రాజేశ్వరి అక్కయ్యా, మీ పద్యం బాగుంది. అభినందనలు. * సుబ్బారావు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. * పండిత నేమాని వారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. * మిస్సన్న గారూ, బాగుంది మీ పద్యం. అభినందనలు. * శైలజ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
మండు టెండ లోన మలమల మాడుచు
రిప్లయితొలగించండిగొంతు తడుపు కొనగ కోరి జలము
భువికి దిగిన గంగ భోగవతి యటంచు
క్రింద వరకు బోయె యంద కుండ
ఏమి దురవస్థ వాటిల్లె నీ ప్ర జలకు
రిప్లయితొలగించండిత్రాగు నీటికి కొఱకునై తాడి లోతు
గలుగు బావిలో నికిదిగి కాంత యచట
యందు కొనుచుండె బిందెను నక్క టకట
కష్ట కాల మొచ్చె ప్రజకు కడకు నీరు దక్కకన్
రిప్లయితొలగించండిదుష్ట నేత లెల్ల ప్రజల దుఃఖితులను జేసిరే
కష్ట నష్ట ములకు నోర్చి కలికి దిగియు నూతిలో
నిష్టముగను నీరు పంచె నెల్ల జనులు బొగడగన్.
గ్రుక్క నీటి కొరకు కుములు చుండ ప్రజలు
రిప్లయితొలగించండిజలక మాడు చుండ్రి కలిమి పరులు
త్రాగు నీటి కొరకు తగవులు వచ్చును
బడుగు వారి పాట్లు పాయు టెపుడొ
కట కట నీరము కొరకై
రిప్లయితొలగించండికటకటలం బడుచునుండగా జానపదుల్
గుటకలు వేయుచు జూచెడు
నటరాజులు గాదె నేటి నాయకు లకటా!
ధన దాహమునకు వశులౌ
రిప్లయితొలగించండిమన నేతల కవగతంబె మండెడు యెండన్
మనిపెడు జలముల కొఱకై
జనములు పడు పాట్లు, వ్యధలు చాలును మాటల్.
త్రాగు నీటికై నందరు తరలి రాగ
రిప్లయితొలగించండిదిగుడు బావిన దిగెనొక ధీర వనిత
మొక్కుబడిగా నూరెను చుక్కనీరు
నదియె పంచుచు నుండెను నతివ గనుడు
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
*
శైలజ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
శ్రీమతి రాజేశ్వరి గారు:
రిప్లయితొలగించండిమీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
4వ పాదములో యడాగమము రాదు. నుగాగమము వచ్చును -- బోయె + అందకుండ = బోయెనందకుండ అగును.
శ్రీ గండూరి లక్ష్మీనారాయణ గారు:
మీ పద్యము బాగుగ నున్నది అభినందనలు.
కాలమొచ్చె అనుట సాధువు కాదు.
కడకు నీరు దక్కకన్ అనుచోట చివరలో ద్రుతము రాదు.
శ్రీ మిస్సన్న గారు:
మీ పద్యము బాగుగ నున్నది. అబ్ఝినందనలు.
మండెడు + ఎండన్ = మండెడునెండన్ అగును.
శ్రీమతి శైలజ గారు:
మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
నీటికై + అందరు = నీటికై యందరు అని యడాగమము వచ్చును.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
రిప్లయితొలగించండిశంకరయ్య గారికి వందనములు పద్యరచన:త్రాగు నీటి కొరకు కొణతలపాలెము ప్రజలపాట్లు
చిత్రమందున గమనించు డాత్ర పడుచు
కలికియొక్కతె బావిలో నిలిచి యుండి
నీటి బిందెను యందించ సాటి మనిసి
యందుగొను చుండె గట్టును యానుకొనుచు.
త్రాగునీటి కొరకు గ్రామీణు లెల్లరు
నొకరికష్టమొకరెరుకను గల్గి
తాడిలోతు బావి తలమున నీటిని
బిందెలందు నింపి నంద జేయు.
కుత్స్తితుని గృహాన యుత్సవమ్ము కొరకు
కోట్లు మించు ఖర్చుకుములు ప్రజకు
త్రాగు నీటి కొరకు తరలింప నేరడు
మంచినీటి వ్యానుమరల మరల.
మూగతనము పూసరేగ మండలముదా
సహనమాభరణమ? జనులకెపుడు
నెత్తిపైన నీరు నేతల సొత్తుయా
సత్తురూక మందు మత్తు ప్రజకు
గగనసీమల నున్న గంగనిల దింపె
రిప్లయితొలగించండినా భగీరథుండు;జనులకండ యగుచు
నార్తిఁ దీర్పగ పాతాళమందు దాగు
జలముఁ దెచ్చునెవడనగ సందియమ్మె.
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
ఆ దోషాలను నేను గమనించలేదు.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘బిందెను + అందించ’, ‘గట్టును + ఆనుకొనుచు’, ‘సొత్తు + ఆ’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘బిందె నందించగ’, ‘గట్టునె యానుకొనుచు’, ‘పొత్తయ్యె’ అనండి.
లక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
పూజ్యులు గురుదేవులు
రిప్లయితొలగించండిశంకరయ్య గారికి వందనములు
మీసూచనలమేరకు పద్యములను
సవరించితిని.ధన్యవాదములు.
భూతలము జారె గంగయె
రిప్లయితొలగించండితాతల సంతృప్తిఁ భరచి ధన్యత నొందన్!
జేతయె? భగీరధునకున్
పాతాళపు గంగఁదోడి ప్రాణము నిలుపన్!
సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.