రాజేశ్వరి అక్కయ్యా, బాగుంది మీ పద్యం. అభినందనలు. * శైలజ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * నాగరాజు రవీందర్ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. * గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, బాగున్నది మీ పద్యం. అభినందనలు.
సైకిలు నేర్పిన పాపకు
రిప్లయితొలగించండిబైకులు నడుపంగ నిలను బాధ్యత దెలియున్
ప్రాకట మగుచదు వుచదివి
లోకంబున పేరు గాంచి లోపా ముద్రై
అగస్త్యు డంతటి వానికి భార్య కావాలని
తనయకు సైకిలు నేర్పుచు
రిప్లయితొలగించండిఅనిశము తనవెటనడచు ననురాగముతో
ఘనమైనతండ్రి ప్రేమను
కొనగల నిధులంటు గలవె కువలయమందున్
బుడి బుడి నడకల నేర్పెను
రిప్లయితొలగించండికడు చక్కగ నేర్పు చుండె గద సైకిలు తా
వడి వడి పెరిగెడి బిడ్డకు
సడి చప్పుడు లేని చోట సంబర పడుచున్
కన్న తండ్రియె గురువుగ చిన్న తల్లి
రిప్లయితొలగించండినేర్చుకొనుచుండె సైకిలు నిష్ట తోడ
భావి జీవిత మందున బైకుపైన
స్వారిచేయును ముదముతో చక్కనమ్మ
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిబాగుంది మీ పద్యం. అభినందనలు.
*
శైలజ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
నాగరాజు రవీందర్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*
గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
బాగున్నది మీ పద్యం. అభినందనలు.
తండ్రియనే వాడు...
రిప్లయితొలగించండిగుండెల మోయును సైకిల్
బండీ నేర్పుచు బ్రతుకు బాటను జూపున్
కొండల రాయుని బోలిన
దండిగ మనసున్న వాన్కి దంపతి జేయున్
నేర్పు చుండెను సైకిలు నెమ్మి తోడ
రిప్లయితొలగించండితనదు దుహితకు నోర్పుతో దండ్రి యచట
రక్త సంబంధ మన యిట్లు రక్తి గలుగు
చిత్ర మండున జూడుము శేష సాయి !
సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిబాగుంది మీ పద్యం. అభినందనలు.
రెండవ పాదంలో గణదోషం. ‘బండిని నేర్పుచును బ్రతుకు...’ అంటే సరి.
‘వాని దారగ జేయున్’ అనండి.
*
సుబ్బారావు గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
‘శేషశాయి’ అనాలి కదా!
గురువు గారికి ధన్యవాదములతో సవరించిన పద్యం:
రిప్లయితొలగించండితండ్రియనే వాడు...
గుండెల మోయును సైకిల్
బండిని నేర్పుచును బ్రతుకు బాటను జూపున్
కొండల రాయుని బోలిన
దండిగ మనసున్న వాని దారగ జేయున్