బాపురే! తెలుగు
భండారు శ్రీనివాసరావు గారు ఫేస్‌బుక్‌లో ఆసక్తికరమైన క్రింది విషయాన్ని పోస్ట్ చేసారు.
AN AMAZING SENTENCE IN ENGLISH
Remarkable indeed ! The person who made this sentence must be a GENIUS in English vocabulary.
"I do not know where family doctors acquired illegibly perplexing handwriting; nevertheless, extraordinary pharmaceutical intellectuality, counterbalancing indecipherability transcendentalizes intercommunication's incomprehensibleness."
పై వాక్యంలో మొదటి పదం ఒక అక్షరం, రెండవ పదం రెండక్షరాలు, మూడవ పదం మూడక్షరాలు.... ఇలా ఇరవయ్యవ పదం ఇరవై అక్షరాలతో ఉన్నాయి.
దీనికి ప్రతిగా ఏల్చూరి మురళీధరరావు గారు ఫేస్‌బుక్‌లో వ్రాసిన తెలుగు వాక్యం. “మిత్రవినోదంకరణగా మీకు విన్నవిస్తున్నాను; మేధావద్విశిష్టతకు కాదు ...” అని కూడా ప్రకటించారు.
“ఏ మంచి కవైనా విశ్వనాథ గ్రంథావళిని చదవకపోతే కవిత్వరచనలో పద్యనిర్మాణశక్తికి, సద్గుణాలంకారవ్యక్తికి,
రసోచితశబ్దార్థయుక్తికి, సుమకోమలభావభావనకు, నవ్యసంప్రదాయపదగుంఫనకు, భవ్యరసాస్వాదరసాయనవాణికి, పురుషార్థోచితచిత్తవృత్తిచిత్రణకు, భారతీయతామరందాస్వాదలోలుపతకు, అతిలోకచమత్కృతిమత్కృతిమత్ప్రతీతికి, విషయచింతానిరోధనిశ్చలసమాధ్యవస్థకు, విపంచీస్వరసౌభాగ్యబంధురశయ్యావైయాత్యానికి, ఉత్కృష్టలోకసిద్ధార్థమహాపురుషగుణకీర్తనకు, రమణీయార్థనిర్మితశ్రవణమనోహరకావ్యలక్ష్మికి, నానార్థస్ఫోటవాచకత్వసంయోగాదినియమితవ్యంజనకు, అభిధావివక్షితాన్యపరవాచ్యసంలక్ష్యక్రమభావధ్వనికి, శృంగారవీరకరుణహాస్యరౌద్రాద్భుతశాంతాదిరసప్రతీతికి, గిరిశిఖరపతన్నిరర్గళస్రవంతీనిరుపమానధారాశుద్ధికి, ధర్మజ్ఞానభక్తిప్రేమసత్యాద్యుత్తమాదర్శప్రతిపాద్యవస్తుస్వీకృతికి, సహృదయహృదయవాసనాపరీపాకభావనాప్రపంచశోభాదూరవర్తే!
పై వాక్యంలో 26 పదాలున్నాయి. మొదటి పదం ఒక అక్షరం, రెండవ పదం రెండక్షరాలు, మూడవ పదం మూడక్షరాలు.... ఇలా ఇరవై ఆరవ పదం ఇరవైయారు అక్షరాలతో ఉన్నాయి.
1. ఏ
2. మంచి
3. కవైనా
4. విశ్వనాథ
5. గ్రంథావళిని
6. చదవకపోతే
7. కవిత్వరచనలో
8. పద్యనిర్మాణశక్తికి,
9. సద్గుణాలంకారవ్యక్తికి,
10. రసోచితశబ్దార్థయుక్తికి,
11. సుమకోమలభావభావనకు,
12. నవ్యసంప్రదాయపదగుంఫనకు,
13. భవ్యరసాస్వాదరసాయనవాణికి,
14. పురుషార్థోచితచిత్తవృత్తిచిత్రణకు,
15. భారతీయతామరందాస్వాదలోలుపతకు,
16. అతిలోకచమత్కృతిమత్కృతిమత్ప్రతీతికి,
17. విషయచింతానిరోధనిశ్చలసమాధ్యవస్థకు,
18. విపంచీస్వరసౌభాగ్యబంధురశయ్యావైయాత్యానికి,
19. ఉత్కృష్టలోకసిద్ధార్థమహాపురుషగుణకీర్తనకు,
20. రమణీయార్థనిర్మితశ్రవణమనోహరకావ్యలక్ష్మికి,
21. నానార్థస్ఫోటవాచకత్వసంయోగాదినియమితవ్యంజనకు,
22. అభిధావివక్షితాన్యపరవాచ్యసంలక్ష్యక్రమభావధ్వనికి,
23. శృంగారవీరకరుణహాస్యరౌద్రాద్భుతశాంతాదిరసప్రతీతికి,
24. గిరిశిఖరపతన్నిరర్గళస్రవంతీనిరుపమానధారాశుద్ధికి,
25. ధర్మజ్ఞానభక్తిప్రేమసత్యాద్యుత్తమాదర్శప్రతిపాద్యవస్తుస్వీకృతికి,
26. సహృదయహృదయవాసనాపరీపాకభావనాప్రపంచశోభాదూరవర్తే!
ఫేస్‌బుక్‌లో కనిపించిన దీనిని అనుమతి లేకుండా బ్లాగులో ప్రకటించినందుకు మన్నించమని వారికి విన్నపం. భండారు శ్రీనివాస రావు గారికి, ఏల్చూరి మురళీధర రావు గారికి ధన్యవాదములు.

మిత్రులారా!
రిప్లయితొలగించండిచి. డా. ఏల్చూరి మురళీధర రావు గారి ప్రతిభ అనూహ్యము - అద్భుతము - అప్రతిమానము - ప్రశంసనీయము. వారికి మా శుభాశీస్సులు. ఈ మధ్య వారు మన బ్లాగులో కనుపించుట లేదు. కాస్త సమయము ప్రతిదినము మన బ్లాగుకై కూడా వెచ్చించుతుంటే మనకు ఆనందము కదా. స్వస్తి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశంకరయ్య గారు,
రిప్లయితొలగించండి16 నుండి 26 వరకు గల సమాసాల అర్ధాలు దయచెసి రాయగలరు.
-శ్రీరాం
గురువుగారు,
రిప్లయితొలగించండిమురళీధరరావు గారి ప్రతిభను చూస్తే ఆశ్చర్యానందాలు కలుగుతున్నాయి.
వారికి నా ప్రణామములు.
మీకు ధన్యవాదములు.
అత్యంత అద్భుతమండీ!
రిప్లయితొలగించండిసరస్వతీ స్వరూపులు డా. ఏల్చూరి వారు.
అద్భుతమైన కవిత్వ పటుత్వ సంపదలున్న శ్రీ ఏల్చూరి వారి కవిత్వం అమోఘం.
రిప్లయితొలగించండిఅసమాన భాషా పటిమ గలిగిన శ్రీ యేల్చూరి గారి ప్రతిభకు నమస్సులు. 26 కాదు 100 వరకయినా వ్రాయగల సమర్ధులు.
రిప్లయితొలగించండిఅప్రతిమాన వైదుష్యం అనన్యసామాన్యంగా రచించిన ఏల్చూరి మురళీధర రావు గారిని ప్రశంసించిన
రిప్లయితొలగించండిపండిత నేమాని వారికి,
లక్ష్మీదేవి గారికి,
మిస్సన్న గారికి,
మారెళ్ళ వామన్ కుమార్ గారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
ధన్యవాదములు.
*
శ్రీరాం గారూ,
ధన్యవాదములు.
ప్రతిపదార్థాలు చెప్పలంటే నాకు కొద్దిగా వ్యవధి కావాలి.
పూజ్యులందరికి ప్రణామములు!
