2, ఏప్రిల్ 2014, బుధవారం

పద్య రచన – 554

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

23 కామెంట్‌లు:

  1. వేట కనివచ్చి యీరీతి నీటి కొఱకు
    చచ్చు వెలుచను గళమున నిచ్చతోను
    శృంగి శాపము తప్పదు భంగ బడక
    చావు తప్పదు నాకింక శరణు లేదు

    రిప్లయితొలగించండి
  2. ఒకనాడు వెడలి వేటకు పరీక్షిన్మహా
    ....రాజు భయంకరారణ్యమునకు
    వేటాడుట ముగించి వెనుదిరిగెడు నెడ
    ....నలసి మిక్కిలిగ దాహమ్ము వేయ
    చుట్టు ప్రక్కలలోన జూచె నాతండొక
    ....మునివరేణ్యుని తపోభూమి నచట
    నతి తపోదీక్షలో నలరు శమీకుని
    ....గాంచి జలమ్ము లిమ్మంచు నడిగి
    తపములో నున్న ముని నిరాదరణ జేసె
    నను నపోహతో క్రోధాంధు డగుట నొక్క
    సర్పశవమును ముని భుజస్కంధము పయి
    వేసి నిజనివాసమునకు వెడలె నకట

    జననాథుడు చనినంతనె
    మునిపుత్రుడు చూచి కోపమును బొంది రయ
    మ్మున శాపమిచ్చె నా దు
    ర్జను డేడవనాడు బాయు ప్రాణంబనుచున్

    శాపము దెలిసి పరీక్షిత్
    భూపతి కడు భక్తిగ శుకమునివరు వలనన్
    శ్రీపతి కథలన్ వినె మది
    దీపింపగ నలరె నమిత తేజోమయుడై

    అతి ధర్మాత్ముడు పాండువంశభవు డట్లత్యంత దౌష్ట్యమ్ము దు
    ర్మతియై జేయుట యెల్ల కాలమహింబా రీతి శాపమ్ముతో
    క్షితిపాలుండు మృతించె తక్షక విషాగ్నిజ్వాలలన్ గూలి స
    ద్గతులన్ బొందె శుక ప్రబోధముల నాకర్ణించుటన్ భక్తితో

    రిప్లయితొలగించండి
  3. రాజేశ్వరి అక్కయ్యా,
    మంచి పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.
    రెండవ పాదం చివర ‘నిచ్చ నిడగ’ అంటే అన్వయం కుదురుతుంది.
    *
    పండిత నేమాని వారూ,
    పరీక్షిత్తు కథను అద్భుతమైన ఖండికగా అందించారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. దాహ మడుగ మౌని తాజూడ లేదనుచు
    పాము శవము వేసి పైన వెడలె
    రీతి చక్కనగు పరీక్షిత్తు కేమాయె
    కర్మ బట్టి బుద్ధి గలుగు గాదె.

    రిప్లయితొలగించండి
  5. దీక్షాతత్పరుఁడైన మౌనిఁగని యుద్వేగాంధకారుండు భూ
    రక్షాదక్ష పరంపరాన్వితుఁడు యుగ్రవ్యాళమున్ వైచి నా
    శిక్షన్ బొందుమటంచుఁ జెప్ప నృపతిన్, జీవింప బ్రష్టుండు ని
    ర్దాక్షిణ్యంబుగ జత్తువీవు నొకవారంబందునంధాహిచే

    ననుచు శాపంబునిడె మౌని తనయుడంత,
    నిజగృహంబునకేగె నిర్నిద్రచేత
    తగుయుపాయంబు తెలియక వగచ సాగె
    నల పరీక్షిన్నరేంద్రుండు కలవరమున.

    రిప్లయితొలగించండి
  6. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    ‘పరంపరాన్వితుఁడు + ఉగ్రవ్యాళమున్’ అన్నప్పుడు యడాగమం రాదు. సంధి నిత్యం. ‘పరంపరాన్వితుఁడె యుగ్ర..." అనండి. అలాగే ‘తగు నుపాయంబు’ అనండి.

    రిప్లయితొలగించండి
  7. దాహ మడుగగ బలుకని తపసి పైన
    సార్వబౌముడు పడవైచె సమయునహిని
    శాప మొందిపరీక్షిత్తు జనెను తుదకు
    ప్రభువు నైనను వీడునా పాప ఫలము

    రిప్లయితొలగించండి
  8. శైలజ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. వేటకు వెడలిన దొర ఘో
    రాటవిలో దిరగ దాహ మధికమ్మాయె న
    చ్చోటనుగల ముని మెడలో
    మాటాడక యున్న వేసె మండలి శవమున్.

    రిప్లయితొలగించండి
  10. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మంచి పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.
    రెండవ పాదం చివర గణదోషం. టైపాటు కావచ్చు ‘దాహ మధిక మ్మయె న/చ్చోట..." అని కదా ఉండవలసింది.

