రామ రామ! సమస్త సద్గుణ రాజితా! సురపూజితా! రామ రామ! ప్రశాంతరూప! ధరాసుతాహృదయాధిపా! రామ రామ! జగత్త్రయీశ్వర! రాజవంశ సుధాకరా! రామ రామ! పరాత్పరా! నిను ప్రస్తుతించెద సర్వదా!
రామ రామ! రమాకటాక్ష వరప్రదా! అభయప్రదా! రామ రామ! సుఖస్వరూప! సురవ్రజార్తి వినాశకా! రామ రామ! నరేశ్వరా! దినరాజకోటి సమప్రభా! రామ రామ! పరాత్పరా! నిను ప్రస్తుతించెద సర్వదా!
రామ రామ! జగత్త్రయీనుత! రాజితాద్భుత విగ్రహా! రామ రామ! భవార్తినాశక! రాఘవాన్వయ భూషణా! రామ రామ! మునీంద్ర మానస రాజితాంబుజ మందిరా! రామ రామ! పరాత్పరా! నిను ప్రస్తుతించెద సర్వదా!
రామ రామ! భవప్రణాశక! రాక్షసాంతక భీకరా! రామ రామ! వినీల కోమల రమ్యగాత్ర! త్రివిక్రమా! రామ రామ! పవిత్రనామ! సురప్రపూజిత! శ్రీకరా! రామ రామ! పరాత్పరా! నిను ప్రస్తుతించెద సర్వదా!
రామ రామ! రఘూద్వహా! నటరాజ హృత్కమలాలయా! రామ రామ! ముకుంద! సన్ముని రక్షకా! జలజేక్షణా! రామ రామ! భవాబ్ధి తారక రాజితాంఘ్రి సరోరుహా! రామ రామ! పరాత్పరా! నిను ప్రస్తుతించెద సర్వదా!
రామ రామ! జగద్గురూత్తమ! రమ్య హాస సుశోభితా! రామ రామ! పరోపకార పరాయణాఢ్య జనార్చితా! రామ రామ! కృపాకరా! గిరిరాట్సముద్ధర! శ్రీధరా! రామ రామ! పరాత్పరా! నిను ప్రస్తుతించెద సర్వదా!
రామ రామ! విరించి విష్ణు హరత్రయాత్మక వైభవా! రామ రామ! గుణత్రయాశ్రయ! లక్ష్మణ ప్రముఖార్చితా! రామ రామ! ధనుర్ధరా! భృగురామ సంస్తుత వైభవా! రామ రామ! పరాత్పరా! నిను ప్రస్తుతించెద సర్వదా!
రామ రామ! సహస్ర శీర్ష విరాజితా! నిగమస్తుతా! రామ రామ! సహస్రలోచన రంజనా! రిపుభంజనా! రామ రామ! సహస్రపాద! శరణ్య మీవె కృపాకరా! రామ రామ! పరాత్పరా! నిను ప్రస్తుతించెద సర్వదా!
గురుదేవులకు,పెద్దలకు మరియు బ్లాగు వీక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు: గురుదేవుల మత్త కోకిల చరణములు అద్భుతము గానున్నవి వారి శ్రీ మదధ్యాత్మ రామాయణము చదివి వ్రాసిన మత్త కోకిల చరణములు. ================*============= రామ నామము రామ నామము రక్ష యన్నది నేర్వ రా ! ప్రేమ తోడను బిల్చి నంతనె పెక్కు లాభము లుండు రా ! కామి తమ్ముల నిచ్చి యుండిన క్ష్మావరేశుడు శిష్యుడా ! రామ నామము రామ నామము రమ్య మైనది శిష్యుడా !1!
గాధ లందున జెప్పి యుండిన ఖ్యాతి గల్గిన వాడురా ! మోధ మందున బాధ లందున ముక్తి నిచ్చెడి వాడురా ! వేద వేద్యుడు దేవ దేవుడు వెంట వచ్చెడి వాడురా ! రాధికేశుడు పద్మ నాభుడు రత్న గర్భుడు వాడురా !2!
