1, జనవరి 2013, మంగళవారం

పద్య రచన - 208

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

20 కామెంట్‌లు:

  1. కం. నందన వత్సరమందున
    యందముగా పరిఢవిల్లునటు శంకరుడే
    యందించిన యీ బ్లాగే
    యందలముల నందవలయునని ప్రార్థింతున్.

    కం. సజలముల నోరూరించెడు
    కజయపు రుచి వోలె పలుకు ఘనమగు మీకున్
    విజరపు సంవత్సరమిక (2013)
    విజయము కలిగించు గాక విజ్ఞత మీరన్.
    (కజయము = కజ్జికాయ, విజరము = నూతన, కొత్త)

    రిప్లయితొలగించండి
  2. అంకెలెన్ని మార్చి యానంద పడినంత
    నూత్నమనగ నెచటను కనలేము
    ప్రకృతి క్రొత్త రంగు పఱిచి చూపు వసంత
    కాలమేను నూత్న కరము, శుభము.

    రిప్లయితొలగించండి
  3. కలవచట నాలుగంకెలు
    పలు యోగము లొసగు నూత్న వర్షమ్మనుచున్
    దెలుపుచు మీ కానందము
    గొలుపుచు నీ వత్సరాది కోరుచు శుభముల్

    రిప్లయితొలగించండి
  4. Happy గ్యాస్ బండలతో
    Happy విద్యుత్తు కోత హింసకు నాపై
    Happy పెరిగే ధరలకు
    Happiness పెంచ రావె హే న్యూ యియరూ !

    Happy వైన్ షాపులతో
    Happy త్రాగేటి నీటి హీన స్థితితో
    Happy నేతల కోతలు
    Happiness పెంచ రావె హే న్యూ యియరూ !

    Happy డొక్కు బసులతో
    Happy తత్కాల్ టికెట్ల యిక్కట్టులతో
    Happy రోడ్డు ప్రమాదాల్
    Happiness పెంచ రావె హే న్యూ యియరూ !

    Happy అవినీతులతో
    Happy కబ్జాల ఘనుల హేలావళితో
    Happy ఆరోపణలకు
    Happiness పెంచ రావె హే న్యూ యియరూ !

    Happy అత్యాచారాల్
    Happy రౌడీయిజంపు యెకసక్కెముతో
    Happy హత్యల హింసకు
    Happiness పెంచ రావె హే న్యూ యియరూ !

    రిప్లయితొలగించండి
  5. పంచ భూతాత్మ కంబైన ప్రాణి కోటి
    కాల పడగల క్రిందుగ కాల మీడ్చు
    తెల్ప నైదు గీతల వ్రాసి తీర్చి నట్టి
    కొత్త వత్సర మీయుత చిత్త శాంతి

    రిప్లయితొలగించండి
  6. శ్రీ శంకరార్యులకు, కవిమిత్రులందరకూ నూతన ఆంగ్ల వత్సర శుభాకాంక్షలు.
    మిస్సన్న గారూ ! మీరు వ్రాసినంతసెపూ మేము చదివినంతసేపూ HAPPY లే HAPPY లు, బాగుంది.

    రిప్లయితొలగించండి
  7. సున్న, ఒకటి, రెండు, చూడగా మూడును
    ఒకరి కొకరు దొరకకుండ దాగి
    ఆడు బాల లట్టు లగుపించు నీ యేడు -
    అంద రటులె మోద మందు గాక!

    రిప్లయితొలగించండి
  8. నూతన ఆంగ్ల సంవత్సర శుభా కాంక్షలు


    ఇరువది, యొకటి యు, మూడును
    నరయంగా మంచి సంఖ్య యన్నిటి కంటెన్
    తిరముగ వత్సర మంతయు
    సిరి రాసుల నిచ్చి మనకు శ్రీ పతి జేయున్

    రిప్లయితొలగించండి
  9. నూతనవత్సర మందున
    చేతో మోదంబు, సిరులు, స్థిరసద్యశముల్
    నేతల సుజనత్వంబును
    భూతలి కందంగ వలయు పూర్తిగ నికపై.

    రెండువేలు గడిచి నిండుగా పండ్రెండు
    వత్సరంబు లేగ వైభవముగ
    వచ్చి నిలిచినట్టి వర్షరాజంబింక
    సత్వ మొసగు గాత! సకలజగతి.

    పదమూడవ యబ్దమునకు
    సదమలహృదయంబుతోడ స్వాగత మనెదన్
    నదులన్నియు సుజలములై
    యదనున వర్షంబు గురియు హాయన మంతన్.

