3, ఏప్రిల్ 2014, గురువారం

సమస్యాపూరణం - 1371 (సుతుని వరించి చేరి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
సుతుని వరించి చేరి యొక సుందరి తేలె మనోజకేళిలోన్.

31 కామెంట్‌లు:

 1. స్తుత గుణవైభవాన్వితు యశోధనరాజితు దేవలోకరా
  ట్సుతసమ శౌర్యవీర్యబలశోభితు సర్వకళాప్రశస్తు నం
  చిత ధన భాగ్యవంతు కులశేఖరు నందములోన నిందిరా
  సుతుని వరించి చేరి యొక సుందరి తేలె మనోజ కేళిలోన్

  రిప్లయితొలగించండి
 2. అతులిత శౌర్య మూర్తి మదనారికి భక్తుడు శౌరికాప్తుడౌ
  స్తుతమతి సవ్యసాచి గని చూపుల ప్రేమను చూపి మెచ్చె స
  మ్మతమున నాయులూచి, సఖు మానసమిట్టులె దోచి పాండురా
  ట్సుతుని వరించి చేరి యొక సుందరి తేలె మనోజకేళిలోన్.

  రిప్లయితొలగించండి
 3. అతులితమైన భక్తి తత్పరతనంబుజనాభుని లోదలంచి సం
  తతము హృదేశుగా వలచి, ధర్మముగా గ్రహియింప వేడి,సం
  స్తుతముగ పెండ్లియాడి, వర శోభన వేళ మనోజ్ఞ దేవకీ
  సుతుని వరించి చేరి యొక సుందరి తేలె మనోజకేళిలోన్.

  రిప్లయితొలగించండి
 4. అతివలకేమి కర్మమొ? భయానక వేదన మెట్టినింటిలో
  సతతము సాగుచుండ గని, జాతక మేళనముల్ త్యజించుచున్
  జత కలియంగ ప్రేముడి ప్రశాంతముగా తన మేనమామకున్
  సుతుని వరించి చేరి యొక సుందరి తేలె మనోజ కేళిలోన్ II

  రిప్లయితొలగించండి
 5. కవిమిత్రులకు నమస్కృతులు.
  మేము రేపు ఇల్లు మారుతున్నాము. మరికొద్ది సేపట్లో నా కంప్యూటర్ అట్టడబ్బాలోకి చేరుతుంది. కొత్త ఇంట్లో కంప్యూటర్ ఫిక్స్ చేసి, నెట్ కనెక్షన్ తీసుకోడానికి మూడు నాలుగు రోజులు పట్టవచ్చు. ఈ నాలుగు రోజులకు పద్యరచన, సమస్యాపూరణ శీర్షికలను షెడ్యూల్ చేసి ఉంచాను. దయచేసి మిత్రులు సహకరించవలసిందిగా మనవి.

  రిప్లయితొలగించండి
 6. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
  శంకరయ్య గారికి వందనములు

  అతిబల భీమసేనుడటునప్పిశితాశి హిడి౦బు జంపి నా
  యతివ హిడింబ బొమ్మనగ “నార్తిని దీర్చి పరిగ్రహింపుమో
  సుతు”డని గుంతి బల్క గడు సొక్కుచు రక్కసి వాయుదేవుకున్
  సుతుని వరించి చేరి యొక సుందరి తేలె మనోజు క్రీడలన్

  రిప్లయితొలగించండి
 7. అతిధనవంతుడంచు నొక డంగజ నిచ్చె కురూపివానికిన్
  సతిని పరాభవించుచు కసాయిగ మారిన వాడు క్రూరుడై
  సతతము త్రాగి తన్నగ, పిశాసి పతిన్ విడి యత్త జానకీ
  సుతుని వరించి చేరి యొక సుందరి తేలె మనోజ కేళిలోన్

  రిప్లయితొలగించండి
 8. అతివ లనేకులున్మిగుల నందమ మోఘ వివేక ముండినన్
  అతి విభవమ్ము లేని పురుషార్థుని భర్తగ కోర రిద్ధరన్
  గతి చెడినట్టి వాడు గడు కల్లరి వాడును మేలటంచు శ్రీ
  సుతుని వరించి చేరి యొక సుందరి తేలె మనోజ కేళిలోన్

  రిప్లయితొలగించండి
 9. మిత్రులారా! శుభాశీస్సులు.
  ఈనాటి సమస్యకు మంచి పూరణలు వచ్చినవి. అందరికి అభినందనలు.

  శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు:
  మీ పద్యము బాగుగ నున్నది. ఉలూచి పాండురాట్సుతుని ప్రస్తావన బాగుగ నున్నది.