ఖ్యాతి గల్గిన వారి కెల్లను గాత్ర మిచ్చెను జూడరా ! నీతి యన్నది నిండు కుండిన నేనె వత్తుననెన్ వెసన్! త్రాత యైనను దూతయేనట దాట కుండగ జూడరా ! రాతి బండకు మోక్ష మిచ్చిన రామ పాదము బట్టరా !3!
కావ రమ్మని భక్త దంతియె గావు బెట్టన నాడు రా ! దేవ దేవుడు పద్మ నాభుడు దేవ లోకము వీడె రా ! దేవ దానవ సంగరంబున తీర్పు జెప్పెన వాడురా ! సేవ జేయగ వైరి వర్గము సీమ నిచ్చెను జూడరా !4!
కోరి వచ్చిన గొల్ల భామల కోర్కె లెల్లను దీర్చెరా ! భార మంతయు తాను మోసిన భాను మంతుడు వాడురా ! గోరు పైనను కొండ నంతను గూర్మి తోడను నెత్తెరా ! నోరు జచ్చిన వారికెల్లను నూరు మారులు జెప్పరా !5!
విష్ణు చిత్తుని యల్లు డయ్యెను వేడి నంతనె జూడరా ! విష్ణు భక్తుల మార్గ మందున వీత రాగము లేదు రా ! విష్ణు పాదము బట్టి యుండిన పేర్మి గల్గును నిండుగా ! విష్ణు మాయకు భస్మమైరిగ విర్రవీగిన వారురా !12!
కోటి కొక్కడు జూడ గల్గిన కోసలేశుడు వాడురా ! ఆట పాటలు నేర్చి లోకము నాడు చుండెను జూడరా ! కోటి విధ్యలు నేర్చి యుండిన గొల్ల బాలుడు వాడురా ! మేటి రాక్షస గర్వ మంతయు మెట్టు తోడను గూల్చె రా !13!
భక్తపాలకుడుండె రాముడు భద్రశైలము పైనరా! ముక్తి కోరిన దాస దాసులు పొందు గోరుచు నుండ గా ! భక్తి తోడను సొక్కు చుండగ భద్ర శైలము జెర్చె రా ! ముక్తి నొందిన వారు దెల్పిరి మూలమెల్లను లెస్సగా !14!
(మా కృతి శ్రీమదధ్యాత్మరామాయణము నుండి)
రిప్లయితొలగించండిరామ రామ! సమస్త సద్గుణ రాజితా! సురపూజితా!
రామ రామ! ప్రశాంతరూప! ధరాసుతాహృదయాధిపా!
రామ రామ! జగత్త్రయీశ్వర! రాజవంశ సుధాకరా!
రామ రామ! పరాత్పరా! నిను ప్రస్తుతించెద సర్వదా!
రామ రామ! రమాకటాక్ష వరప్రదా! అభయప్రదా!
రామ రామ! సుఖస్వరూప! సురవ్రజార్తి వినాశకా!
రామ రామ! నరేశ్వరా! దినరాజకోటి సమప్రభా!
రామ రామ! పరాత్పరా! నిను ప్రస్తుతించెద సర్వదా!
రామ రామ! జగత్త్రయీనుత! రాజితాద్భుత విగ్రహా!
రామ రామ! భవార్తినాశక! రాఘవాన్వయ భూషణా!
రామ రామ! మునీంద్ర మానస రాజితాంబుజ మందిరా!
రామ రామ! పరాత్పరా! నిను ప్రస్తుతించెద సర్వదా!
రామ రామ! భవప్రణాశక! రాక్షసాంతక భీకరా!
రామ రామ! వినీల కోమల రమ్యగాత్ర! త్రివిక్రమా!
రామ రామ! పవిత్రనామ! సురప్రపూజిత! శ్రీకరా!
రామ రామ! పరాత్పరా! నిను ప్రస్తుతించెద సర్వదా!
రామ రామ! రఘూద్వహా! నటరాజ హృత్కమలాలయా!
రామ రామ! ముకుంద! సన్ముని రక్షకా! జలజేక్షణా!
