7, ఏప్రిల్ 2014, సోమవారం

పద్య రచన – 559

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

20 కామెంట్‌లు:

  1. యూదుల పయనమ్మె టకో
    బాధలు భరియించ లేక బ్రతుకే భరమౌ
    బోధక గురువులు లేరట
    సోధన యందైన తెలుప సోముని కైనన్

    రిప్లయితొలగించండి
  2. జనని గర్భమున బీజమ్ముగా పడి యట
    ....పెరుగుచు పెరుగుచు బిడ్డ యగును
    పిదప జననమొందు పృథ్వీతలంబున
    ....శిశువుగా కొన్నేళ్ళు చెలగుచుండు
    నటుపైని బాలుడై యాట పాటలలోన
    ....కన్నవారికి వేడ్క కలుగ జేయు
    యౌవన ప్రాయమునందు నర్థాంగితో
    ....సౌఖ్యమ్ములొందు సంసారమందు
    తదుపరి గడపుచుండు వార్ధక్య దశను
    నంత్యకాలమ్మునందు కాయమును విడుచు
    మరల జన్మముల్ మరణముల్ పొరయుచుండు
    నకట జీవుడు చక్రమ్మునందు వోలె

    రిప్లయితొలగించండి

  3. పుట్టుటయు గిట్టుటయు భ్రమణం
    తెలియ వచ్చిన జ్ఞానం జీవన
    భ్రమణమ్ త్వద్ధామ పరమం మమ
    కాకున్న ఇక అది చర్విత చర్వణం !


    శుభోదయం
    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  5. పుట్టు చున్న దెల్ల గిట్టుచు నుండును
    గిట్టు చున్న దెల్ల బుట్టు చుండు
    పుట్టి గిట్టు లోని పోకడ లేమిటో
    ఎరుక గలుగు వారు ధరను గలరె?

    రిప్లయితొలగించండి
  6. కర్మతోనె బుట్టి కర్మతో బెరుగుచు
    కర్మ ఫలము నందె నర్మిలిచ్చి
    కర్మ యందు లయము గలిగించు కాలుడే
    కర్మ జన్మ గాదె కాశి నాధ

    రిప్లయితొలగించండి
  7. జనన మరణము లయ్యవి జరుగు చుండు
    పుణ్య పాపము లనుబట్టి పురుషున కిల
    పిండముగ మొద లగుచునై పెద్ద వయసు
    వచ్చు పిమ్మట మరణము వచ్చు వరుస

    రిప్లయితొలగించండి
  8. రాజేశ్వరి అక్కయ్యా,
    ఆ చిత్రంలో వలస వెళ్తున్న యూదులు కనిపించారు మీకు. బాగుంది. ‘శోధన’కు ‘సోధన’ అని టైపాటు.
    *
    పండిత నేమాని వారూ,
    జీవితచక్రాన్ని వివరించిన మీ సీసపద్యం చాలా బాగుంది. అభినందనలు.
    *
    జిలేబీ గారూ,
    _/\_
    *
    శైలజ గారూ,
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. భగవాన్.....
    పరమాత్మ నుండి విడివడి
    ధరణిని జనియించి యాత్మ తన గతి ముగియన్
    దిరిగి పరమాత్మ జేరును
    మరు జన్మ బరువని వేడ మన్నించవయా !

    రిప్లయితొలగించండి
  10. సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. ఏది శాశ్వితమ్ము యేదేదశాశ్విత
    మ్మెరుగు వాడు దేవ గురుడొకండె
    పుట్టినట్టిజీవి గిట్టుటే సత్యంబు
    కాలచక్ర మొకటె కదులుచుండు !!!

    రిప్లయితొలగించండి
  12. మంద పీతాంబర్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘శాశ్వతము’ను ‘శాశ్వితము’ అన్నారు. టైపాటా?

    రిప్లయితొలగించండి
  13. పెద్దలందరికీ నా నమస్కారములు ! బ్లాగు మిత్రులందరికీ నా శుభాభినందనలు !

    నా ప్రయత్నమిది ,

    కవినో కల్పననో కథాసరళినో కాయంబునో కుర్రనో
    యువప్రాయోజ్జ్వల దీప్తినో భవ మహా యోధుండనో ఒంటినో
    జవ సత్త్వంబులు యంతమౌ ముసలినో జన్మాంతమున్ చేరి నే
    శవమై నీ కవనాంతమై మరల నీ చక్రాంకితున్ గాగ ! మా
    ధవ! నా యాత్మగ వెంట వచ్చితివి సత్యంబెంచ నే నీడనో

    రిప్లయితొలగించండి
  14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి

  15. పరమాత్మన్ విడి పంచ భూతములతో ప్రాణమ్ముదేహాకృతిన్
    ధరసంప్రాప్తించగబాలుడై యువకుడై ధర్మార్ధ కామమ్ములన్
    వరుసన్ బొంది సమస్త భూతముల దైవమ్మున్ బొడన్ గాంచుచున్
    జర భారమ్మవ యోగియై పరమమున్ సాధించ ధన్యాత్ముడే
    జనన మరణాల చక్రభ్రమణమునందు
    మాయలో జిక్కుకున్నట్టి మనుజులకును
    మమత బంధముల్ రాగముల్ మాయ వెపుడు
    సతత హరి చింతనొక్కటే సాధనమ్ము

    రిప్లయితొలగించండి
  16. శిశువుగ బుట్టి యుక్తమగు చేష్టల నెన్నియొ జేసి, యొక్కెడన్
    పశువుగ మారి యౌవనపు వాంఛల ధాటికి, పండి, పిమ్మటన్
    వశమయి వ్యాధి బాధలకు, ప్రార్థన జేయుచు ముక్తి కోసమై,
    యశ మవశేషమై మరొక యమ్మకు బిడ్డడుగా జనించుచున్
    కుశలము లేక జీవి తెగ కూరుకు పోవును కర్మలందునన్.


    రిప్లయితొలగించండి
  17. కళ్యాణ్ గారూ,
    చక్కని పద్యాన్ని రచించారు. అభినందనలు.
    ‘సత్త్వంబులు + అంతమౌ’ అన్నప్పుడు సంధి నిత్యం. యడాగమం రాదు. అక్కడ ‘జవసత్త్వంబులు ధ్వంసమౌ’ అనండి.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
    మొదటి పద్యం రెండవ పాదంలో ‘సంప్రాప్తించగ’ అన్నప్పుడు గణదోషం. ‘ధర ప్రాప్తించగ...’ అంటే సరి.
    ‘చింతన + ఒకటే’ అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. ‘చింతనమె మేటి సాధనమ్ము’ అనండి.
    *
    మిస్సన్న గారూ,
    ఉత్తమమైన పద్యాన్ని చెప్పారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. పుట్టినప్పుడు చితిలోన పెట్టినపుడు
    తోడు వచ్చును చెయిదులు నీడ వోలె
    పుణ్య కార్యములను సల్పి ముదముతోడ
    మంచి పథమును పొందుడు మనుజులార

    రిప్లయితొలగించండి
  19. పూజ్యగురుదేవులుశంకరయ్యగారికివందనములు

    తమరిసూచన సవరణలకు ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  20. పునరపి జననము చూడగ
    పునరపి మరణమ్ము గలుగు భూమిని యనుచున్
    మన శంకరుండు చెప్పెను
    మనశంకలు తొలగు నిజము మాన్యుని గొలువన్.

    రిప్లయితొలగించండి