అమ్మా! లక్ష్మీ దేవి గారూ! శుభాశీస్సులు. మీ పద్యములో నామ స్మరణ అనే సమాసమును వాడేరు. అందులో నామ అనే పదములో మ గురువు అగును కదా. గణభంగము అగును కాబట్టి కొంచెము మార్చండి. స్వస్తి.
నిండు చూలాలు కదలక నుండు నెపుడు? దైవ సుప్రసాదఫలంబు దక్కునెటుల? ఘనులతో మైత్రి చేసిన కలుగు నేమి? గ్రహణ కాలమ్మునఁ దినినఁ గలుగు మేలు.
ఈ క్రింది సమస్యను పూరణ చేయమని ఒక కవిమిత్రులడిగిరి. శంకరయ్యగారివైపు చూస్తున్నాను.ఏమి చేస్తారోనని. "అల్లుడు మామపై కినిసి అక్కట!ఎక్కునె అల్కపాన్పుపై" అజ్ఞాతగారూ! lekhini.org అని బ్రౌజ్ చేస్తే లేఖిని వస్తుంది. దానిలో పైనున్న పెట్టెలో మీరు ఆంగ్లంలో వ్రాస్తే క్రొందనున్న పెట్టెలో తెలుగులో కనిపిస్తుంది. దానిని సేవ్ చేసి, మనకు కావలసిన చోట పేష్ట్ చేస్తే తెలుగులో మీ అభిప్రాయం వెలువరించినట్లౌతుంది. మీకు తెలిదేమోననే భావనతో వ్రాస్తున్నానంతే. తప్పైతే శంకరయ్య గారు మన్నించ గలరు. నమస్తే.
సమస్యకు చక్కని పూరణలు అందజేసిన కవిమిత్రులు... పండిత నేమాని వారికి, లక్ష్మీదేవి గారికి, అజ్ఞాత గారికి, సుబ్బారావు గారికి, మిస్సన్న గారికి, సహదేవుడు గారికి, గండూరి లక్ష్మినారాయణ గారికి, చింతా రామకృష్ణారావు గారికి, చంద్రశేఖర్ గారికి, రాజేశ్వరి అక్కయ్య గారికి, అభినందనలు, ధన్యవాదములు. * చింతా వారూ, మీ రిచ్చిన సమస్యను మొన్ననే చూసాను. ఈ మధ్య తీరిక లేని పనుల వల్ల సమయం చిక్కడంలేదు, పైగా ఆరోగ్యం బాగుండడం లేదు. వీలైనంత త్వరగా మీ సమస్యకు నా పూరణ అందజేస్తాను. ధన్యవాదాలు. ‘మన తెలుగు’ చంద్రశేఖర్ గారు మీ సమస్యకు ఒక పూరణ అందించారు. చూసారా?
గ్రహణ కాలమ్మున దినిన గలుగు మేలు
రిప్లయితొలగించండిమేలనుట దప్పు కద జంతు జాలములును
తినవు, తినినచో నెవరేని దీర్ఘ కాల
రోగముల పాలగుట లెస్స లోకమందు
వంటకములెల్లపుడు చల్ల బఱచ నేల?
రిప్లయితొలగించండివేడి గా భుజియింపుమా ప్రీతితోడ.
పత్ని వడ్డన జేయగ పతియును పరి
గ్రహణ కాలమ్మునఁ దినినఁ గలుగు మేలు.
పరిగ్రహణము = స్వీకరించుట (వెంటనే తినమనుట.)
దైవమును భక్తి తోడను దలచి నామ
స్మరణ చేయదగు నాయనా, జపము జేయి
గ్రహణ కాలమ్మునఁ; దినినఁ గలుగు మేలు
గ్రహణ స్నానము పిదపయె గనుము బాల.
Brahmanunemaata kanuka oo ! baava, paaNe
రిప్లయితొలగించండిgrahaNa kaalammuna dinina galugu mealu
yakka yemgili maamumdu haaye gaanu
thinuduyanuchu maradalechye theepi laddu
గ్రహణ కాల మ్మున దినిన గలుగు మేలు
రిప్లయితొలగించండిననుట సరి కాదు నరయగ నార్యు లార !
కడుపు నొప్పులు మఱియును గాలు నొప్పి
వివిధ రకముల రోగంబు లవియు వచ్చు .
అమ్మా! లక్ష్మీ దేవి గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యములో నామ స్మరణ అనే సమాసమును వాడేరు. అందులో నామ అనే పదములో మ గురువు అగును కదా. గణభంగము అగును కాబట్టి కొంచెము మార్చండి. స్వస్తి.
ధాతు పుష్టిని జేయును దంపతులకు
రిప్లయితొలగించండిమంగళ ప్రదమై యొప్పు మహిత రీతి
సుమధు పర్కము దివ్యము సూ! కరముల
గ్రహణ కాలమ్మున దినిన గలుగు మేలు.
సాంప్ర దాయమున్ గాదని సణగు వారు
రిప్లయితొలగించండి'గ్రహణ కాలమ్మునఁ దినిన గలుఁగు మేలు'
మేము తినెదము రండని గోము గనరె!
ఋషుల వాక్కులు వలయునా ఋజువు లికట?
" గ్రహణ కాలమ్మున దినిన కలుగు మేలు "
రిప్లయితొలగించండిఅనుట యనుచితంబని జ్ఞాను లందు రెపుడు
సమ్మతించరు విజ్ఞాన శాస్త్ర బుధులు
కీడు మేలేది లేదంద్రు కూడు తినిన
అయ్యా,
రిప్లయితొలగించండిధన్యవాదములు. ఆ పాదమును ఇట్లు సవరించి.....
