ఈనాటి సమస్యకు వచ్చిన పూరణలన్నీ గొప్పగా ఉన్నాయి. ఇంత చక్కని పూరణలను అందించిన కవిమిత్రులు.... పండిత నేమాని వారికి, నాగరాజు రవీందర్ గారికి, సుబ్బారావు గారికి, మిస్సన్న గారికి, సహదేవుడు గారికి, తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి, అష్టావధాని రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారికి, లక్ష్మీదేవి గారికి, రాజేశ్వరి అక్కయ్య గారికి, కమనీయం గారికి, అభినందనలు, ధన్యవాదములు. * రాంభట్ల వారూ, రెండవ పాదంలో యతి?
భోగ మానంద దాయకము కద యెపుడు
రిప్లయితొలగించండినాదరమ్మున భగవాను నర్చనమ్ము
ధ్యానమును జింతనములను నఖిల యోగ
భోగరక్తుడే మేటి బైరాగి యగును
యోగులకు యోగి యమ్మహాయోగి యనగ
రిప్లయితొలగించండియోగి హృదయకమలవాసి యోగివిభుడు
భోగమే యతనికి శయ్య మోక్షదాయి
భోగరక్తుడే మేటిబైరాగి యగును
భోగ రక్తుడె మేటి బైరాగి యగును
రిప్లయితొలగించండినిజము ముమ్మాటి కీ వార్త , నిగమ శర్మ
భోగముల దేలి చివర బై రాగి యయ్యి
యాకు లలములు దిన సాగె నడవి లోన
నేటి నేతల తీరిది నీతి వీడి
రిప్లయితొలగించండిప్రజల దోచెడి యనువైన పదవి బొందు
భోగరక్తుడే మేటి! బైరాగి యగును
నీతిమంతుడు ధరలోన చేత గాక.
భోగియై వేమన పిదప యోగియయ్యె
రిప్లయితొలగించండిపుండరీకుడు సైతము భోగి మునుపు
భోగములశాశ్వతములను బుద్ధి గలుగు
భోగ రక్తుఁడె మేటి బైరాగి యగును
జ్ఞాన భక్తి యోగ పథ విజ్ఞాన మరసి
రిప్లయితొలగించండిసాధనంబున హఠ యోగ సార మెరిగి
మనమున సదా చిదానంద మనెడి భావ
భోగ రక్తుడె మేటి బైరాగి యగును.
సవరణ :
రిప్లయితొలగించండియోగులకు యోగి యమ్మహాయోగి యనగ
యోగి హృదయకమలవాసి యోగివిభుడు
భోగమే శయ్య వానికి ; పుట్టువటుడు
భోగరక్తుడే మేటిబైరాగి యగును
భోగము = పాము శరీరము , పాము పడగ
ఈనాటి అందరి పూరణలు చాల బాగుగ నున్నవి. అందరికీ శుభాశీస్సులు. అభినందనలు. స్వస్తి.
రిప్లయితొలగించండిమనమునందున నిత్య ముమాపతిన్ వి
రిప్లయితొలగించండిశుద్ధ భావంబుతోడుత స్నిగ్ధభక్తి
నిలిపి, పరిపరి జపియించు నిశిత నియమ
భోగరక్తుడే మేటి బైరాగి యగును!!
"భోగరక్తుఁడె మేటి బైరాగి యగును
రిప్లయితొలగించండివ్యర్థ జీవి, భోగములున్న బాగుబాగు."
భోగముల పైని తీరని రాగము గల
వారి భావన లివి యని పలుకవచ్చు.
ధర్మ నిరతిని వీడి యధర్మ మందు
రిప్లయితొలగించండిమదివి కారము నొందిన మాయ లోన
తినగ తినగను గారెలు తిక్త మవగ
భోగ రక్తుఁ డె మేటి బైరాగి యగును
రిప్లయితొలగించండిభోగరక్తుడె మేటి బైరాగియగును
విషయరక్తుడై భోగించి వెగటు పుట్టి
యాత్మశోధనచేత దుదకహమ్మువీడి
భోగియైనవాడె కడకు యోగి యగును.
ఈనాటి సమస్యకు వచ్చిన పూరణలన్నీ గొప్పగా ఉన్నాయి. ఇంత చక్కని పూరణలను అందించిన కవిమిత్రులు....
రిప్లయితొలగించండిపండిత నేమాని వారికి,
నాగరాజు రవీందర్ గారికి,
సుబ్బారావు గారికి,
మిస్సన్న గారికి,
సహదేవుడు గారికి,
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
అష్టావధాని రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారికి,
లక్ష్మీదేవి గారికి,
రాజేశ్వరి అక్కయ్య గారికి,
కమనీయం గారికి,
అభినందనలు, ధన్యవాదములు.
*
రాంభట్ల వారూ,
రెండవ పాదంలో యతి?