కవిమిత్రులకు నమస్కృతులు. మేము రేపు ఇల్లు మారుతున్నాము. మరికొద్ది సేపట్లో నా కంప్యూటర్ అట్టడబ్బాలోకి చేరుతుంది. కొత్త ఇంట్లో కంప్యూటర్ ఫిక్స్ చేసి, నెట్ కనెక్షన్ తీసుకోడానికి మూడు నాలుగు రోజులు పట్టవచ్చు. ఈ నాలుగు రోజులకు పద్యరచన, సమస్యాపూరణ శీర్షికలను షెడ్యూల్ చేసి ఉంచాను. దయచేసి మిత్రులు సహకరించవలసిందిగా మనవి.
శ్రీ పండిత నేమానిగురువరులకు నమస్కారములు మీ సూచన తరువాత సవరించి వ్రాసిన పద్యం పొగ బీల్చికు భుగభుగ మని మగవాడనటంచు నీవు, మాయని రోగం బగుపడక మృత్యు శయ్యకు సుగుణాకర నిన్ను జేర్చు సుమి సిగరేటే.
రిప్లయితొలగించండినోటిన వదిలిన పొగ తుపాకి
గొట్టమై తలపై అగుపించే
కర్మ ఫలము ఇదియే అని
నమ్ము నిక్కముగా జిలేబి !!
జిలేబి
(పొగ త్రాగని వాడు దున్న పోతై పుట్టున్ ) !
భుగభుగమని పొగలొదులుచు
రిప్లయితొలగించండిసిగరెట్టును ద్రాగుచున్న సిరితా పోవున్
పొగద్రాగుట హానికరము
పొగద్రాగుట మానుకున్న పొందును సుఖమున్
పొగత్రాగుట నీతలపై
రిప్లయితొలగించండిపొగ త్రాగుచు వదలగానె పొగలే మారెన్
పొగ గన్నుగ నీతలపై
తెగబీల్చుటనాపి కన్ను తెరువుమ తెలివిన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపొగత్రాగి వదలినంతనె
రిప్లయితొలగించండిపొగ గన్నుగ మారితలను పొగరుగ జూచున్
ఖగపతి దెచ్చిన దైనను
పొగత్రాగుటహాని గాదె పోడిమి యగునా?
బుగబుగమని సతము పొగవదలుచు మీరు
రిప్లయితొలగించండిగగనమునకు పంపె సిగ రెటనుచు
సంబరపడవలదు, జంభ భేది కడకు
పయన మగుట జరుగు రయముగాను
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిమేము రేపు ఇల్లు మారుతున్నాము. మరికొద్ది సేపట్లో నా కంప్యూటర్ అట్టడబ్బాలోకి చేరుతుంది. కొత్త ఇంట్లో కంప్యూటర్ ఫిక్స్ చేసి, నెట్ కనెక్షన్ తీసుకోడానికి మూడు నాలుగు రోజులు పట్టవచ్చు. ఈ నాలుగు రోజులకు పద్యరచన, సమస్యాపూరణ శీర్షికలను షెడ్యూల్ చేసి ఉంచాను. దయచేసి మిత్రులు సహకరించవలసిందిగా మనవి.
పొగ బీల్చికు భుగభుగ మని
రిప్లయితొలగించండిమగవాడనటంచు నీవు, వదలిని రోగం
బగుపడక మృత్యు శయ్యకు
సుగుణాకర నిన్ను జేర్చు సుమి సిగరేటే.
పొగ త్రాగ నెంచ బోకుము
రిప్లయితొలగించండిసిగరెట్టాదులు నిరతము సేవించినచో
సిగపై తుపాకిని స్వయ
మ్ముగ గురిపెట్టిన విధంపు మూర్ఖత గనుమా!
మిత్రులారా! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిఈనాటి పద్యములు అందరివీ అలరించు చున్నవి. అందరికీ అభినందనలు.
కొన్ని సవరణలు:
శ్రీమతి శైలజ గారూ: మీరు పొగలొదులుచు అని వ్యావహారికమును వాడేరు.
శ్రీ గండూరి లక్ష్మీ నారాయణ గారు:
మీ పద్యములో 2వ పాదములో "మ" కి "వ"తో యతి వేసేరు. యతి మైత్రి లేదు.
పొగను ద్రాగుట మానుడు పురుషు లార !
రిప్లయితొలగించండిగొంతు కేన్సరు మఱి యును గుండె జబ్బు
లాది గాగల రోగము లావహించు
గాన దానిజోలికి బోక కనుడు సుఖము
శ్రీ పండిత నేమానిగురువరులకు నమస్కారములు
రిప్లయితొలగించండిమీ సూచన తరువాత సవరించి వ్రాసిన పద్యం
పొగ బీల్చికు భుగభుగ మని
మగవాడనటంచు నీవు, మాయని రోగం
బగుపడక మృత్యు శయ్యకు
సుగుణాకర నిన్ను జేర్చు సుమి సిగరేటే.