రామ రామ! భవాబ్ధి తారక రాజితాంఘ్రి సరోరుహా!
రామ రామ! పరాత్పరా! నిను ప్రస్తుతించెద సర్వదా!
రామ రామ! జగద్గురూత్తమ! రమ్య హాస సుశోభితా!
రామ రామ! పరోపకార పరాయణాఢ్య జనార్చితా!
రామ రామ! కృపాకరా! గిరిరాట్సముద్ధర! శ్రీధరా!
రామ రామ! పరాత్పరా! నిను ప్రస్తుతించెద సర్వదా!
రామ రామ! విరించి విష్ణు హరత్రయాత్మక వైభవా!
రామ రామ! గుణత్రయాశ్రయ! లక్ష్మణ ప్రముఖార్చితా!
రామ రామ! ధనుర్ధరా! భృగురామ సంస్తుత వైభవా!
రామ రామ! పరాత్పరా! నిను ప్రస్తుతించెద సర్వదా!
రామ రామ! సహస్ర శీర్ష విరాజితా! నిగమస్తుతా!
రామ రామ! సహస్రలోచన రంజనా! రిపుభంజనా!
రామ రామ! సహస్రపాద! శరణ్య మీవె కృపాకరా!
రామ రామ! పరాత్పరా! నిను ప్రస్తుతించెద సర్వదా!
నవమిని బుట్టిన రాముని
రిప్లయితొలగించండికవనమ్ములు జదివి నంత కాలుష్య హరం
బవగను తారక మంత్రం
బవనికి మకుటమ్ము గాదె భక్తిని కొలువన్
శ్రీ సీతారామాభ్యో నమః
రిప్లయితొలగించండిగురువర్యులకు, కవిమిత్రులకు. వీక్షకులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
మీ చరితము జదువుచు మే
మాచరణమునందు బెట్ట మానవ విధులన్
మీచరణములే బట్టగ
మాచరితము ధన్యమౌను మా రఘురామా !
గురువర్యులకు, కవిమిత్రులకు. వీక్షకులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిశంఖ చక్రము లటునిటు చక్కఁదీర
సీత తోడుండ లక్ష్మణ భ్రాతఁ గూడి
భధ్రుఁ గోర్కెను దీర్చిన భక్తవరద
పరశువును దాల్చి రావయ్య తరుణ మాయె!
రామ రాజ్యముఁ జూతుమా? ప్రాణ ముండ!
ఈ రోజు నవమి కావున
రిప్లయితొలగించండిశ్రీ రాముల పెండ్లి జరుగు సీ తమ తోడ
న్నారాముడు సంతసమున
భూరిని నిక యిచ్చు గాక !భూతిని మనకున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీరామ నవమి రోజున
రిప్లయితొలగించండిశ్రీరాముని శరణువేడ శ్రేయము గలుగున్
శ్రీరామునిపెండ్లి కనగ
శ్రీరామునిరక్ష కలిగి చింతలు దీరున్
వామాంకమునన్ సీతను
రిప్లయితొలగించండిప్రేమముతోననుజునిలిపె ప్రీతిగ సరసన్
గోముగ భద్రాద్రి యందున్
క్షేమముగానుండి బ్రోచు సీతాపతియే
గురువులు శ్రీకందిశంకరయ్య గారికి, శ్రీనేమానిపండితవర్యులకు మరియునితర కవిమిత్రులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిరక్కసులన్ హరించి శుభలక్షణ సీతను సంగ్రహించి తాఁ
మిక్కిలి ధర్మ రూపునిగ మేదినిపై వెలుగొంది, హార్దమౌ
దృక్కుల భక్తులన్ శరణిదే యనువారిని కాచువానికిన్
మ్రొక్కెద రామచంద్ర ఘనమూర్తికి నిశ్చల భక్తిపూర్ణతన్.
