13, డిసెంబర్ 2012, గురువారం

సమస్యా పూరణం - 905 (పిల్లవానితోఁ బోరాడి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
పిల్లవానితోఁ బోరాడి భీముఁ డోడె.
ఈ సమస్యను పంపిన నాగరాజు రవీందర్ గారికి ధన్యవాదములు.

15 కామెంట్‌లు:

  1. ఆంజనేయుని జూపుచు నతివ యొకతె
    యనెను తన చిన్న సుత తోడ వినుము వినుము
    పిల్ల! వానితో బోరాడి భీము డోడె
    నాంజనేయుడే జగమునం దమిత బలుడు

    రిప్లయితొలగించండి
  2. మల్ల యోధుడు ముద్దుగా మనుమని దరి
    కేగి యాడెను మాపగా నేడ్పు వాని
    గ్రుద్దు తన్నులను తినుచు వద్దని పడి
    పిల్లవానితోఁ బోరాడి భీముఁ డోడె.

    రిప్లయితొలగించండి

  3. మరచిపొమ్మనుచు హరిని మంకు వీడి
    పిల్లవాడిని హింసించి పెక్కుమార్లు
    కశ్యపుండు ప్రహ్లాదుని కష్ట పెట్టె;
    పిల్లవానితోఁ బోరాడి* భీముఁ డోడె.

    *భయంకరుడు

    రిప్లయితొలగించండి

  4. ఆంజనేయుని కథ చెప్పి యనెను తాత
    పిల్లవానితోఁ బోరాడి భీముఁ డోడె
    నతని చేతిలో కాని మారుతికి ప్రేమ
    తమ్ము డన్నను ప్రీతితో తట్టె భుజము.

    రిప్లయితొలగించండి
  5. రామ భక్తుని మహిమను రమ్యముగను
    బోధ సేయుచు నాతల్లి బుడుత తోడ
    పిల్ల ! వానితో బోరాడి భీము డో డె
    నమిత తేజుడు శౌర్యుడు ననిల సుతుడు .

    రిప్లయితొలగించండి
  6. శ్రీ సుబ్బా రావు గారి పద్యమును చూచేము.
    1. రామభక్తుడు అంటే కేవలము ఆంజనేయుడు అనే అర్థము రాదు కదా!
    2. పద్యములో అన్వయము పూర్తి కాలేదు.
    పద్యమును సరియైన రీతిలో సరిచేయవలెను.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  7. పంతమును బూని యొకనాఁడు బలము గలదు
    నాకటంచన, మారుతి నవ్వుతోడ
    తనదు వాలమ్ము నెత్తగ దరికి పిలిచె.
    శక్తి చాలక పోయిన సమయమదియె.

    చాల యత్నము జేసియు చతికిల బడె
    నంట, వింత గాదె నిదియునబ్బురమగు.
    సాటిలేని వాడుగ నాడె యంజనయు కన్న
    పిల్లవానితోఁ బోరాడి భీముఁ డోడె.

    రిప్లయితొలగించండి
  8. రాయబార ప్రసంగము రక్తిగట్ట
    పెద్ద మాటలు విసురుచు పెంకితనపు
    నడతఁ పెనగొనుచు కడకా నల్లగొల్ల
    పిల్లవానితోఁ బోరాడి భీముఁ డోడె.

    రిప్లయితొలగించండి
  9. అమితభుజబలోద్ధతుడైన హనుమ నాడు
    హిమశిఖరమందు భీకరాహీనగతిన
    గర్వమణచుటయనెడుసత్కా"రణమున"
    పిల్ల!వానితోఁ బోరాడి భీముఁడోడె.

    భీకర + అహీన = భీకరాహీన

    రిప్లయితొలగించండి
  10. రామ దూతుని మహిమను రమ్యముగను
    బోధ సేయుచు నాతల్లి బుడుతి తోడ
    నమిత తేజుడు శౌర్యుడు ననిల సుతుడు
    పిల్ల ! వానితో బోరాడి భీము డో డె

    రిప్లయితొలగించండి
  11. శక్తి యుక్తులు గలవార్ని సమరమందు
    విజయలక్ష్మి వరించును వింత లేదు
    బాల కృష్ణు డోడించెను బలుల , నటులె
    పిల్లవానితో బోరాడి భీముడోడె .

    రిప్లయితొలగించండి
  12. తల్లి దండ్రుల బంధించి తల్లటనిడి
    పుట్టు వారందరినిఁ జంప పురిటి లోన
    చిన్ని కృష్ణయ్య కంసునిఁ జిదిమి వైచె పిల్ల వానితోఁ బోరాడి భీము డోడె!

    రిప్లయితొలగించండి




  13. 1. నల్లపిల్లవాడీతడు నాకు సముడె
    భీమబలుడ నాతో నెట్లు పెనగులాడ
    వచ్చె దృటిలోన నోడింతు బాలునంచు
    బిల్లవానితో బోరాడి భీముడోడె
    భీముడు,భీమ = శివుడు,భీకర,మహాబల అనే అర్థాలు అన్వయించుకోవాలి.
    (ఇది చాణూరుని స్వగతం )

    2.ముసలికోతిగానిరసించి ,ముదముతోడ
    నెడమ చేతితో వాలమ్ము నెత్తజూచి
    భంగపాటును జెందెను ,వాయుదేవు
    పిల్లవానితో బోరాడి భీముడోడె.

    రిప్లయితొలగించండి
  14. పండిత నేమాని వారూ,
    పిల్ల - వానితో అని చక్కని విరుపుతో మంచి పూరణనిచ్చారు. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మనుమడి చేతిలో ఓడిన మల్లయోధుని గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    భీముడనే శబ్దానికి ‘భయంకరుడనే’ అర్థం పూరించడం బాగుంది. అభినందనలు.
    హిరణ్య కశిపుడు అనేది సరైన పేరు. మీరు హిరణ్య తొలగించినా ‘కశ్యపు’డన్నారు. నా సవరణ....
    ‘పిల్లవాడిని హింసించి వే హిరణ్య
    కశిపు డౌర ప్రహ్లాదుని కష్ట పెట్టె’
    *
    మిస్సన్న గారూ,
    పిల్లవానికి తాత చెప్పిన కథగా మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    నేమాని వారి సూచన ననుసరించి నా సవరణ...
    ‘రామదూత హనుమ కథ రమ్యముగను
    బోధ చేసె నిట్టుల తల్లి పుత్రికకును’
    *
    లక్ష్మీదేవి గారూ,
    రెండు పద్యాలతో మీ పూరణ చక్కగా ఉన్నది. అభినందనలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    రాయబార ఘట్టంలో కృష్ణుడు భీముని అనునయించిన సందర్భంతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    కమనీయం గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. గురువు గారూ ! మీ సవరణ సరిగ్గా సరిపోయింది. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి