20, డిసెంబర్ 2012, గురువారం

సమస్యా పూరణం - 912 (హనుమత్పుత్రుఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
హనుమత్పుత్రుఁడు వివాహ మాడె హిడింబిన్.

26 కామెంట్‌లు:

 1. విను వంధ్యా పుత్రు వలెన్
  కననగు హనుమత్కుమార కథ! యిక నాపై
  వనిత నతడు చేపట్టుట!!
  హనుమత్పుత్రుఁడు వివాహ మాడె హిడింబిన్!!!

  రిప్లయితొలగించండి
 2. అనె నిట్లు కుంతి చెల్లీ!
  వినుమా భీముండు దివ్య విగ్రహు డసురాం
  గన నతి ధృఢ మోహన దే
  హను మత్పుత్రుడు వివాహ మాడె హిడింబన్

  రిప్లయితొలగించండి
 3. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  ఇది పచ్చి అబద్దం అన్నది నిజం :


  01)
  _______________________________

  హనుమంతుడు స్త్రీ లోలుడు
  హనుమత్పుత్రుఁడు వివాహ - మాడె హిడింబిన్
  అనినంతనె చెవి నిడుదురు
  అనిలాత్ముడు బ్రహ్మచారి - యని యెరుగనిచో !
  _______________________________

  రిప్లయితొలగించండి
 4. నేమాని పండితార్యా! అమోఘమైన విరుపు నిచ్చారు.

  రిప్లయితొలగించండి
 5. ఔను మిస్సన్న మహాశయా !
  నేమానివారి పూరణ అద్భుతం !

  రిప్లయితొలగించండి
 6. మిత్రులారా!
  శుభాశీస్సులు.
  బుద్ధిర్బలం, యశో ధైర్యం
  నిర్భయత్వ మరోగతా
  అజాడ్యం వాక్పటుత్వం చ
  హనుమత్ స్మరణాత్ భవేత్

  అని ఆర్యోక్తి కదా. ఈ పూరణలోని స్ఫూర్తిని ఆ హనుమయే యిచ్చేడు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 7. వినుమీ వింతను హనుమా
  వినినంతనె వెఱగు పడుచు వేగిర పడకన్ !
  జనవా ఖ్యమ్మిది నిజమా ?
  హనుమత్ప్త్రు త్రుడు వివాహ మాడె హిడింబిన్ !

  రిప్లయితొలగించండి
 8. వనజజు డనుకొనె మది - స్వా
  హను మత్పుత్రుడు వివాహమాడె ; హిడింబిన్
  మనువాడె కరువలి కొడుకు
  వనమాలి తనయుడు రతిని పరిణయ మాడెన్

  రిప్లయితొలగించండి
 9. అనిలజుని దలచె కుంతి
  "ఘనుఁడగు వరుఁడని వలచిన కాంతా
  మణి, నా సుందర దృఢ దే
  హను, మత్పుత్రుఁడు వివాహ మాడె హిడింబిన్."

  రిప్లయితొలగించండి
 10. లక్ష్మీదేవి గారూ,
  మీ పూరణలో మొదటి రెండు పాదాల్లో గణదోషం ఉంది.
  'అనిలజుని దలచె కుంతీ
  వనితయె 'ఘనుడగు వరుడని......' అంటే సరి.

  రిప్లయితొలగించండి
 11. కుంతీ దేవి కృష్ణుడితో యిలా అంటున్నది :

  దనుజుని సైదో డటులన్
  వనమున బకవైరిని గని వరియించె నహో !
  వినుము మురారి ! వరారో
  హను మత్పుత్రుడు వివాహమాడె హిడింబిన్

  రిప్లయితొలగించండి
 12. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మగురువారం, డిసెంబర్ 20, 2012 11:39:00 AM

  వినరెయ్యెడ చార్వాకులు
  కనరియ్యెడ భారతాది కావ్యము లెపుడున్
  జనచే తనులిట చెప్ప్పెను
  హనుమత్పుత్రు(డు వివాహ మాడె హిడింబిన్.
  ( జనచైతన్యసంఘాదులు)

  “దేహు+అను+మత్పుత్రుడు” అన్న పద విచ్ఛేదమద్భుతముగా చెప్పిన పండితులవారికి, మంచి పూరణలందించుచున్న మిత్రవత్పూజ్యులందరికి వందనములు.
  నిన్నటి పూరణలో జరిగిన ఘోర తప్పిదమును తెలియజెప్పిన అన్న మిస్సన్న గారికి, గురువు గారికి నమస్సులు. సరస్వతికి పెద్దలకు క్షంతవ్యుడను. మరల ప్రయత్నింతును.