దైవమును భక్తి తోడను దలచి కొనుచు
గమనించగలరని వినతి చేయుచున్నాను.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితలచికొనుచు, స్మరణ చేయుచు అని పునరుక్తి అవుతున్నది. గ్రహణ స్నానమును కూడా మార్చి...
రిప్లయితొలగించండిఈ విధముగా మార్చి ప్రచురిస్తున్నాను.
దైవమును భక్తి తోడ మోదమలరంగ
స్మరణ చేయదగు నాయనా, జపము జేయి
గ్రహణ కాలమ్మునఁ; దినినఁ గలుగు మేలు
గ్రహణము పిదప స్నానపు క్రమము వెనుక.
నిండు చూలాలు కదలక నుండు నెపుడు?
రిప్లయితొలగించండిదైవ సుప్రసాదఫలంబు దక్కునెటుల?
ఘనులతో మైత్రి చేసిన కలుగు నేమి?
గ్రహణ కాలమ్మునఁ దినినఁ గలుగు మేలు.
ఈ క్రింది సమస్యను పూరణ చేయమని ఒక కవిమిత్రులడిగిరి. శంకరయ్యగారివైపు చూస్తున్నాను.ఏమి చేస్తారోనని.
"అల్లుడు మామపై కినిసి అక్కట!ఎక్కునె అల్కపాన్పుపై"
అజ్ఞాతగారూ! lekhini.org అని బ్రౌజ్ చేస్తే లేఖిని వస్తుంది. దానిలో పైనున్న పెట్టెలో మీరు ఆంగ్లంలో వ్రాస్తే క్రొందనున్న పెట్టెలో తెలుగులో కనిపిస్తుంది. దానిని సేవ్ చేసి, మనకు కావలసిన చోట పేష్ట్ చేస్తే తెలుగులో మీ అభిప్రాయం వెలువరించినట్లౌతుంది. మీకు తెలిదేమోననే భావనతో వ్రాస్తున్నానంతే. తప్పైతే శంకరయ్య గారు మన్నించ గలరు. నమస్తే.
బ్రాహ్మణుని మాట గనుక ఓ బావ పాణి
రిప్లయితొలగించండిగ్రహణ కాలమ్మున దినిన గలుగు మేలు
యక్క ఎంగిలి మాముఒదు హాయిగాను
దినుదుయనుచు మరదలిచ్హె తీపి లడ్డు
బ్రాహ్మణుని మాట గనుక ఓ బావ పాణి
రిప్లయితొలగించండిగ్రహణ కాలమ్మున దినిన గలుగు మేలు
యక్క ఎంగిలి మాముఒదు హాయిగాను
దినుదుయనుచు మరదలిచ్హె తీపి లడ్డు
గోఘృతము శరీరమునకు కుశల మన్ని
రిప్లయితొలగించండివేళలఁ దినదగు మరి వివిధ విశేష
ఫల మిచ్చునది ప్రకృతి వైద్య పథ్య
గ్రహణకాలమ్మునఁ దినినఁ గలుఁగు మేలు.
శ్రీ చింతా వారి సమస్యకి నా పూరణ, హాస్యోక్తిగా:
రిప్లయితొలగించండిచెల్లెలి పెళ్ళికిన్ వలయు చిన్నము బంగరు టుంగరంబు నే
మెల్లగ నాదు మామకును మెల్కెలు వేయుచు పట్టఁజూడ నా
తల్లియు మందలించె నను దండుగ మాటలు మానుమింకరో
"అల్లుడు మామపై కినిసి అక్కట!ఎక్కునె అల్కపాన్పుపై"
రజత పళ్ళెర ముననవ రసము లొలుక
రిప్లయితొలగించండికలసి భుజియింప భాగ్యము కలుగు ననుచు
నొకటియై సుఖముల శాంతి నొంద పాణి
గ్రహణ కాలమ్మున దినిన గలుగు మేలు !
క్షమించాలి నేను సరిగా గమనించ లేదు " మా అబ్బాయి మెయిల్ ఐ డి . లోంచి వచ్చింది .ఇక మళ్ళీ నేను సైన్ ఔట్ చేయ లేదు
రిప్లయితొలగించండిసమస్యకు చక్కని పూరణలు అందజేసిన కవిమిత్రులు...
రిప్లయితొలగించండిపండిత నేమాని వారికి,
లక్ష్మీదేవి గారికి,
అజ్ఞాత గారికి,
సుబ్బారావు గారికి,
మిస్సన్న గారికి,
సహదేవుడు గారికి,
గండూరి లక్ష్మినారాయణ గారికి,
చింతా రామకృష్ణారావు గారికి,
చంద్రశేఖర్ గారికి,
రాజేశ్వరి అక్కయ్య గారికి,
అభినందనలు, ధన్యవాదములు.
*
చింతా వారూ,
మీ రిచ్చిన సమస్యను మొన్ననే చూసాను.
ఈ మధ్య తీరిక లేని పనుల వల్ల సమయం చిక్కడంలేదు, పైగా ఆరోగ్యం బాగుండడం లేదు. వీలైనంత త్వరగా మీ సమస్యకు నా పూరణ అందజేస్తాను. ధన్యవాదాలు.
‘మన తెలుగు’ చంద్రశేఖర్ గారు మీ సమస్యకు ఒక పూరణ అందించారు. చూసారా?