హార్దము = కరుణ
తండ్రియాజ్ఞను శిరోధారణంబుగజేసి
రిప్లయితొలగించండి......... కాననంబులకేగ కదలెనితడు
భ్రాతృకోరికమీద పాదుకలనొసంగి
......... ప్రేమమూర్తిగ భివిన్ వెలసెనితడు
హనుమంతుభుజరథమ్ముననేగి దైత్య సం
........ హారమ్మునొనరించినట్టి విభుడు
పట్టాభిషిక్తుడై పదునాల్గు భువనభాం
........డములనేలెడు రమానాథుడితడు
సకల ధర్మస్వరూపుండు శాస్త్రవిదుడు
వంశగౌరవోద్ధార విభ్రాజితుండు
భక్తజనకల్పవృక్షమ్ము పరమదైవ
మందరికి సర్వసౌభాగ్యమందజేయు
మిత్రులారా! అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిఈనాటి మిత్రుల రచనలు చాల అలరించుచున్నవి. అందరికి అభినందనలు.
కొన్ని సూచనలు:
శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు:
శ్రీసీతారామాభ్యాం నమః - అనవలెను.
శ్రీ మంద పీతాంబర్ గారు:
ధ్రువకీర్తి అనుట సాధువు.
శ్రీ నాగరాజు రవీందర్ గారు:
మీ శ్లోకములలో గమన సౌలభ్యము కొరకు క్రింది విధముగా సవరించుచున్నాను:
కౌసల్యానందనం రామం
వందే దశరథాత్మజం
చంద్రశేఖర చాపఘ్నం (లేక) భంజకం శివ కోదండం
సీతా మానస రంజకం
2వ శ్లోకములో: వందే మునిగణ స్తుత్యం అని పాదమును మార్చండి.
శ్రీమతి శైలజ గారు:
3వ పాదమును ఇలాగ మార్చండి:
గోముగ భద్రచలమున
శ్రీ సంపత్ కుమర్ శాస్త్రి గారు:
భ్రాతృ కోరిక అని సమాసమును చేయరాదు.
భువిన్ అనుటలో టైపు పొరపాటు దొరలినది.
స్వస్తి.
శ్రీమతి శైలజ గారూ:
రిప్లయితొలగించండిగోముగ భద్రాచలమున అనండి. చిన్న టైపు పొరపాటు జరిగినది నా పూర్వపు సవరణలో.
స్వస్తి.
రిప్లయితొలగించండిచాలా ధన్యవాదములు గురువుగారు...
వామాంకమునన్ సీతను
ప్రేమముతోననుజునిలిపె ప్రీతిగ సరసన్
గోముగ భద్రాచలమున
క్షేమముగానుండి బ్రోచు సీతాపతియే
మిత్రులందరికి శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు
రిప్లయితొలగించండిరాముడే పరమాత్మ రాముడే జీవాత్మ
రాముడే సర్వంబు రామ రామ!
రాముడే ధ్యేయంబు రాముడే ధ్యానంబు
రాముడే ధ్యాతయు రామ రామ!
రాముడే జ్ఞేయంబు రాముడే జ్ఞానంబు
రాముడే జ్ఞాతయు రామ రామ!
రాముడే వేద్యంబు రాముడే వేదంబు
రాముడే వేత్తయు రామ రామ!
సచ్చిదానంద ముఖ్య లక్షణ ఘనుండు
రాముడే పరంధాముండు రామ రామ!
రాముడే హృదారాముండు రామ రామ!
రామ! శ్రీరామ! శ్రీరామ! రామ రామ!
గురువర్యులకు, కవిమిత్రులకు. వీక్షకులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిశివ ధనువును రఘురాముడు
నవలీలగనెత్తి ద్రుంచి నవనిజసీతన్
ధ్రువ కీర్తిన పెండ్లాడెను
రవిచంద్రుల సాక్షిగాను రమణీయముగా !!!
