23, ఏప్రిల్ 2014, బుధవారం

పద్య రచన – 575

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

10 కామెంట్‌లు:

  1. ఎదను నిలుపు కొందు పదిలమ్ము గానిన్ను ,
    చింత మాని నాదు చెంత నుండ
    అంద మైన పలుకు నడిదమ్ము వెన్నుకు
    గురిని బెట్టె మత్తు తెరను గప్పి

    రిప్లయితొలగించండి

  2. చేత వెన్న కత్తి
    చెంగల్వ మాస్కు
    చెంపన కిస్సు
    చప్పున కిల్లు !!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. ముద్దు లాడుచు నుండెను ముసుగు లోన
    నేమి చిత్రము రాయది ? యిటుల జేయ
    పిల్లి మాదిరి వర్తిల్ల చెల్లు బాటె ?
    సంఘ మర్యాద లను మ ఱి సలుప వలదె ?

    రిప్లయితొలగించండి
  4. ప్రేమ పేరు తోడ పెక్కు మాటలఁ జెప్పి
    ముగ్గులోకి లాగి ముద్దులిచ్చి
    వెన్నుపోటు పొడుచు చున్నారు వనితలు
    నట్టి వారి చేయిఁ బట్ట వద్దు

    రిప్లయితొలగించండి
  5. హద్దులు లేవని మాకిక
    ముద్దుగ తా ముసుగులోన మోసము తోడన్
    ముద్దులు పెట్టుచు వెన్నున
    గ్రుద్దెను కరవాలుతోడ కోమలి ప్రియునిన్.

    రిప్లయితొలగించండి
  6. ప్రేమ పేరు తోడ పెక్కు మాటలఁ జెప్పి
    ముగ్గులోకి లాగి ముద్దులిచ్చి
    వెన్నుపోటు పొడుచు చున్నారు వనితలు
    పిదప కాలమందు పిదప బుద్ధి

    రిప్లయితొలగించండి
  7. మత్తైన మాటల మోహాన
    కత్తుల కౌగిట కరుగక గమనించగదే !
    మెత్తని గులాబి పూవుల
    గుత్తుల మాటు కంటకమ్ము గుచ్చుకొనుగదే !

    రిప్లయితొలగించండి
  8. మిత్రులారా! శుభాశీస్సులు.
    ఈ నాటి అందరి పద్యములు అలరించుచున్నవి. అందరికి అభినందనలు.
    కొన్ని సూచనలు:

    శ్రీ సహదేవుడు గారు:
    మీ పద్యములో 1, 4 పాదములలో గణములను మరొక మారు చూడండి.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  9. శ్రీ నేమని గురువర్యుల సూచనల మేరకు సవరించిన పద్యం:
    మత్తైన సరసమందున
    కత్తుల కౌగిట కరుగక గమనించగదే !
    మెత్తని గులాబి పూవుల
    గుత్తుల వెనకుండు ముల్లు గుచ్చుకొనుగదే !

    రిప్లయితొలగించండి