  రిప్లయితొలగించండి
 13. వినుముర గురువులు సెప్పిరి
  హనుమత్పు త్రుడు వివాహ మాడె హిడింబిన్
  ననినంతనె వేగపడక
  ననునయముగ నడిగి తెలియు మసలగు నిజమున్

  రిప్లయితొలగించండి
 14. కుంతి శౌరితో మాటలాడు సందర్భము :

  అనిలాత్మజుండు భీముని
  మనమున తన పతిగ నెంచి మదినే దెల్పన్
  విని సమ్మతించి యా *యీ
  హను, మత్పుత్రుడు వివాహమాడె హిడింబిన్

  *ఈహ = కోరిక

  రిప్లయితొలగించండి
 15. గురువుగారూ ఇదివరలో బ్లాగులో 'ఇటీవలి వ్యాఖ్యలు' కనుపించేవి. ఇపుడు అసలు కనుపించడం లేదు.

  రిప్లయితొలగించండి
 16. మనసిచ్చిన యువతిని మో
  హను మత్పుత్రుడు వివాహమాడె, హిడంబిన్
  ఘన దొర్బలుడగు కుంతీ
  తనయుడు మనువాడె వలసి తప్పా చెపుమా!

  రిప్లయితొలగించండి
 17. మనసికశరబాధితయై,
  యనురాగవతియగునామె నధికప్రీతిన్,
  దనుజవనిత నుద్వాహో
  హను,మత్పుత్రుడు వివాహమాడె హిడింబన్ .

  రిప్లయితొలగించండి
 18. మనసికశరబాధితయై,
  యనురాగవతియగునామె నధికప్రీతిన్,
  దనుజవనిత నుద్వాహో
  హను,మత్పుత్రుడు వివాహమాడె హిడింబన్ .

  రిప్లయితొలగించండి
 19. వినుమా ద్రౌపది ! యపుడా
  వనములలో దిరుగు చుండ వలచిన కన్నెన్
  కననసురులైన సుమదే
  హను, మత్పుత్రుడు వివాహమాడె హిడింబన్ .

  రిప్లయితొలగించండి
 20. వినుమా ద్రౌపది ! యపుడా
  వనములలో దిరుగు చుండ వలచిన కన్నెన్
  కననసుర పుత్రి సుమదే
  హను, మత్పుత్రుడు వివాహమాడె హిడింబన్ .

  రిప్లయితొలగించండి
 21. కవిమిత్రులకు నమస్కృతులు.
  నిన్న హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కు వెళ్ళివచ్చాను. రోజంతా ప్రయాణంలోనే ఉన్నాను. ఇల్లు చేరేసరికి రాత్రి మూడయింది. అందువల్ల నిన్నటి పూరణలు, పద్యాలపై వ్యాఖ్యానించలేకపోయాను. మన్నించండి. ‘కాకతీయ ఉత్సవాల’ హడావుడిలో ఉన్నాను. వీలైతే సాయంత్రం వరకు నా వ్యాఖ్యలను పెట్టే ప్రయత్నం చేస్తాను.
  సమస్యను పూరించిన...
  మిస్సన్న గారికి,
  పండిత నేమాని వారికి,
  వసంత కిశోర్ గారికి,
  రాజేశ్వరి అక్కయ్య గారికి,
  నాగరాజు రవీందర్ గారికి,
  లక్ష్మీదేవి గారికి,
  తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి
  సుబ్బారావు గారికి,
  గండూరి లక్ష్మినారాయణ గారికి,
  కమనీయం గారికి,
  అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 22. మిస్సన్న గారూ,
  ‘ఇటీవలి వ్యాఖ్యలు’ శీర్షిక ఎందుకో తొలగిపోయింది. మళ్ళీ ఆ గాడ్జెట్‌ను చేర్చడానికి ప్రయత్నం చేసాను కాని సఫలం కాలేదు.

  రిప్లయితొలగించండి
 23. మనసైనది నీ మీదను
  మనువాడగ వస్తిననుచు మరులే జూపన్
  తనువలచిన సున్నిత దే
  హను, మత్పుత్రుడు వివాహమాడె హిడింబిన్

  రిప్లయితొలగించండి
 24. అనుకూలవతియు లేకయె
  కనుమూసిన వాడె తాను; కదనము లోనన్
  హనుమానుండౌ ఎం. పీ. ...
  హనుమత్పుత్రుఁడు వివాహ మాడె హిడింబిన్

  రిప్లయితొలగించండి