రిప్లయితొలగించండినిండు సహృదయంతో నేనేదో మిత్రవినోదంకరణార్థమై వ్రాసిన శ్రీ విశ్వనాథ వారి నివాళి వాక్యాన్ని అభిమానంతో ఆదరించి, అనర్ఘమైన “శంకరాభరణం” బ్లాగులో ప్రకటించి, నాకు అఖండమైన ప్రోత్సాహాన్ని కల్పించిన మాన్యులు శ్రీ కంది శంకరయ్య గారి ఔదార్యానికి, వాత్సల్యానికి, ప్రేమకు కృతజ్ఞతాబద్ధుడనై నమస్సులను అర్పించటం తప్ప ప్రత్యర్పణం ఏమి చేయగలను? తలవంచి నమస్కరించటం తప్ప.
నన్ను, మా ఇంటిల్లిపాదిని ఆశీర్వదించి తీర్పలేని ఋణానికి లోనుచేసిన శ్రీ నేమాని గురుదేవులకు పునఃపునర్ధన్యవాదములు.
ప్రేమాదరాలతో స్పందించిన ఆత్మీయులు, సుకవివరేణ్యులు శ్రీమతి లక్ష్మీదేవి గారికి, శ్రీ మిస్సన్న గారికి, శ్రీ మారెళ్ళ వామన్ కుమార్ గారికి, శ్రీ గోలి హనుమచ్ఛాస్త్రి గారికి, అర్థాకాంక్షను వెలయించిన శ్రీరామ్ గారికి వందనములు.
ఇది శివుని శిరసును అలంకరించిన నెలవంక అంటున్న మాటను వింటున్న అభ్యూహితం:
“భారతీసేవకప్రథుఁ” డన్న మా కంది శంకరయ్య బుధేంద్రు వంకఁ జూతు!
“పద్యవిద్యానిత్యవ్రతుఁ” డన్న మా కంది శంకరయ్య బుధేంద్రు వంకఁ జూతు!
“గురుకవీంద్రాచార్యవరుఁ” డన్న మా కంది శంకరయ్య బుధేంద్రు వంకఁ జూతు!
“దయమీఱు ప్రియసహృదయుఁ”డన్న మా కంది శంకరయ్య బుధేంద్రు వంకఁ జూతు!
శంకరయ్య బుధేంద్రుని వంకఁ జూచి
సర్వసుఖములు గూర్పు నా స్వామి!” యనుచుఁ
గళలు తళుకొత్త, మోము వెన్నెలలు విరియ
శంకరయ్య నడుగు నెలవంకఁ జూతు.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిaapthulu sri muralidhara rao gaaru chesina ee prayatnamu vinootnamayinadani naa abhipraaayamu.anthe kaaadu- chaalaa prathibhaavantahamayinadi koodaa.vaari loni saraswatheemoorthi ki namovaakamulu.prachurinchi -paathaka lokaaniki vindu chesina sri shankaraiah gaaariki vandanamulu.krutajnatalu.-voleti venkata subbarao, vernon hills IL-60061.USA.
రిప్లయితొలగించండిపరిణతి కల్గు సత్కవికి పల్కగ లేనిదదేమియుండు నే
రిప్లయితొలగించండిల్చురికి నసాధ్యమేది?కవి. సుందర సద్గుణ శోభితుండు తా
వరముగగొన్న సత్కవన భాగ్యుడు. నిక్కము. శంకరార్య!మీ
సరి యగు నాతఁడున్. సుజన సంగతి మాకులభించె మీ కృపన్.
శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారి ప్రతిభా వ్యుత్పత్తులు అసాధారణమైనవి , వారి అసమాన పాండిత్యానికి జేజేలు. మన తెలుగు భాష ప్రకారం విభక్తులు ప్రత్యేక పదములుగా పరిగణించవలెనా లేదా అన్నది సందేహము . పై వాక్యాలలో "కి , కు " మొదలైన విభక్తులను ఒకే పదములో కలిపినారు కదా ,అలా కలుపకపోయినచో ఒకే పదమునకు 26 అక్షరములు వచ్చుటెట్లు ?
రిప్లయితొలగించండిపూజ్యప్రాజ్యులు శ్రీ చింతా రామకృష్ణారావు గారి హృద్యమైన నేటి ఆశీర్వచనపద్యానికి ధన్యవాదాలు!
రిప్లయితొలగించండిదానిని ఔదల దాల్చి, మనసులోనూ భద్రంగా నిలుపుకొంటాను.
శ్రీ అజ్ఞాత గారి వాత్సల్యపూర్ణవాక్యావళికి కృతజ్ఞుణ్ణి.
“పదము”ను గూర్చిన వారి ప్రస్తావనకు నాకు తోచిన నాలుగు మాటలు:
“పదమనఁగాఁ బ్రయోగార్హంబు ననన్వితంబు నేకంబు నర్థబోధకంబు నైన వర్ణము లేక వర్ణసముదాయము." అని ప్రౌఢవ్యాకరణం (వాక్య: సూ. 2).
"ఖంబు" లేక "ఘటంబు” మొǁ ప్రయోగార్హంబు" అని వృత్తి.
"ఘట - ప్రాతిపదికం; "ము" విభక్తికి "ంబు" ఆదేశమై, "ఘటంబు" ఏర్పడింది. ఇది ఏకపదంగా ప్రయోగార్హం.
అంతకు ముందే - యోగ్యతాకాంక్షాసహితమైన అర్థం కలిగిన ఆసత్తియుక్త పదసముదాయం వాక్యం అని బహుజనపల్లి వారి సూత్రం.
"నిప్పుచేఁ దడుపుచున్నాఁడు" అన్నప్పుడు "నిప్పుచేఁ" ఒక పదము; "తడుపుచున్నాఁడు" వేఱొకపదము - అని వంతరాం రామకృష్ణారావు గారి ఘంటాపథ వ్యాఖ్య.
తృతీయావిభక్తియుతమైన "నిప్పుచేన్" ఒక పదం అవుతుంది.
"సుప్ తిఙన్తం పదం" కనుక నామ (లేదా) క్రియా విభక్తిప్రత్యయం వచ్చే వఱకు - అందులో అవాంతరంగా ఎన్ని పదాలున్నా - అది ఏకపదం గానే పరిగణింపబడుతుంది.
"నీలోజ్జ్వలవపుః" ఒక సమస్తపదం.
"నీల+ఉజ్జ్వల+వపు+స్" కనుక.
"ద్వాభ్యాం పదాభ్యాం బహుభిః పదైర్వా
సంఖ్యోభయోస్సా పదయోః పదాగ్రే
యస్యా భవత్పూర్వపదే సహశ్చ
దిగంతరాల - వ్యతిహార లక్ష్మాః"
అని అందులో అవాంతరంగా ఎన్ని పదాలైనా ఉన్నట్లే, ఇందులోనూ విభక్త్యంతం వఱకు ఒక పదంగా ఊహించాను.
“మహేశ్వర ప్రసాద సమాసాదిత మహారాజాధిరాజ రాజపరమేశ్వర ప్రభృతి బిరుద సముట్టంకిత ఢక్కా గభీర భూరి భేరీ భయంకర భాంకార హఠాత్కార శ్రవణ ఝటితి ఘటిత వైహ్వల్య పరిపంథి వసుంధరా రమణుండును"
అని మతుకుమల్లి నరసింహశాస్త్రి గారి "చెన్నపురీ విలాసము".
మీరన్నట్లుగానే, ఆ విధంగా కాకపోతే - తెలుగులో ప్రతికృతిని కల్పించటం అసలేమాత్రం సాధ్యమే కాదు.
మీ సహృదయస్పందనకు ధన్యవాదాలు.
వ్యాఖ్య సుదీర్ఘమైనందుకు పెద్దలు మన్నించాలి.
పితృతుల్యులు, పూజ్యులు శ్రీ వోలేటి వెంకట సుబ్బారావు గారి ఆశీర్వచన శుభవాణికి నా మనఃపూర్వక నమఃపూర్వక ధన్యవాదములు ... !
రిప్లయితొలగించండిసరస్వతీ పుత్రులకు ప్రణమాంజలి
రిప్లయితొలగించండిసరస్వతీ పుత్రులకు ప్రణమాంజలి
రిప్లయితొలగించండి