13, ఏప్రిల్ 2014, ఆదివారం

పద్య రచన – 565

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

10 కామెంట్‌లు:

  1. కడలి యంచులు దాటుచు వెడలె నావ
    నావ నిండుగ మధుపముల్ నాట్య మలర
    సొగసు గాంచి సరంగులు శుభ మటంచు
    నెగుర వేయగ కేతన మెంత దవ్వొ ?

    రిప్లయితొలగించండి
  2. ఏమి చిత్రము! వాహ్యాళి కేగు చుండె
    కడలి మీదన గుంపుగ పడవ లోన
    చిత్ర వర్ణము గలిగిన చిలుక లెన్నొ
    చూడ ముచ్చట గొలుపును జూప రులకు


    రిప్లయితొలగించండి
  3. తరణి మీదను తుమ్మెదల్ తరలు చుండె
    పూల మధువును గ్రోలగా ముదముతోడ
    యోడపైనుండి పూదోట జాడ కొరకు
    వెతకు చున్నవి యొక్కటై వేడుకగను

    రిప్లయితొలగించండి
  4. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. మిత్రులారా! శుభాశీస్సులు.
    గత 4 దినముల నుండి తీవ్ర జ్వరముతో బాధనొందితిని. అయినను వీలు చేసుకొని ఉడత భక్తితో మిత్రుల పద్యములను చూచి సూచనలు గావించితిని. నేడు bridgewater వేంకటేశ్వర మందిరములో నేను శ్రీమదధ్యాత్మ రామాయణమును గురించి ఉపన్యాసమును ఈయవలసి యున్నది. భగవంతుని కృపతో నా ప్రయత్నమును నేను గావించెదను. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  6. గురుదేవులు పండిత నేమాని వారికి పాదాభివందనములు.
    మీ రస్వస్థులైనారన్న విషయం తెలిసి బాధపడుతున్నాను. తీవ్రమైన జ్వరంతో కూడా మిత్రుల పద్యాలను సమీక్షించిన మీ ఆంధ్ర సంప్రదాయ సాహిత్యాభిమానం, శిష్యవాత్సల్యం శతధా, సహస్రధా అభినందనీయాలు. ఈస్థితిలోనూ ఆధ్యాత్మిక ఉపన్యాసం ఇవ్వబోతున్న మీకు ఆ రామచంద్రుని కృపతో సంపూర్ణారోగ్యం చేకూరుతుందని ఆశిస్తున్నాను.
    శ్రీరామరక్ష! జై శ్రీరామ్!

    రిప్లయితొలగించండి
  7. యెదుటి యొడ్డున కోమలి యెదను దెలిసి
    కౌగిలింతలఁ దేలగా కాగి వెడలు
    ప్రియుని భావమ్ము తెరచాప పైన జూప
    భ్రమర బృందమ్ము వాలెగా ! బాగు ! బాగు !

    రిప్లయితొలగించండి
  8. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    తేటి రెక్కల తెరచాప తెరగు మనము
    తనువు మనసులనరయుచు తనివి దీర
    ప్రేమతీరముల్ జేరగ పిలిచె నదిగొ
    ప్రణయనౌకను విహరింప రమ్ము చెలియ

    రిప్లయితొలగించండి
  9. సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    యడాగమంతో పద్యాన్ని ప్రారంభించారు...!
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి