24, ఏప్రిల్ 2014, గురువారం

పద్య రచన – 576

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

15 కామెంట్‌లు:

  1. అంకెల గారడి జెప్పుచు
    సంకలి తపునీతి కధలు సౌశీ ల్యమునన్
    పంకజ నాభుని సన్నిధి
    జంకక జేరుదురు మిత్ర సాంగత్య మునన్

    రిప్లయితొలగించండి
  2. వేసవి సెలవు లందున విజ్ఞానమున్ బెంచ
    నాటి పెద్దలు తుష్టితోఁ బాటు పడిరి
    పెద్దవారలు దూరమై పిల్లలెల్ల
    నేడు పుస్తకములతోడ నాడు చుండ్రి

    రిప్లయితొలగించండి
  3. చిన్న తనమందె పుస్తక
    మన్న నభిరుచి కలిగించి యద్భుత మతిగా
    నెన్నదగిన మనుజులనిల
    మన్నన నిల్పంగ ప్రతిన మంచిది గదరా!

    రిప్లయితొలగించండి
  4. చిన్న పిల్లల కొఱకునై చిన్ని చిన్ని
    కథల పుస్తక ములచట గలవు చాల
    నీతి బోధించు కథలవి నిరతి తోడ
    చదువ దగునార్య ! ప్రతియొక్క చదువ రియును

    రిప్లయితొలగించండి
  5. మంచిని భోధించినిలను
    పంచును గదమానవతను బాలల హృదిలో
    పెంచును ధారణ శక్తిని
    సంచితమౌనీతికధలు చదువగ రారే!

    రిప్లయితొలగించండి
  6. పుస్తక మనవరతమ్మును
    హస్తములో నుంచుకొనిన నది బాలక! నీ
    మస్తిష్కములో పెనుచును
    నేస్తమువలె ప్రబల నీతి నియమోన్నతులన్

    రిప్లయితొలగించండి
  7. అమ్మమ్మలు లేకున్నన్
    బొమ్మల పుస్తకములు తమ బుద్ధిని పెంచన్
    యిమ్ముగ జ్ఞానార్జన చి
    న్నమ్మలు పొందుచు మెలగెడు నానందముగన్

    రిప్లయితొలగించండి
  8. నిరతము పాఠ్యాంశములన్
    పరీక్షలను పేర నేటి బాలలు నేర్వన్
    స్థిరముగ నెప్పుడు నేర్తురు?
    కరదీపికలంటి బాల కథలను , నీతిన్!

    రిప్లయితొలగించండి
  9. మిత్రులారా! శుభాశీస్సులు.
    ఈ నాటి మీ పద్యము లన్నియును అలరించు చున్నవి.
    అందరికి అభినందనలు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  10. శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు:
    మీ 2 పద్యములు బాగుగ నున్నవి.
    1వ పద్యములో 1వ పాదములో గణములు సరిగా లేవు.
    2వ పద్యములో: పెంచన్ + ఇమ్ముగ అనుచోట యడాగమము రాదు.

    శ్రీమతి శైలజ గారు:
    మీ పద్యము బాగుగ నున్నది.
    బోధించి + ఇలను = అనుచోట నుగాగమము రాదు.
    ధారణా శక్తి అనుట సాధు ప్రయోగము.

    రిప్లయితొలగించండి
  11. హస్త గతమౌను విద్య, స
    మస్తముతెలియంగవచ్చు మాన్యత హెచ్చున్
    పుస్తక పఠనమ్ము వలన
    మస్తకములుకాంతులీను మణిదీపములై !!!

    రిప్లయితొలగించండి
  12. ఫూజ్య గురుదేవులు పండిత నేమాని గారికి నమస్సులు. తమరి సలహాలకు ధన్యవాదములు. రెండవ పద్యమును యి లామార్చాను.
    అమ్మమ్మలు లేకున్నన్
    బొమ్మల పుస్తకములు తమ బుద్ధిని పెంచన్
    గ్రమ్మన జ్ఞానార్జన చి
    న్నమ్మలు పొందుచు మెలగెడు నానందముగన్

    రిప్లయితొలగించండి
  13. వేసవి సెలవు దినముల విద్యఁబెంచ
    నాటి పెద్దలు తుష్టితోఁ బాటు పడిరి
    పెద్దవారలు దూరమై పిల్లలెల్ల
    నేడు పుస్తకములతోడ నాడు చుండ్రి

    రిప్లయితొలగించండి
  14. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    గణదోషాన్ని సవరించిన మీ మొదటి పద్యం బాగున్నది. అభినందనలు.
    మీ రెండవ పద్యం కూడా బాగుంది. మూడవ పాదం ప్రారంభంలో యడాగమం రాదు. ‘బుద్ధిని పెంచ/ న్నిమ్ముగ...’ అనండి.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘బోధించి యిలను’ అనండి.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘వంటి’ని ‘అంటి’ అనడం గ్రామ్యం. ‘కరదీపికలైన’ అనండి.
    *
    మంద పీతాంబర్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    మిత్రుల పూరణల, పద్యాల సమీక్ష చేసినందుకు కృతజ్ఞతాభివందనాలు.

    రిప్లయితొలగించండి
  15. ఇవినీతి కథలు చూడుడు
    అవి నీతిని బోధ సేయు బాలలకెపుడున్
    అవినీతి త్రోవ బోవదు
    ఇవి నేర్చిన వారి బ్రతుకులింపుగ సాగున్.

    రిప్లయితొలగించండి