7, ఏప్రిల్ 2014, సోమవారం

సమస్యాపూరణం - 1375 (ముండన్ జేరిన నరునకు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
ముండన్ జేరిన నరునకు పుణ్యము గలుగున్.
(అందె వెంకటరాజం గారి అష్టావధానంలో ఇచ్చిన సమస్య)

28 కామెంట్‌లు:

  1. దండిగ పూజలు జేయక
    నిండగు మనమున్నచాలు నిర్మల భక్తిన్
    చండాలు డైన తలచును భీ
    ముండన్ జేరిన నరునకు పుణ్యము గలుగున్

    భీముడు = శివుడు

    రిప్లయితొలగించండి
  2. గుండియలో భక్తి సదా
    నిండుగ వెలుగొందుచుండ నిగమస్తుతయౌ
    కొండల రేని తనయ చా
    ముండన్ జేరిన నరునకు బుణ్యము గలుగున్

    రిప్లయితొలగించండి
  3. మిత్రులారా! శుభాశీస్సులు.
    మిత్రులు శ్రీమతి రాజేశ్వరి గారు పూరించినట్లు భీముండన్ అని కాని శ్రీ నాగరాజు రవీందర్ గారు పూరించినట్లు పరంధాముండన్ అని అనుట కాని వ్యాకరణ విరుద్ధములే. భీముని మరియు పరంధాముని అనుట సాధు ప్రయోగములు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి

  4. పూజ్యగురుదేవులుశంకరయ్యగారికివందనములు
    “మాని” యన్న శబ్దమునకు “బ్రాహ్మణుడు” యని అర్ధము. దయతో
    ఆచార్య జి.యన్ .రెడ్డిగారి తెలుగు పర్యాయపద నిఘంటువు లో
    118 పుట 2429 సంఖ్యను పరిశీలించుడు

    రిప్లయితొలగించండి
  5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  6. కొండల రాయని దలచుచు
    మెండుగ పూజించుచుండ మేలౌ నిలలో
    వెండియు శివవల్లభ చా
    ముండన్ జేరిన నరునకు పుణ్యము గలుగున్

    రిప్లయితొలగించండి
  7. వండన్ వలలుడు మన తో
    డుండన్ దరికేల జేరు నుదరవ్యాధుల్
    నిండున్ కడుపులు నిటమన
    ముండన్ జేరిన నరునకు పుణ్యము గలుగున్ !!!

    ( అజ్ఞాత వాసములొనున్న ధర్మజుడు తమ్ములతో అంటున్న మాటలు . కేవలం ఊహ )

    రిప్లయితొలగించండి
  8. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    గండమ్మౌ దినదినమును
    ముండన్ జేరిన నరునకు, పుణ్యము గలుగున్
    నిండు మనమ్మున భక్తిని
    మెండుగబూజల నొనర్ప మినుసిగ వేల్పున్

    రిప్లయితొలగించండి
  9. ముండ నమే బ్రాప్తించును
    ముండను జేరిన నరునకు, పుణ్యము గలుగున్
    మెండుగ పూజలు మఱి చా
    ముండకు జేయునె డల ముక్తియు కూడన్

    రిప్లయితొలగించండి
  10. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ ప్రయత్నం ప్రశంసనీయం.
    మూడవ పాదంలో గణదోషం. నేమాని వారు చెప్పినట్లు ‘భీముండన్’ అనడం అన్వయలోపమే.
    *
    పండిత నేమాని వారూ,
    చాముండాశ్రయం పుణ్యప్రదమన్న మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ ప్రయత్నం ప్రశంసనీయం.
    నేమాని వారన్నట్లు అన్వయలోపం ఉంది. మీ పద్యాన్ని ఇలా సవరిస్తే బాగుంటుందనుకుంటున్నాను.
    ఉండెద పాలకడలిని ప
    రుండెద పాము మెయిమీద లోకుల గాచన్
    వెండియు నట్టి పరంధా
    ముండన్ జేరిన నరునకు బుణ్యము గలుగున్.
    *
    శైలజ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    విరుపుతో మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. సుబ్బారావు గారూ,
    విరుపుతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
    చివరిపాదంలో గణదోషం. ‘చా/ముండకు జేయు సుజనులకు ముక్తి లభించున్’ అందామా?