శ్రీ నేమానిగారికి ప్రణామములు .పద్యము పోస్ట్ చేసిన తర్వాత నా పొరపాటును గ్రహించాను పద్యాన్ని సవరించాను
రిప్లయితొలగించండిరామ చంద్రుడు సక్థిపై రమణి సీత
రిప్లయితొలగించండిప్రక్కననుజుడు తోడను ప్రాకటముగ
దర్శనంబిచ్చె జనులను తనియ జేయ
కూర జేయగ భక్తుల కోరికలను
గురుదేవులకు,పెద్దలకు మరియు బ్లాగు వీక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు:
రిప్లయితొలగించండిగురుదేవుల మత్త కోకిల చరణములు అద్భుతము గానున్నవి
వారి శ్రీ మదధ్యాత్మ రామాయణము చదివి వ్రాసిన మత్త కోకిల చరణములు.
================*=============
రామ నామము రామ నామము రక్ష యన్నది నేర్వ రా !
ప్రేమ తోడను బిల్చి నంతనె పెక్కు లాభము లుండు రా !
కామి తమ్ముల నిచ్చి యుండిన క్ష్మావరేశుడు శిష్యుడా !
రామ నామము రామ నామము రమ్య మైనది శిష్యుడా !1!
గాధ లందున జెప్పి యుండిన ఖ్యాతి గల్గిన వాడురా !
మోధ మందున బాధ లందున ముక్తి నిచ్చెడి వాడురా !
వేద వేద్యుడు దేవ దేవుడు వెంట వచ్చెడి వాడురా !
రాధికేశుడు పద్మ నాభుడు రత్న గర్భుడు వాడురా !2!
ఖ్యాతి గల్గిన వారి కెల్లను గాత్ర మిచ్చెను జూడరా !
నీతి యన్నది నిండు కుండిన నేనె వత్తుననెన్ వెసన్!
త్రాత యైనను దూతయేనట దాట కుండగ జూడరా !
రాతి బండకు మోక్ష మిచ్చిన రామ పాదము బట్టరా !3!
కావ రమ్మని భక్త దంతియె గావు బెట్టన నాడు రా !
దేవ దేవుడు పద్మ నాభుడు దేవ లోకము వీడె రా !
దేవ దానవ సంగరంబున తీర్పు జెప్పెన వాడురా !
సేవ జేయగ వైరి వర్గము సీమ నిచ్చెను జూడరా !4!
కోరి వచ్చిన గొల్ల భామల కోర్కె లెల్లను దీర్చెరా !
భార మంతయు తాను మోసిన భాను మంతుడు వాడురా !
గోరు పైనను కొండ నంతను గూర్మి తోడను నెత్తెరా !
నోరు జచ్చిన వారికెల్లను నూరు మారులు జెప్పరా !5!
కన్న వారల కూర్మి నొందగ కంస మామను జంపెరా !
కన్నె భామల చీర లెల్లను గట్ట గట్టెను జూడరా !
వెన్న దొంగగ మన్ను మెక్కుచు వీధు లందున నిల్చెరా !
మన్ను తోడను మిన్ను జూపెను మాత కప్పుడు శిష్యుడా !6!
దంతి రక్షక భక్తవత్సలు దాపు జేరగ నేర్వరా !
చింత లందున పెద్ద దిక్కని శేష శాయిని బిల్వరా !
కాంతి మంతుడు కీర్తి మంతుడు గట్టి వేయగ నుండె రా !
పంత మేలను? నారసింహుడు ప్రక్క నుండెను జూడరా !7!
ఘోర రాక్షసి దాడి జేయగ గూల్చి వేసెను జూడరా !
దార కోరిన జింక వెంబడి తాను వెళ్ళెను జూడరా!
వైరి వర్గము గూర్మి నొందగ వంత బాడెను జూడరా !
వీర వానర సైన్య మెల్లను వెంట వచ్చిరి జూడరా !8!
నీటి యందున సర్ప రాజును నేల గూల్చిన వాడురా !
కాటి రేడును కష్ట మందున గాచి యుండిన వాడురా !
ఝూట మాటలు కట్టబెట్టిక శుద్ధసత్త్వుని జూడరా!
నోటి యందున విశ్వ మంతయు నోము జేయగ జూపురా! 9!
సోమ యాజులు సొక్కి యుండిన సోమ బంధువు వాడురా !
తామ సమ్మును ద్రుంచు వేసెడి ద్వాద శాత్ముడు వాడురా !