    రిప్లయితొలగించండి
  11. తనర యా శమీ క మహర్షి దరికి రాజు
    వచ్చి యడుగంగ నీటిని బడయ లేక
    చచ్చి పడియున్న పామును నిచ్చతోడ
    వేసె నాతని మేడలోన వెఱ్ఱి రాజు

    రిప్లయితొలగించండి
  12. పోచిరాజు సుబ్బారావు గారూ
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. కౌరవాన్వయమున్ గోరి కమనాభు
    చేత రక్షింప బడినట్టి చేతనుండు
    తాఁపరీక్షిత్తు నాబడు ధర్మ మూర్తి
    పూని ప్రజలను రక్షించు పుణ్య మూర్తి
    వేట కోసమై కానకున్ వేడ్క బోయి
    భాణ వేటును బడియును పాఱినట్టి
    మృగము వెంటను వెసతాను తగిలి తగిలి
    చేరె నొక మునివర్యుని చెంతకపుడు
    " ఓ మునీంద్ర! భాణహతితో నొక్క మృగము
    పాఱివచ్చెని చ్చోటకున్ పరగుపరుగు
    నెఱిగితేని వెసన్ నాకు యెఱుక జెప్పు"
    మౌన తపము నున్నశమీకు తాను జూచి
    కోపమడరగ తన వింటి కొప్పుతోడ
    మృత ఫణిని దెచ్చి తాఁ ముని మెడను జుట్టి
    వెడలెతనదు రాజ్యమునకు వేగముగను
    నాశమీకుఁ బుత్రుడు శృంగి యది కనుగొని
    కనలి శాపము నిచ్చెను కఠిన మదిన
    సర్పకాటుతో నారాజు సమయునంచు

    రిప్లయితొలగించండి
  14. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    తలపై కిరీట మందున
    కలినిలువగ నురగశవము గవయముతో భూ
    తలపతి వైచెను తపసి మె
    డలో వివేకము సహనము టావులు దప్పన్

    రిప్లయితొలగించండి
  15. శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారు: శుభాశీస్సులు.
    మీ 2 పద్యములను చూచితిని. బాగుగ నున్నవి. అభినందనలు. కొన్ని సూచనలు:
    1. అన్వయసౌలభ్యము మెరుగుపరచ కొనవలెను.
    2. వారంబందాహిచే - ఆహి అనగ నేమి?
    3. తగు + ఉపాయము = నుగాగమముతో తగునుపాయము అగును.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  16. శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు: శుభాశీస్సులు.
    మీ గీతమాలిక బాగుగ నున్నది. అభినందనలు. కొన్ని సూచనలు.
    1. కొన్ని టైపు పొరపాట్లు కలవు.
    2. బాణ వేటు సమాసము సరికాదు.
    3. నాకు + ఎరుక = నుగామముతో నాకునెరుక యగును.
    4, మౌన తపమున నున్న అనవలెను.
    5. సర్పవేటు - సమాసము సరికాదు.
    కథలో కూడ కొంత తేడా యున్నది. మీరు ఏ గ్రంథములో జూచినారో?
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  17. గురువుగారికి నమస్సులు.

    మీ సూచనలకు కృతజ్ఞుణ్ణి.

    శ్రీనేమాని పండితవర్యులకు నమస్కారములు.
    మీ సూచనలప్రకారము మరింత స్పష్టముగా వ్రాయడానికి ప్రయత్నిస్తాను. సమాసములతో వ్రాయవలెనన్న కోరిక అంతే.

    వారంబందున్ + అంధాహి ( సర్పము ) = వారంబందునంధాహిచే........ సరియేనా తెలుపగలరు ??

    రిప్లయితొలగించండి
  18. శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారు: శుభాశీస్సులు.
    పద్య రచనలో అన్వయ సౌలభ్యము ముఖ్యము. చదువరి హాయిగా అర్థము చేసికొనుట అవసరము.
    అంధాహి అనినచో పాము అను అర్థము ఉన్నది కాని - సర్పంబుచే అనినచో నింకను బాగుగ నుండును. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  19. పూజ్యులు పండిత నేమాని గారికి నమస్సులు. తమరి సవరణలకు చూచనలకు కృతజ్ఞతలు. తిరుపతి దేవస్థానం వారి, కవిత్రయం మహాభారతం ప్రాజెక్టు పుస్తకము లోని కథ నాపద్యమునకు మూలము.
    మునీంద్రా! "నాచేత వేటువడి అమ్ముతోడ యిట వచ్చె, ... నీవెరుగుదేని చెప్పు..."

    రిప్లయితొలగించండి
  20. శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి శుభాశీస్సులు.
    కథ గురించి నాకు తెలియని విషయమును తెలియజేసినందులకు చాల సంతోషము.

    రిప్లయితొలగించండి
  21. ఫుజ్యగురుదేవులు పండిత నేమాని గారికి నమస్సులు. తమరు చెప్పిన సవరణలతో మరల పంపుచున్నాను.
    తే: కౌరవాన్వయమున్ గోరి కమల నాభు
    చేత రక్షింప బడినట్టి చేతనుండు
    తాఁపరీక్షిత్తు నాబడు ధర్మ మూర్తి
    పూని ప్రజలను రక్షించు పుణ్య మూర్తి
    వేట కోసమై కానకున్ వేడ్క బోయి
    భాణపు హతితగిలియును పాఱినట్టి
    మృగము వెంటను వెసతాను తగిలి తగిలి
    చేరె నొక మునివర్యుని చెంతకపుడు
    " ఓ మునీంద్ర! భాణహతితో నొక్క మృగము
    పాఱివచ్చెని చ్చోటకున్ పరగుపరుగు
    నెఱిగితేని వెసన్ నాకు నెఱుక జెప్పు"
    మౌన తపమున నున్నట్టి మునిని గాంచి
    కోపమడరగ తన వింటి కొప్పుతోడ
    మృత ఫణిని దెచ్చి తాఁ ముని మెడను వైచి
    వెడలెతనదు రాజ్యమునకు వేగముగను
    నాశమీకుఁ బుత్రుడు శృంగి యది కనుగొని
    కనలి శాపము నిచ్చెను కఠిన మదిన
    సర్పపువిషాగ్ని నారాజు సమయు నంచు

    రిప్లయితొలగించండి
  22. సహనముఁ గోల్పోయినతఱి
    యహినొకదాని పడవేసి యతడొక ఫలమం
    దహివలన మరణమందిన
    మహినేలిన నరుని కథల మర్మమెఱుగుమా!

    రిప్లయితొలగించండి