14, ఏప్రిల్ 2014, సోమవారం

సమస్యాపూరణం - 1382 (తాళి కట్టిన మఱునాడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
తాళి కట్టిన మఱునాడు తాత యయ్యె.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

12 కామెంట్‌లు:

 1. కోరి తనయుడు పెండ్లాడ కోడ లొచ్చె
  ధరను వెలసెను నేనంటు దౌహిత్రు డట
  తాళి గట్టిన మరునాడు తాత యయ్యె
  శుభము లందున శుభముల నబము వెలిగె

  రిప్లయితొలగించండి
 2. అక్కయ్యా,
  మీ ప్రయత్నం ప్రశంసనీయం.
  కోడలు ‘ఒచ్చె’ అన్నారు. ‘వచ్చె’ను ‘ఒచ్చె’ అనడం గ్రామ్యం. ‘దౌహిత్రు డట’ అన్నచోట గణదోషం... సవరించండి.

  రిప్లయితొలగించండి
 3. శోభనంబును జేసిరి సుజనపతికి
  తాళి కట్టిన మఱునాడు, తాత యయ్యె
  కొడుకు నకుమఱి పుట్టగ కొడుకు మరల
  తండ్రి తండ్రిని నందురు తాత యనియు

  రిప్లయితొలగించండి
 4. బిడ్డబిడ్డను పుత్రుడు పెండ్లియాడ
  తాళి కట్టిన మఱునాడు తాత యయ్యె
  తాను దౌహిత్రికిక మామ ; తనివి తీర
  దీవనలనిచ్చె వారల ధీయుతుండు.

  రిప్లయితొలగించండి
 5. బిడ్డబిడ్డను పుత్రుడు పెండ్లియాడ
  తాళి కట్టిన మఱునాడు తాత యయ్యె
  నొప్పె దౌహిత్రికిని మామయునగుచు మరి
  దీవనలనిచ్చె వారల ధీయుతుండు.

  రిప్లయితొలగించండి
 6. బిడ్డబిడ్డను పుత్రుడు పెండ్లియాడ
  తాళి కట్టిన మఱునాడు తాత యయ్యె
  నొప్పె దౌహిత్రికిని మామయునగుచు మరి
  దీవనలనిచ్చె వారల దీర్చిదిద్దె.

  రిప్లయితొలగించండి
 7. పెద్ద లేర్పాటు చేసిన పిల్ల నచ్చి
  కౌతు కమ్మున కొమరుడు కట్టె దాళి ,
  తాళి కట్టిన మఱునాడు తాత యయ్యె
  గర్భవతి సుత ప్రసవించ,గలిగె ముదము.

  రిప్లయితొలగించండి
 8. పాండు రాజు కుంతికి తాను భర్త యయ్యె
  రాత్రి పండ్రెండు గంటల రమ్య మైన
  సమయ మందున, పెద్దలు సంతసించ
  తాళి గట్టిన మఱునాడు తాతయయ్యె,
  కర్ణునకు భీష్ముడును కుంతి కారణమున

  రిప్లయితొలగించండి
 9. భూరి సంస్కారి యైనట్టి పుత్రుడొకడు
  నిండు గర్భిణియగునామె నింట దెచ్చి
  కేళి కాదని కట్టెను తాళి; తండ్రి
  తాళి కట్టిన మఱునాడు తాతయయ్యె

  మరొక పూరణ

  కూతురిగ కణ్వుడెంచె శకుంతల నట
  వలచి దుష్యంతుడామెను వలదటనియు
  పుత్రు భరతుని గాంచగా స్ఫురణ కలుగ
  తాళి కట్టిన భర్తగా తలచ, మునియు
  తాళి కట్టిన మఱునాడు తాతయయ్యె

  రిప్లయితొలగించండి
 10. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
  శంకరయ్య గారికి వందనములు

  బ్రహ్మచారియౌ పినతండ్రి పరిణయ మయి
  తాళి గట్టిన మఱునాడు ,తాత యయ్యె
  తన యన్న బిడ్డకు ప్రసవమై యాడు శిశువు
  కలిగె నను వర్తమానమ్ము తెలిసి నంత

  రిప్లయితొలగించండి
 11. కవిమిత్రులకు నమస్కృతులు.
  నిన్న మా మేనల్లుని కూతురు నిశ్చితార్థానికి వెళ్ళి రాత్రి తిరిగివచ్చాను. ప్రయాణపుటలసట కారణంగా మిత్రుల రచనల సమీక్ష, ఈ నాటి పోస్టుల షెడ్యూల్ చేయలేకపోయాను. మన్నించండి.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  ప్రయాణపు తొందరలో కేవల మీ పూరణలోని దోషాలను మాత్రమే చూపాను. సవరణలను సూచించలేదు.

  రిప్లయితొలగించండి