20, జూన్ 2013, గురువారం

పద్య రచన - 378 (వీరనారి)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము....
"వీరనారి"

8 కామెంట్‌లు:

  1. వీరనారియై ఝాన్సీయు పృథివి నిలిచి
    పోయె, నాంగ్లేయ వైరుల పోరి తరుము
    రణమునందు వెన్నునుఁ జూపు లలన కాక
    వీర మరణముఁ బొంది, తా పేరిమి గనె.

    రిప్లయితొలగించండి
  2. లక్ష్మీదేవి గారూ,
    ఝాన్సీరాణిని ప్రస్తావనతో మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. నారీ రత్నము లందున వీర నారి
    కాక తీయుల రాజ్యము నాక్ర మించి
    రాణి రుద్రమ దేవుని పేర రాజ్య మేలి
    అంబ దేవుని రణమున మరణ మొందె

    రిప్లయితొలగించండి
  4. రాజేశ్వరి అక్కయ్యా,
    మంచి విషయాన్ని ఎన్నుకున్నారు పద్యరచనకు. సంతోషం.
    కాకుంటే పద్యంలో గణ, యతి దోషాలు ఉన్నాయి.

    రిప్లయితొలగించండి
  5. తెల్లవారి తోడ తెగువతో పోరాడె
    వీరనారి ఝాన్సి, వీధులందు
    తెల్లవారు వరకు తిరిగి వచ్చిన చాన
    వీర నారి నేడు విజ్ఞు లార.

    రిప్లయితొలగించండి
  6. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. ఆర్యా ! ధన్య వాదములు...
    చిన్న సవరణతో...

    తెల్లవారి తోడ తెగువతో పోరాడె
    వీరనారి ఝాన్సి, వీధి నొంటి
    తెల్లవారు వరకు తిరిగి 'వచ్చిన' చాన
    వీర నారి నేడు విజ్ఞు లార.

    రిప్లయితొలగించండి