    గతవత్సరమున గలిగిన
    వెతలన్నియు తీరిపోయి విస్తృతసుఖముల్
    క్షితిలో నిండంగావలె
    నతులిత ధనవృద్ధి నూతనాబ్దంబందున్.


    సమతాభావము నిండగ
    మమతాన్విత హృదులతోడ మానవులిలలో
    క్రమముగ నందెద రనిశం
    బమలిన యశములను నూతనాబ్దమునందున్.

    రిప్లయితొలగించండి
  10. ఆర్యా!
    మిస్సన్న గారూ!
    హేపీ హేపీగా వ్రాసిన మీ హేపీ పద్యాలు బాగున్నాయి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. పద మూడవ వత్సరమా
    పదవిని చేకొన్న నీకు స్వాగతమయ్యా !
    పద మూడగ ముష్కరులకు
    పద విని మామొరలు నీవు పాలించుమయా !

    రిప్లయితొలగించండి
  12. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మమంగళవారం, జనవరి 01, 2013 7:42:00 PM

    "పుర భూమ్యనంత కర్ణము" (2013)
    లరివీరభయంకరమగు నాపద లెల్లన్
    హరియించి వేగిరంబున
    తిరముగ చేకురు శుభములు తేజమలరగన్.

    రిప్లయితొలగించండి
  13. శ్రీకళ్యాణపరంపరల్ గురిసి వాసిం గాంచి వర్ధిల్ల నా
    కౌకాశీర్మహితంబుగాఁ గరుణమైఁ గాంతుల్ వెలింగ్రక్కు, మాం
    ధ్రీకైవల్యనిధానమై నిరతసధ్రీచీనమార్గంబు లో
    కైకాదర్శముగా వెలింగెడిని నీ కైకోలు నూత్నాబ్దమా!

    నందనమును గూర్పుము; వి
    న్నందన మార్పు; మొక వంద నందనముల ని
    న్నుం దలఁచువారలం గ
    న్నుం దుదలఁ గని దయతోడ నోమఁగ రమ్మా!

    జవము సత్త్వంబు గడివోవు జాతి బ్రదుకు
    పుస్తకపుఁ గ్రొత్త కూర్పుకై పొంచియున్న
    జనుల కే నవ్యవరదానసాధుమతిని
    వచ్చితో! నిన్నుఁ గన్నులు విచ్చి చూతు.

    త్రిత్వమ్ము నందలి రెండవవానిగా దివినుండి దయతోడ భువికి వచ్చి
    మృతులలో నుండి యమృతమూర్తియై లేచి నుతిఁగన్న ఋతమును, హితము నేర్పి
    మానవాళికి ముక్తిమార్గమ్ముఁ జూపఁగ శాంతిసందేశమ్ము జగతి కొసఁగి
    శిలువపైని ప్రభువు చిందిన రక్తమ్ము శరణార్థిజనుల రక్షణము గాఁగ

    రెండువేలకు పైని పండ్రెండు వత్స
    రంబులును వుచ్చె నూత్నవర్షంబు వచ్చె
    నంచు నీ కరుణార్ద్రనేత్రాంచలమ్ము
    కొఱకుఁ దపియించు మముఁబ్రోవు కొంచెమైన.

    విధేయుడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  14. నూతన వత్సర మందున
    పాతను మరపింప నెంచి పాప హరంబౌ !
    చేతనము నొంద జనులకు
    చాతకమై నెదురు చూడ చాలదు జన్మం !

    పూజ్య గురువులకు సోదర సోదరీ మణికి , అందరికీ నూతన సంవత్సర శుభా కాంక్షలు

    రిప్లయితొలగించండి
  15. ఆంగ్ల నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కవిమిత్రులు మంచి మంచి పద్యాల కానుల లిచ్చిన...
    మారెళ్ళ వామన కుమార్ గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    పండిత నేమాని వారికి,
    మిస్సన్న గారికి,
    సహదేవుడు గారికి,
    డా. ఆచార్య ఫణీంద్ర గారికి,
    సుబ్బారావు గారికి,
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
    ఏల్చూరి మురళీధరరావు గారికి,
    రాజేశ్వరి అక్కయ్య గారికి,
    అభినందనలు, ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  16. వామనకుమార్ గారూ, హనుమచ్చాస్త్రి గారూ, మూర్తిగారూ మీ ప్రశంసలకు నే హ్యాపీ.
    గురువుగారూ ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి