19, ఏప్రిల్ 2014, శనివారం

పద్య రచన – 571

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

19 కామెంట్‌లు:

  1. సొబగులు విరియగ పార్వతి
    కబరీ బంధమును గాంచ కన్నుల విందౌ
    శుభమట కేశములు సతికి
    ప్రబలుచు పెరిగిన కురులు భార మటంచున్

    రిప్లయితొలగించండి
  2. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    చివరిపాదంలో గణదోషం. ‘ప్రబలి పెరిగినట్టి కురులు భార మటంచున్’ అనండి.

    రిప్లయితొలగించండి
  3. చాలపొడవైన కురులతో నీలవేణి
    సొగసు జూడగనెంచగా సుందరులట
    పగిలె కిటికీల యద్దాలు భామ గనుమ
    దిష్టి(దృష్టి) దోషము తగులునో తీగ నీకు!

    రిప్లయితొలగించండి
  4. పొడవైనకేశ సంపద
    పడతికి అందమ్మునొసగు, వాల్జడ వేయన్
    నడయాడు జడను చూడగ
    పడిపోవునుగాదె బ్రహ్మ ఫాలుండైనన్

    రిప్లయితొలగించండి
  5. చిత్ర మయ్యది జూడుడు చిత్రముగను
    భామ చూపించు చుండెను బల్ల యెక్కి
    తనదు పొడుగాటి కురులను తమము తోడ
    మెచ్చు కొనదగు విషయము మేదిని యది

    రిప్లయితొలగించండి
  6. నిడుపాటి కురులు జూపగ
    పడతెక్కెను బల్లపైన పదుగురు మెచ్చన్
    పొడవైన కేశసంపద
    నిడుముల బడద్రోయుగాదె నింతుల నిలలో!

    రిప్లయితొలగించండి
  7. కురుల పొడుగునుఁ జూపించి గొప్ప చెప్పి
    కొనగ నూనెల నమ్మెడు కొందరిట్లు
    మాయ చిత్రములనుఁ గూర్చి మర్మముగను
    ప్రకటనల జనులను మోసపఱచుచుంద్రు.

    రిప్లయితొలగించండి
  8. చెన్నగు కచభరమ్ముతో చిట్టి తల్లి
    చెంగలించుచు నున్నది చిత్రముగను
    స్టూలుపైన తా నిలుచుండి సొంపుగాను
    శుద్ధ పరచుచుండె కురులఁ బుద్ధి గాను





    రిప్లయితొలగించండి
  9. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    పద్యరచన:కురుల నలుపును మబ్బులు కూర్మినొసగ
    మరులు గొలిపిన ప్రణయపుటురులు చెలివి
    మబ్బు వీడిన చంద్ర బిoబoపుమోము
    కాన్కబొందగ నచ్చరల్ గిన్క వడిరి
    నెమలి పి౦ఛపునిడివియు చమరి మృగము
    కుచ్చు కన్నను మృదువును కురులు గల్గు
    యతివ!నీకేశ సంపద కంజలింతు
    చతురమతి యగు బ్రహ్మకు నతి నొనర్తు.

    రిప్లయితొలగించండి
  10. కేశ వర్ధని వాడితో కేశశాలి!
    వెండ్రుకల నింత పొడవుగా పెంచితీవు
    సీత ద్రౌపదుల్ నినుజూచి చింత వడగ
    చూడ ముచ్చట గొలిపెడి చూపరులకు.

    రిప్లయితొలగించండి
  11. శ్రీ మిస్సన్న గారూ!
    శుభాశీస్సులు. మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    కేశశాలిని అనవలెను స్త్రీమూర్తులను. అంతకంటె కృష్ణవేణి చాల బాగుగ నుండును. ముచ్చట గొలిపెడి చూపరులకు అనుటలో అన్వయము వీలుగా లేదు. చూడ ముచ్చట గొలుపుచు అనాలేమో? స్వస్తి.

    రిప్లయితొలగించండి
  12. అలి నీలాలక! నీదు కేశ విభవం బత్యంత దీర్ఘంబునై
    తలదన్నున్ కద దేవకాంతలను గంధర్వాంగనా శ్రేణులన్
    బళి! సంరక్షణ కేమి తైలములొ, శోభల్ పెంచు వైద్యంబులో?
    యిల వర్ధిల్లుము విశ్వసుందరిగ నెంతే కీర్తి వెల్గొందగా

    రిప్లయితొలగించండి
  13. సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    ‘పడతి + ఎక్కెను’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. ‘పడతుక తా నెక్కె బల్ల పదుగురు మెచ్చన్’ అనండి.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    ప్రకటనల మాయాజాలాన్ని గురించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    నేమాని గురువుల సూచనలను గమనించారు కదా!

    రిప్లయితొలగించండి
  14. పండిత నేమాని వారూ,
    మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. వరమా చూచునదిచట స
    వరమా చెప్పమ్మ నీవు పదములె దాటెన్
    కురులవి చూడగ నాకే
    వరమో శాపమ్మొ నుడువ పదములె లేవే !

    రిప్లయితొలగించండి
  16. నేమాని పండితార్యా! మీ పద్యం హృద్యంగా ఉంది.

    మీ సవరణలకు ధన్యవాదములు.

    సవరించిన నా పద్యం:

    కేశ వర్ధని వాడితో కృష్ణవేణి!
    వెండ్రుకల నింత పొడవుగా పెంచితీవు
    సీత ద్రౌపదుల్ నినుజూచి చింత వడగ
    చూడ ముచ్చట గొలుపుచు చూపరులకు.

    రిప్లయితొలగించండి
  17. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    చక్కని పద్యం. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. హనుమచ్చాస్త్రి గారూ అభినందనలు అందమైన పద్యాన్ని చెప్పారు. ఆడవాళ్ళకు జుట్టు మోకాళ్లను దాటి పొడుగు ఉండరాదని పెద్దలంటూ ఉంటారు. ఆ భావాన్ని అన్యాపదేశంగా చెప్పేరు.

    రిప్లయితొలగించండి
  19. మాస్టరుగారూ ! ధన్యవాదములు..
    మిస్సన్న గారూ ! ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి