4, ఏప్రిల్ 2014, శుక్రవారం

సమస్యాపూరణం - 1372 (సతినిఁ జంపె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
సతినిఁ జంపె రామచంద్రమూర్తి.

21 కామెంట్‌లు:

  1. పూజ్యులు నేమానివారికి, మిత్రులు శంకరయ్యగారికి, కవిపండిత మిత్రులకు నమస్కారములు!

    జనకు నాజ్ఞ వడసి, మునియజ్ఞమును గావ
    వనములకును వెడలి, భయము గొలుపు
    తాళ దీర్ఘ్హ దేహ దానవి తాటకీ
    సతినిఁ జంపె రామచంద్రమూర్తి!

    రిప్లయితొలగించండి
  2. అనుజుడుండు రక్ష యని యుంచి జానకీ
    సతిని, జంపె రామచంద్ర మూర్తి
    కదన రంగమందు ఖరదూషణాదుల
    నమిత మోదమంద నమరగణము

    రిప్లయితొలగించండి
  3. రావణాసురుండు రణములో నెదిరించ
    పరుల సతిని బట్టె పాపియనుచు
    తలచి మదిని వనిని తపియించుచున్నట్టి
    సతిని, జంపె రామచంద్రమూర్తి

    రిప్లయితొలగించండి
  4. కావ లంక లోన కడునిడుములబడు
    సతిని, జంపె రామచంద్ర మూర్తి
    రక్కసులఁ రయముగ, రాజుగా జేసెను
    రావణానుజన్ము రాజ్యమునకు

    రిప్లయితొలగించండి
  5. రామ రాజ్యమందు రాక్షసు డీ వ్యక్తి
    సతిని జంపె, రామచంద్ర మూర్తి !
    పట్టి తెచ్చి తిమిటు పాపిష్టి వానిని
    కఠిన శిక్షనిడుము కరుణ వీడి .

    రిప్లయితొలగించండి
  6. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    యాగరక్ష సేయ నేగుచు త్రోవలో
    తారసిల్లు క్రూర “తాటక”నెడి
    సతిని జంపె రామచంద్ర మూర్తి కుశికు
    తనయు నాజ్ఞ వడసి మునులు మెచ్చ

    రిప్లయితొలగించండి
  7. రాక్షసచెరనుండి రక్షించు కొనుటకు
    సతిని, జంపె రామచంద్రమూర్తి
    లంక నేలు నృపతి రావణ బ్రహ్మను
    లక్షణముగ కుజకు రక్ష జెేసె

    రిప్లయితొలగించండి
  8. గురువులకు ప్రయాగ శ్రీరామచంద్రమూర్తి చేయు నమస్కారములు.

    వంశక్షయమగును వలచినచో పర
    సతినిఁ, జంపె రామచంద్రమూర్తి
    ఉన్మద దశకంఠ మోహముపశమించ
    కాముకులకు వమ్ము కరుణ గాదె

    రిప్లయితొలగించండి
  9. మిత్రులకు శుభాశీస్సులు. ఈ నాటి పూరణలు అన్నియును అలరించుచున్నవి. అందరికి అభినందనలు.

    శ్రీ గుండు మధుసూదన్ గారు:
    తాటక వధ గురించి మీ పద్యము చాల బాగుగ నున్నది.

    శ్రీ నాగరాజు రవీందర్ గారు:
    రావణు చెరనుండి అని వాక్రుచ్చిన మీ పద్యము బాగుగ నున్నది.

    శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు:
    మీ పద్యము బాగుగ నున్నది. పరుల సతి అన్నారు -- పర వనితను/పర వనితల అంటే బాగుంటుంది.

    శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు:
    సతిని కావ అనుచు మంచి విరుపుతో మీ పద్యము బాగుగ నున్నది.

    శ్రీ గండూరి లక్ష్మీనారాయణ గారు:
    రాముని రాజ్యములో ఒక కథను ప్రస్తావించేరు. బాగున్నది మీ పద్యము.

    శ్రీ తిమ్మాజీ రావు గారు:
    మీ పద్యము బాగున్నది. తాటకనెడి కి బదులుగా తాటకయను అంటే బాగుగ నుండును.

    శ్రీమతి శైలజ గారు:
    మీ పద్యము బాగుగ నున్నది. రాక్షస చెర అంటే దుష్ట సమాసము - రక్కసు చెర అందాము.

    శ్రీ ప్రయాగ శ్రీరామచంద్ర మూర్తి గారు:
    మీ పద్యము బాగుగ నున్నది.
    వంశ క్షయమగును - అనుచోట శ గురువు అగును - అందుచేత గణభంగము - కనుక వంశనాశమగును అందాము.
    ఉన్మద - మోహము లకు యతి చెల్లదు. ఆ పాదమునకు బదులుగా "కామి పంక్తికంఠు కామమ్ము నాశిల్ల" అందాము.

    రిప్లయితొలగించండి
  10. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు
    నీ శిష్యపరమాణువు వినమ్రవందనములతో.
    ==========*=============
    సతిని బంపె రామ చంద్ర మూర్తి విపిన
    ములకు జదివె నిట్లు పొట్టి వాడు
    సతిని జంపె రామ చంద్రమూర్తి తన సో
    దరుని తోడ తాను తాపమొంది

    రిప్లయితొలగించండి
  11. వెంట బెట్టుకు నడవికి నేగె రాముడు
    సతిని, జంపె రామ చంద్ర మూర్తి
    రావణాది దుష్ట రాక్షస మూకను
    హర్ష మొందె లోక మతని జూచి

    రిప్లయితొలగించండి
  12. శ్రీ వరప్రసాద్ గారు: శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. రాముడు సీతా పరిత్యాగమును చేయుట గురించి చెప్పేరు. అభినందనలు.

    శ్రీ సుబ్బా రావు గారు: శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    రాక్షస మూక అనుట దుష్ట సమాసము. రక్కసి మూక అందాము.

    రిప్లయితొలగించండి
  13. అసురరాజు బట్ట నలరామచంద్రుని
    సతినిఁ , జంపె రామచంద్రమూర్తి
    రావణుని రణమున ప్రాణ సఖిని గావ
    జను లయోధ్య పురిని జై యనంగ

    రిప్లయితొలగించండి
  14. ఆర్యా ! ధన్యవాదములు. మీరు చూపిన సవరణతో...


    రావణాసురుండు రణములో నెదిరించ
    పర వనితను బట్టె పాపియనుచు
    తలచి మదిని వనిని తపియించుచున్నట్టి
    సతిని, జంపె రామచంద్రమూర్తి

    రిప్లయితొలగించండి
  15. శ్రీ భాగవతుల కృష్ణా రావు గారు: నమస్కారములు.
    మీ పద్యము బాగుగ ఉన్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. వీర హనుమ యునికి వెదకి తెలుప
    సతిని, జంపె రామచంద్ర మూర్తి
    రావణాది లంక రక్కసి మూకల
    ధర్మ రక్షణమ్ము ధరణి నిలుప

    రిప్లయితొలగించండి
  17. పండిత నేమాని గారికి
    మీసూచన|సవరణకు ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  18. శ్రీ సహదేవుడు గారు: శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. కొన్ని సవరణలు చేసేను ఈ విధముగా:

    వీర హనుమ యునికి వెదకి తెలుప రామ
    సతిని, జంపె రామచంద్ర మూర్తి
    రావణాదులైన రక్కసి మూకల
    ధర్మ రక్షణమ్ము ధరణి నిలుప

    రిప్లయితొలగించండి
  19. శ్రీ నేమని గురువర్యుగురువుల చక్కటి సవరణలకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి