26, ఏప్రిల్ 2014, శనివారం

పద్య రచన – 578

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

8 కామెంట్‌లు:

 1. కన్నులను మూసుకొనినది చిన్న పిల్ల
  మెట్లు దిగుచుండి యాగె చప్పట్లు వినుచు
  ఆడుచున్నది మేలమ్ము లన్న తోడ
  పరువు లిడి మెట్లు దిగు నింక పసిడి బొమ్మ

  రిప్లయితొలగించండి
 2. అమ్మాయీ మెట్లెక్కుము
  అమ్మోయని భయఫడకనె అడుగెయ్ పైకే
  అమ్మా వెనుకకు చూడకు
  అమ్మార్గము దాటి గమ్య మందెడి వరకున్.

  రిప్లయితొలగించండి
 3. మెట్లు దిగుచుండి నాగెను మెట్టు మీద
  కళ్ళు మూ సికొనుచు మఱి కాలు జారి
  క్రింద పడుదువో బాలిక !క్రింద జూసి
  మెల్ల మెల్లగ దిగుమిక మెట్ల నుండి

  రిప్లయితొలగించండి
 4. అన్నెము నెరుగనట్టియా చిన్న తల్లి
  యేడ్చుచున్నది మెట్లపై నెక్కటిగను
  తప్పిపోయిరా చిన్నారి తల్లి దండ్రి?
  భారమని తల్చి గుడిలోన వదలినార?

  రిప్లయితొలగించండి
 5. పండిత నేమాని వారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘మెట్లు దిగుచుండి యాగెను’ అనండి.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 6. దోబూచులాట లాడగ
  నేబాలిక నిన్ను పిలిచె? నేమరకమ్మా!
  నీ బాటది సోపానము !
  గాబర పడబోకు జార కాళ్ళే విరుగున్ !

  రిప్లయితొలగించండి
 7. లిఫ్టుకు కరెంటు లేదని
  సాఫ్టుగ దిగ మెట్ల దారి సాగెడు వేళన్
  సేఫ్టీ వీడితివమ్మా!
  షిఫ్టవ్వుదు వాస్పిటలుకు సిరిసిరి మువ్వా!

  రిప్లయితొలగించండి
 8. సహదేవుడు గారూ,
  మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి