1, ఏప్రిల్ 2014, మంగళవారం

సమస్యాపూరణం - 1369 (నీతిపరుని మాట)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
నీతిపరుని మాట నీటిమూట.

20 కామెంట్‌లు:


 1. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు
  కాకమ్మ్ల ల కథలు చెప్పి జనాల
  మెదడులని మార్చే రాజకీయ అవి
  నీతిపరుని మాట నీటి మూట


  జిలేబి

  రిప్లయితొలగించండి
 2. జిలేబీ గారూ,
  శుభోదయం! మీ భావానికి నా పద్య రూపం.....

  కలదు లేదటంచు కాకమ్మ కబురుల
  కథలు చెప్పి చెప్పి కనులు గప్పి
  ప్రజల బుద్ధి మార్చు రాజకీయపు టవి
  నీతిపరుని మాట నీటిమూట.

  రిప్లయితొలగించండి
 3. కల్లిబొల్లి మాట లల్లి జ నంబును
  మోస గించు వారి బాస లన్ని
  వినగ నమ్మ బలుకు పెద్ద న నను నవి
  నీతి పరుని మాటనీటి మూట

  రిప్లయితొలగించండి
 4. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు
  నీ శిష్య పరమాణువు వినమ్రవందనములతో.
  ===========*=============
  ధనము నందు దొర్లుచునుండు దానవులకు
  సొక్కు చుండగ జనులెల్ల సొగసు గాను
  నేడు నీతి పరుని మాట నీటి మూట
  యయ్యె నవిననీతి నిండగ నవనియందు!

  రిప్లయితొలగించండి
 5. బ్రహ్మ దేవుఁ గోరి పాలించమని వేడ
  పద్ధ తేది లేని పెద్దలఁ గని
  నీతి నియమ మేది నేరక నిట్లనెన్
  "నీతి పరుని మాట నీటి మూట"

  రిప్లయితొలగించండి
 6. సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘పెద్ద న నను’...? ‘పెద్ద + అని + అనను’ అని మీ భావమా? అప్పుడు ‘పెద్దని యనను’ కావాలి కదా!
  *
  కందుల వరప్రసాద్ గారూ,
  మంచి పూరణ తేటగీతిలో చెప్పారు. బాగుంది. అభినందనలు.
  నాల్గవ పాదంలో ‘అవిననీతి’ ... ‘అవినీతి’కి టైపాటనుకుంటాను.
  *
  సహదేవుడు గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  రెండవ పాదంలో ‘ద్ధ-ద్ద’లకు ప్రాసయతి వేశారు. ఏవో కొన్ని ప్రయోగాలున్నాయనుకోండి.

  రిప్లయితొలగించండి
 7. నేత కూత లన్ని నీతి బాహ్యంబులే
  చెప్పు నన్ని కాని చేయడొకటి
  నమ్మి మోస బోకు నక్కవినయపవి
  నీతి పరుని మాట నీటి మూట .

  రిప్లయితొలగించండి
 8. రయముతోడ జెప్పు రాజకీయపుటవి
  నీతి పరుని మాట నీటి మూట
  యనియెఱుంగక జను లందరు నమ్ముచు
  నోటులేయు చుండ్రి చేటు గనక
  రిప్లయితొలగించండి
 9. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
  శంకరయ్య గారికి వందనములు

  గాలివీచ గంట ఘల్లను విధ మవి
  నీతి పరుల మాట నీటి మూట
  పల్ల మెచట నుండు ప్రవహించు నా వైపు
  తెలిసి కొనుము నిజము తెలుగు బిడ్డ

  రిప్లయితొలగించండి
 10. గట్టి మేలు జేయ గద్దెనెక్కునెవరు?
  దోచు కొనుట కదియె దొంగ దారి
  దేశ ప్రజల దోచి దేవుళ్ళమను నవి
  నీతి పరుని మాట నీటి మూట

  రిప్లయితొలగించండి
 11. నీతిపరుని మాట నీటి మూటయటంచు
  దలుపరాదు గీటు దాటరాదు
  నీతిపరులె మనకు నీతి మార్గము జూప
  గలరు; మంచి మనకు కలుగ గలదు.

  రిప్లయితొలగించండి
 12. గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘నక్కవినయపు + అవినీతి’ అన్నప్పుడు టుగాగమం వచ్చి ‘నక్కవినయపు టవినీతి’ అవుతుంది. అక్కడ ‘నక్కజిత్తుల యవి/నీతి.." అందామా?
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  కెంబాయి తిమ్మాజీరావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  శైలజ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  మారెళ్ళ వామన్ కుమార్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
  శంకరయ్య గారికి వందనములు

  నాతి నాతి యనుచు నాతిని జెరచును
  నీతి నీతి యనుచు నినదమిచ్చి
  నేతి యనుచుబొంక నేర్చుకున్నట్టి దు
  ర్నీతి పరులమాట నీటిమూట

  రిప్లయితొలగించండి
 14. కెంబాయి తిమ్మాజీరావు గారూ,
  మీ రెండవ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 15. కార్య శూరు డెపుడు కడు మాట లాడడు
  మాట లాడు వాడు పాటు పడడు
  మంచి మాట యనుచు మనుజల వంచించు
  నీతిపరుని మాట నీటిమూట.

  రిప్లయితొలగించండి
 16. సవరణలకు శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో..

  ధనము నందు దొర్లుచు నుండు దానవులకు
  సొక్కు చుండగ జనులెల్ల సొగసు గాను
  నేడు నీతి పరుని మాట నీటి మూట
  యయ్యె నవినీతి నిండగ నవని యందు !

  రిప్లయితొలగించండి
 17. ఉక్తలేఖనార్థ మొక్క విద్యార్థికి
  నొసగె కొన్నిపదము లొజ్జ యిట్లు
  నిమ్మచెట్లతోట, నేరేడుపండ్లాట,
  నీతిపరునిమాట, నీటిమూట.

  రిప్లయితొలగించండి
 18. పరులు చెప్పిరంచు పాటించ ప్రతి మాట
  పరువు పోవు, మేలు నరసి జేయ
  నీతి! పరుని మాట నీటిమూట తరచు
  చెప్పు వాడు హితము దప్పి నపుడు.

  రిప్లయితొలగించండి
 19. భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
  మీ పూరణ వైవిధ్యంగా ఉండి అలరించింది. అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,
  విలక్షణమైన విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 20. శ్రీ కంది శంకరయ్య గురువరులకు నమస్కారములు
  మీ సవరణకు ధన్యవాదములు

  రిప్లయితొలగించండి