14, డిసెంబర్ 2012, శుక్రవారం

పద్య రచన - 190

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

10 కామెంట్‌లు:

 1. వరి కోతలు పూర్తాయెను
  సరి నూర్పిడి జేసి కుప్ప చక్కగ బెట్టెన్
  మరి పంటకు ధర బలుకున
  ధర నిలుచున మన కిసాను, దా ' రుణ ' మగునా ?

  రిప్లయితొలగించండి
 2. పంటలు పండె కర్షకుల పాలిటి మేలిమి భాగ్యరాశులౌ
  పంటలు పండె నూర్పులను బాగుగ జేసిరి రైతు సోదరుల్
  కంటికి వెల్గులై యలరగా పెనుపండువు ముందునాళ్ళలో
  నింటికి సోయగమ్ములును హెచ్చెను మెచ్చగ నెల్లవారలున్

  రిప్లయితొలగించండి
 3. వరి కుప్పల జూడం గను
  నరుసము మొదలాయె నెదను నానం దముతోన్
  వరికి ధర బాగు పలికిన
  వరమే యిక రైతు కపుడు వత్సర మంతన్

  రిప్లయితొలగించండి
 4. కనులకు నిండుగా వరుస గడ్డిని వాములనింపి యుంచి, మే
  తను మరి కొంత యెద్దులకు దాచిన రైతుమనమ్మునందు, స్వాం
  తన యను మాట లేదకట! ధర్మము పృథ్విని లేకపోయెనే!
  తన పరివారమే తనకు తప్పని భారము నేడు సోదరా!

  రిప్లయితొలగించండి
 5. కుప్పల నూర్పిడి యైనది
  తిప్పలు బడి రాత్రి పగలు తీరిక లేకన్ !
  అప్పన్న బండి గట్టర
  చప్పున చినుకులు పడినను సర్వము నీరౌ !

  రిప్లయితొలగించండి
 6. గడ్డివాముల మధ్యలో కాపు రైతు
  పరగి ధాన్యమున్ తూర్పార బట్టుచుండ
  బడలిపోవ వృషభములు పంక్తి దిరిగి
  కల్గుగాక ! పంట లెపుడు కర్షకులకు

  రిప్లయితొలగించండి
 7. కనుల పండువుగా నున్న పంట నూర్పిడి చిత్రంపై స్పందించి మనోహరంగా పద్యాలల్లిన కవిమిత్రులు....
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  పండిత నేమాని వారికి,
  సుబ్బారావు గారికి,
  లక్ష్మీదేవి గారికి,
  రాజేశ్వరి అక్కయ్య గారికి,
  నాగరాజు రవీందర్ గారికి
  అభినందనలు, ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 8. ఇంటి పెద్ద కొడుకుగ నంది నీశు డివ్వ
  వాన జల్లుల విరివిగా వరుణుడివ్వ
  పంట నూర్పిళ్ళ ధాన్యంబు బస్తి జేరు!
  గడ్డి వాములే యెద్దుల గాట జేరు!

  రిప్లయితొలగించండి
 9. సహదేవుడు గారూ,
  బాగుంది మీ పద్యం. అభినందనలు.
  మొదటి పాదంలో గణదోషం. ‘ఇంటి పెద్దపట్టై నంది’ అందామా?

  రిప్లయితొలగించండి