  శ్రీ చింతా రామకృష్ణారావు గారు:
  మీ పూరణ బాగుగ నున్నది. దేవకీసుతుని వరించిన ఒక వధువు గూర్చి చక్కగా చెప్పేరు. 1వ పాదములో 2 అక్షరములు ఎక్కువగా నున్నవి.

  డా. మాడుగుల అనిల్ కుమార్ గారు:
  మీ పద్యము బాగుగ నున్నది. మేనమామకున్ సుతుని వరించిన సుందరి గురించి చక్కగా చెప్పేరు.

  శ్రీ నాగరాజు రవీందర్ గారు:
  మీ పద్యము బాగుగ నున్నది. రాజకుమారుని వరించిన సుందరి గురించి చక్కగా చెప్పేరు. పెంపెసగు + అందము = అని సంధి చేయునప్పుడు యడాగమము రాదు -- నుగాగమము వచ్చును.

  శ్రీ తిమ్మాజీ రావు గారు:
  భీముడు హిడింబి వృత్తాంతమును వర్ణించేరు. బాగుగనున్నది మీ పద్యము. వాయుదేవుకున్ అని వాడరాదు. ఉకార ఋకారముల తరువాత నకు అని చేర్చవలెను - వాయుదేవునకున్ అనాలి.

  శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు:
  మీ పద్యము బాగుగ నున్నది. వ్యసనలోలుడయిన వ్యక్తిని విడిచి అత్త కొడుకును వరించిన సుందరి గురించి బాగుగా చెప్పేరు.

  శ్రీ గండూరి లక్ష్మీనారాయణ గారు:
  మీ పద్యము బాగుగ నున్నది. శ్రీ సుతుని వరించిన సుందరి గురించి చక్కగా చెప్పేరు.

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 10. పూజ్యులు నేమానివారికి, మిత్రులు శంకరయ్యగారికి, సాహితీ మిత్రులందరికీ నమస్కారములు.

  సతతము మిక్కుటంబయిన సౌఖ్యము లిచ్చెడువాఁ డటంచుఁ గా
  మితమును దీర్చి నిత్యము రమింపఁగ నాతని సాహచర్యమం
  దతిరతితృప్తినిం దనిసి ధన్యతనొందఁగ నెంచియున్ రమా
  సుతుని వరించి చేరి యొక సుందరి తేలె మనోజకేళిలోన్!

  రిప్లయితొలగించండి
 11. అతి సుకుమారి యందమున నప్సర యైన శుభాంగి చక్కగా
  బ్రతుకును తీర్చిదిద్దగల భర్తను గోరుచు సౌఖ్యమందుటే
  హితమని యెంచి శ్రీలు గల యింటను పుట్టిన బుద్ధిమంతుడౌ
  సుతుని వరించి చేరి యొక సుందరి తేలె మనోజ కేళిలోన్!

  రిప్లయితొలగించండి
 12. శ్రీ గుండు మధుసూదన్ గారు: శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది. రమాసుతుని వంటి వరుని వరించిన సుందరి గురించి చక్కగా చెప్పేరు.

  శ్రీ బొడ్డు శంకరయ్య గారూ: శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది. సంపన్నుల యింటిలో పుట్టిన సుతుని వరించిన సుందరి గురించి బాగుగ చెప్పేరు.

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 13. అతులిత భక్తి తత్పరతనంబుజనాభుని లోదలంచి సం
  తతము హృదేశుగా వలచి, ధర్మముగా గ్రహియింప వేడి,సం
  స్తుతముగ పెండ్లియాడి, వర శోభన వేళ మనోజ్ఞ దేవకీ
  సుతుని వరించి చేరి యొక సుందరి తేలె మనోజకేళిలోన్.

  రిప్లయితొలగించండి
 14. పూజ్య గురుదేవులు పండిత నేమాని గారికి ధన్యవాదములు

  రిప్లయితొలగించండి
 15. అతులిత మోహపారవశ మాత్రము బెంచగ విప్రవర్యుడే
  జతగొన వచ్చెనా? ప్రవరు సందిట జిక్కిన జాలునంచు తా
  మతిన దలంచి యా కపటి మానము గోరగ జిత్తమటంచు దేవతా
  సుతుని వరించి చేరి యొక సుందరి తేలె మనోజ కేళిలోన్!
  (వరూధినీ వృత్తాంతము)

  రిప్లయితొలగించండి
 16. శ్రీ సహదేవుడు గారు: శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. కొన్ని సూచనలు:
  1. 3వ పాదములో -- మతిన దలంచికి బదులుగా మతి దలపోసి అంటే బాగుంటుంది.
  2. 3వ పాదము చివరలో 3 అక్షరములు ఎక్కువగా నున్నవి.