కామ పాలుడు భక్త వర్యుల కష్ట మెల్లను దీర్చు రా !
వామ లోచన రూప మందున పంచబాణుని మించెరా !10!
ఆను పానులు దెల్పు చుండెడి అంబుజాక్షుని వేడరా !
కాన లందున మౌని వర్యుల గాచి యుండిన వాడురా !
వానరమ్ములు సేవ జేసిన వాని దాపున జేర రా !
భాను వంశము నందు బుట్టిన వాని నెయ్యము పొంద రా !11!
విష్ణు చిత్తుని యల్లు డయ్యెను వేడి నంతనె జూడరా !
విష్ణు భక్తుల మార్గ మందున వీత రాగము లేదు రా !
విష్ణు పాదము బట్టి యుండిన పేర్మి గల్గును నిండుగా !
విష్ణు మాయకు భస్మమైరిగ విర్రవీగిన వారురా !12!
కోటి కొక్కడు జూడ గల్గిన కోసలేశుడు వాడురా !
ఆట పాటలు నేర్చి లోకము నాడు చుండెను జూడరా !
కోటి విధ్యలు నేర్చి యుండిన గొల్ల బాలుడు వాడురా !
మేటి రాక్షస గర్వ మంతయు మెట్టు తోడను గూల్చె రా !13!
భక్తపాలకుడుండె రాముడు భద్రశైలము పైనరా!
ముక్తి కోరిన దాస దాసులు పొందు గోరుచు నుండ గా !
భక్తి తోడను సొక్కు చుండగ భద్ర శైలము జెర్చె రా !
ముక్తి నొందిన వారు దెల్పిరి మూలమెల్లను లెస్సగా !14!
శ్రీ రఘు వీర! మౌనిజన చిత్త విహార! ధరాత్మజా మనో
రిప్లయితొలగించండిచోర! మహర్షి వాగ్జనిత శుభ్ర పయోధి సుధాకరా! చిదా-
కార! వినీల సుందర! అకార ఉకార మకార రూప! సు-
స్మేర! అహల్య శాప హర! సేవిత వాయుకుమార! శ్రీకరా!
ఆర్యా ! దోషమును తెలిపిన మీకు ధన్యవాదములు...
రిప్లయితొలగించండిభద్రగిరినాథు మన్నించి పత్నితోడ
రిప్లయితొలగించండివెలసి నిలిచితి రామయ్య! వీరుడైన
తమ్ముడెడబాయకుండంగ తనివినంది
కొలువుఁ జేయగ నిలచితి కూర్మితోడ!
శ్రీ మిస్సన్న గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ ప్రయత్నమునకు మరికొన్ని మెరుగులు:
శ్రీరఘువీర! మౌనిజన చిత్తవిహార! ధరాత్మజా మన
శ్చోర! నగేంద్రధీర! రణశూర! మనోభవకోటి సుందరా
కార! విరోధిదూర! దశకంధర ముఖ్య సురారిలోక సం
హార! సువందితామల గుణాంచిత సార! జగత్త్రయీశ్వరా!
మిత్రులారా! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిఅందరి పద్యములు అలరించుచున్నవి. అందరికి అభినందనలు.
స్వస్తి.
మిత్రులారా! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిఅందరి పద్యములు అలరించుచున్నవి. అందరికి అభినందనలు.
స్వస్తి.
భద్రగిరి వాస! శ్రీరామ! భక్త వరద!
రిప్లయితొలగించండియో ధరాత్మజ! కరుణా పయోనిధీ సి
తాంతరంగ! ! సారస దళ నయన! వంద
నములివిగొనుము దశరథానంద నంద!
యింతి, తమ్ము లక్ష్మణుతో ఇలను వెలయు
ఇందిరా రమణ! ఇక జాగేల నన్ను
ఇడుముల నిడక నీడేర్చ నీవె గతి
ఇనకుల తిలకా! నా మొరలినగ రావె
నేమాని పండితార్యా! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమనోహరంగా మలచేరు నా పద్యాన్ని.