    రిప్లయితొలగించండి
  12. మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ వైవిధ్యంగా ఉండి అలరించింది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. మెండుగ హితమును జెప్పుచు
    నిండగు సాత్త్వికత గలిగి నియమవ్రతుఁ డొ
    క్కండు నివసించు నాశ్రమ
    ముండన్ జేరిన నరునకు పుణ్యము గలుగున్.

    రిప్లయితొలగించండి
  14. నిండును గాలము త్వరగా
    ముండన్ జేరిన నరునకు, బుణ్యము గలుగున్
    గొండల నిలయుని తలచిన
    నుండవు విపరీత కోర్కె, లుడుగి యఘమ్ముల్

    రిప్లయితొలగించండి
  15. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. శ్రీ గండూరి లక్ష్మీనారాయణ గారు:శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    విపరీత కోర్కెలు అని సమాసము చేయరాదు కదా. సవరించండి.

    రిప్లయితొలగించండి
  17. గుండుగ మారును తలయే
    ముండన్ జేరిన నరునకు,పుణ్యము గలుగున్
    మెండగు భక్తిన గొలువగ
    కొండల రాయుడినిజేరి కోరి భజించన్

    రిప్లయితొలగించండి
  18. మెండుగ ప్రముఖులు తిరుమల
    కొండకు వచ్చిన ప్రభువును గుడిలో గనగా
    నిండిన గూడన్ దర్శన
    ముండన్ జేరిన నరునకు పుణ్యము కలుగున్

    రిప్లయితొలగించండి
  19. నాగరాజు రవీందర్ గారూ,
    నేనన్నది అదే... పరంధాముండన్ అన్నపదం చేరు అన్న క్రియాపదంతో అన్వయించడం లేదు.
    మీ తాజా పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    ‘విపరీత వాంఛలు’ అనండి.
    *
    శైలజ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. దండిగ పూజలు జేయక
    నిండగు మనమున్న చాలు నిర్మల భక్తిన్
    కొండను నెలకొన్న నిలయ
    ముండన్ జేరిన నరునకు పుణ్యము కలుగున్

    గురువులకు ధన్య వాదములు ఇలా వ్రాస్తె సరిపోతుందేమొ అని

    రిప్లయితొలగించండి
  21. రీ పండిత నేమాని మరియు శ్రీ కంది శంకరయ్య గురువరులకు నమస్కారము
    మీ సవరణకు ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  22. పండు ముదుసలికి నిచ్చిరి
    పండంటి బడుగు వనితను, భర్త గతించన్
    మెండగు దయతో జేకొని
    ముండను జేరిన నరునకు పుణ్యము గలుగున్

    రిప్లయితొలగించండి
  23. ముండుని జంపిన తల్లిని
    భండుని దండించి నట్టి భర్గుని రాణిన్
    చండీ! శరణని శ్రీ చా-
    ముండన్ జేరిన నరునకు పుణ్యము గలుగున్.

    రిప్లయితొలగించండి
  24. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ తాజా పూరణ బాగుంది. అభినందనలు.
    ‘కొండను వెలసిన దేవళ/ ముండన్...’ అంటే ఇంకా బాగుంటుందేమో?
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    విధవను వివాహమాడిన నరుని ప్రస్తావనతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  25. దండిగ సుమముల చేకొని
    మెండుగ నిజ భక్తి తోడ మేలగు స్తుతి తో
    నిండగు మది గొల్వగ చా
    ముండన్ జేరిన నరునకు పుణ్యము కలుగున్

    రిప్లయితొలగించండి
  26. పాండు తనూజుని రీతిన్
    గండములన్నింటి దాటి కైలాసమునన్
    కొండల నెక్కుచు ప్రాణ
    మ్ముండన్ జేరిన నరునకు పుణ్యము గలుగున్

    రిప్లయితొలగించండి
  27. అండగ మిన్నగు శునకం
    బుండగ స్వర్గమ్ము కడకు భోభో యనకే
    దండిగ దేహమ్మున ద
    మ్ముండన్ జేరిన నరునకు పుణ్యము గలుగున్

    రిప్లయితొలగించండి