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 17. పూజ్య నేమని గురువర్యులకు ధన్యవాదములు. 3వ పాదమునిలా సవరిస్తే బాగుంటుందాండి?
  "మతి దలపోసి యా కపటి మానము గోరగ నొప్పి దేవతా"

  రిప్లయితొలగించండి


 18. మతులను కొల్లగొట్టగను మన్మధ మోహన రూపువాడు సు
  స్మిత మృదు మంజుభాషణుడు శ్రీకరుడొప్పగ పచ్చవింటి వా
  ని తలపు తూపుతాళకను నింగియ రంగుల వాని దేవకీ
  సుతుని వరించి చేరి యొక సుందరి తేలె మనోజ కేళిలోన్

  రిప్లయితొలగించండి
 19. అమ్మా! సుమలత గారూ! శుభాశీస్సులు.
  మీ పద్యమును చూచితిని. బాగుగ నున్నది. అభినందనలు.
  కొన్ని సూచనలు:
  మన్మథ మోహన రూపు వాడు అనుట దుష్ట సమాసము అగును. పూర్వపదము సంస్కృత పదమగుచో ఉత్తరపదము తెలుగు పదము ఉండరాదు.
  తాళకను అనుట సాధువు కాదు. వ్యతిరేక పదము చివర ద్రుతము రాదు. తాళకయె అనుట మంచిది. నింగి అనవచ్చును గాని నింగియ అనరాదు.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 20. పూజ్య నేమాని గురువర్యులకు ధన్యవాదములు. మీ సూచనలు అమూల్యములు. తప్పులు సవరించాను.

  మతులను కొల్లగొట్టగను మారునిగన్న మోహన రూపువాడు సు
  స్మిత మృదు మంజుభాషణుడు శ్రీకరుడొప్పగ పచ్చవింటి వా
  ని తలపు తీపు తాళకయె నెయ్యము మీరగ ముద్దు దేవకీ
  సుతుని వరించి చేరి యొక సుందరి తేలె మనోజ కేళిలోన్

  రిప్లయితొలగించండి

 21. క్షమించాలి. గణము తప్పు వున్నది మొదటి పాదములో

  రిప్లయితొలగించండి
 22. మతులను కొల్లగొట్టగ భువనైక మోహన రూపువాడు సు
  స్మిత మృదు మంజుభాషణుడు శ్రీకరుడొప్పగ పచ్చవింటి వా
  ని తలపు తీపు తాళకయె నెయ్యము మీరగ ముద్దు దేవకీ
  సుతుని వరించి చేరి యొక సుందరి తేలె మనోజ కేళిలోన్

  రిప్లయితొలగించండి
 23. అమ్మా! సుమలత గారూ! శుభాశీస్సులు.
  మీరు సవరించుచు మరొక తప్పు చేసేరు. 1వ పాదములో యతి మైత్రి లేదు. ఆ పాదమును ఇలా మార్చుదాము:
  "మతులను కొల్లగొట్టగల మన్మథకోటి సమానమూర్తి స...."
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 24. మతమునుగూర్చి తల్చక సుమమ్మును బోలు మిటారి, మోజుతో
  మతకరి నమ్మి చేకొనెను, మాయల మారి మనుష్యు డంచు తె
  ల్చి, తుదకు వీడెనాతనిని, చెన్నగు తండ్రి యనుంగు సోదరీ
  సుతుని వరించి చేరి యొకసుందరి తేలెమనోజ కేళిలోన్

  రిప్లయితొలగించండి
 25. గురువు గారు,
  ' మ ' కు ' వ ' కు యతి మైత్రి వుందనుకున్నాను.

  రిప్లయితొలగించండి
 26. చతురతఁ జూపి కన్నెలనుఁ జక్కటి మాయల ముంచువానినిన్
  సతతము నమ్మి యుందురట సైపగలేక వియోగ,మాపురిన్
  లతలనుఁ బోలియున్న నవలామణులందరు; నట్లె దేవకీ
  సుతుని వరించి చేరి యొక సుందరి తేలె మనోజకేళిలోన్.

  రిప్లయితొలగించండి
 27. సతతము చింతజేయుచును శాంతము సౌఖ్యము ద్రోసిపుచ్చుచున్
  మతమును మార్చివేయుటయె మంత్రము తంత్రమటంచు వోట్లకై
  గతమును పాతిపెట్టుచునుగౌరికి పూజలు జేయు సోనియా
  సుతుని వరించి చేరి యొక సుందరి తేలె మనోజకేళిలోన్

  రిప్లయితొలగించండి
 28. నుతమగు బారునందునను నోరును విప్పక కన్ను కొట్టుచున్
  గతుకుల ప్రేమ యాత్రనట గానము పానము తోడ సల్పుచున్
  మతమును వీడ కుండ భళి మానస మిచ్చిన నిందిరమ్మడౌ
  సుతుని వరించి చేరి యొక సుందరి తేలె మనోజకేళిలోన్

  రిప్లయితొలగించండి