర్పు కొండ లభిరామము లైనవి సూర్య కాంతు లన్ !
ఈనాటి సమస్యకు చక్కని పూరణలు వ్రాసిన కవిమిత్రులు... పండిత నేమాని వారికి, తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి, లక్ష్మీదేవి గారికి, సహదేవుడు గారికి, నాగరాజు రవీందర్ గారికి, గండూరి లక్ష్మీనారాయణ గారికి, రాజేశ్వరి అక్కయ్య గారికి, అభినందనలు, ధన్యవాదములు. * తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ, మీ పద్యంలో ‘ఈయెడన్’ టైపాటు వల్ల ‘ఈయడన్’ అయినట్టుంది. * రాజేశ్వరి అక్కయ్యా, ‘ప్రీతిగ’ టైపాటు వల్ల ‘ప్రీతిక’ అయింది.
ఈ తరుణమ్ము మంగళములిచ్చు శుభోదయమౌ, గతించగా
రిప్లయితొలగించండిరాతిరి, తూర్పు కొండ లభిరామము లైనవి సూర్యకాంతులన్
జేతము పల్లవింప సరసీరుహ బృందములెల్ల విచ్చె సూ
ర్యాతపమందు సంబరము నందుచునుండెను చక్రవాకముల్
ఆతప మన్నదీ జగతి కాప్తము జీవజనాళి ప్రాణమై
రిప్లయితొలగించండిచేతము లుల్లసిల్లగను జేయును, శారద రాత్రులంతటన్
శీతల బాధయౌ చలిని శీర్ణము జేయగ వెళ్ళెనీయడన్
రాతిరి, తూర్పు కొండలభిరామములైనవి సూర్య కాంతులన్.
భూతలమందు వర్షణము పొంగగ వాగులు నెల్ల చోటులన్
రిప్లయితొలగించండికాతరులైరి యెల్లరట కాటుక మబ్బుల ధాటికె,ట్టులో
శీతల మంద వాయువులచే వణికించెడు వేళ, సాగె నా
రాతిరి; తూర్పుకొండ లభిరామము లైనవి సూర్యకాంతులన్.
భూతల మెల్ల భీతిగొను వార్త! యుగాంతమంచు నా
రిప్లయితొలగించండిరాతలఁ జూచి మాధ్యపు రాక్షస పోకడతోఁ గతించె నా
రాతిరి, తూర్పు కొండలభిరామము లైనవి సూర్యకాంతులన్
చేతన పొందె జీవనము శీతల గాలుల చిద్విలాసమై!
శ్రీగురుభ్యోనమః మొదటి పాదంలో ఒక పదం టైపులో మిస్సయింది
రిప్లయితొలగించండి'భూతలమెల్ల భీతిగొను ముష్కర వార్త! యుగాంతమంచు నా '
శీతల చంద్రికా తతులు క్షీరపు టేరుల భంగి తారలన్
రిప్లయితొలగించండిభూతల మందునన్ బరగె పున్నమి జాబిలి కాంతు లీనగన్
శ్వేత నగమ్ముపై నరిగి చెందురు డంతట గ్రుంక వీడె నా
రాతిరి, తూర్పుకొండ లభిరామము లైనవి సూర్యకాంతులన్.
సవరణలతో పూర్తి పద్యం:
రిప్లయితొలగించండిభూతలమెల్ల భీతిగొను ముష్కర వార్త! యుగాంతమంచు! నా
రాతలఁజూచి మాధ్యమపు రాక్షస పోకడతో గతించె నా
రాతిరి, తూర్పుకొండలభిరామము లైనవి సూర్యకాంతులన్
చేతన పొందె జీవనము శీతల గాలుల చిద్విలాసమై
భూతలమందు నీ భరతభూమి వధూటికి జర్గినట్టి ఈ
రిప్లయితొలగించండిజాతి శిరస్సువాల్చుకొను సంఘటనన్ గని నిద్రరాక నా
చేతములో విచారమును జేయుచునుండ సమాప్తమాయె నీ
రాతిరి, తూర్పుకొండ లభిరామము లైనవి సూర్య కాంతితో .
పోతన వంటి యా కవులు భోగము లందెడి రాజ రాజు లన్
రిప్లయితొలగించండిప్రీతిక ప్రస్తు తించి మది భేషజ మొందగ కావ్య కల్ప నల్
శీతల గాలులన్ మురిసి సేదను దీరి సుఖంబు నుండ నా
రాతిరి తూర్పు కొండ లభిరామము లైనవి సూర్య కాంతు లన్ !
ఈనాటి సమస్యకు చక్కని పూరణలు వ్రాసిన కవిమిత్రులు...
రిప్లయితొలగించండిపండిత నేమాని వారికి,
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
లక్ష్మీదేవి గారికి,
సహదేవుడు గారికి,
నాగరాజు రవీందర్ గారికి,
గండూరి లక్ష్మీనారాయణ గారికి,
రాజేశ్వరి అక్కయ్య గారికి,
అభినందనలు, ధన్యవాదములు.
*
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ,
మీ పద్యంలో ‘ఈయెడన్’ టైపాటు వల్ల ‘ఈయడన్’ అయినట్టుంది.
*
రాజేశ్వరి అక్కయ్యా,
‘ప్రీతిగ’ టైపాటు వల్ల ‘ప్రీతిక’ అయింది.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికోతుల మూకలన్ పనిపి ఘోరపు రీతిని కాశ్మిరమ్మునన్
రిప్లయితొలగించండివాతలు పెట్టగోరుచును భారత మాతకు డెబ్బదేండ్లుగా
నీతులు పల్కు పాకులవి నీచపు చేష్టల నన్నిటిన్ భళా
పాతర బెట్టగా నమితు పండుగ జేయుచు నిన్న నాటిదౌ
రాతిరి;...తూర్పుకొండ లభిరామము లైనవి సూర్యకాంతులన్