కవిమిత్రులకు నమస్కృతులు. నిన్న మా మేనల్లుని కూతురు నిశ్చితార్థానికి వెళ్ళి రాత్రి తిరిగివచ్చాను. ప్రయాణపుటలసట కారణంగా మిత్రుల రచనల సమీక్ష, ఈ నాటి పోస్టుల షెడ్యూల్ చేయలేకపోయాను. మన్నించండి. * లక్ష్మీదేవి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * సుబ్బారావు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * మిస్సన్న గారూ, అంబరీషునిపై మీ ఖండిక చాలా బాగుంది. అభినందనలు. * అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ తేటగీతిక అంబరీషుని వృత్తాంతాన్ని వివరంగా తెలియజేస్తున్నది. చాలా బాగుంది. అభినందనలు. టైపాటు లున్నవి ... స్నానము-స్థానము, దుర్వాసుడు-దుర్వాశుడు...
పండిత శిరోమణి శంకరాభరణం కంది శంకరయ్యగారికి ప్రణామాలు. అయ్యా నేను ముఖ పుస్తకంలో పెట్టిన అంబరీషోపాఖ్యాన పద్యంపై మీరిచ్చిన ఆత్మీయ స్పందనకి ధన్యవాదాలు. ఆ విధంగా లక్ష్మిగారి, సుబ్బారావు గారి, సత్యన్నారాయణ రెడ్డి గారి పద్యాలు, మిస్సన్న గారి ఖండికలు ఆస్వాదించే అదృష్టం కలిగింది. వారలకు అభినందనలు మీకు మరొక్కమారు ధన్యవాదాలు.
గర్వమునుఁ జూపి భక్తుని గౌరవమ్ము
రిప్లయితొలగించండితృణసమానముగానెంచి ధిక్కరించు
మునికి చక్రము చక్కని బుద్ధి చెప్పు
దృశ్యమునుఁ గనుమయ్య సుధీరవర్య!
చిత్ర మందున నొకముని చేతులెత్తి
రిప్లయితొలగించండినతులు గావించు చుండెను నమ్ర త గను
నేమి యపచార మొనరించె నేమొ యతడు
అడిగి జెప్పుదు మఱి మీ కు నార్యు లార !
రిప్లయితొలగించండిహరియని పల్కుచున్ గనుచు నా హరి దల్చుచు నంటుచున్ సదా
హరియని మూర్కొనన్ జనుచు నా హరి మెచ్చుచు నారగించుచున్
హరి సకలమ్ము నీవనుచు నంతట నాహరి యున్కి గాంచుచున్
హరి పద మంటి యుండు ఘను నంబరిషాఖ్యుని జేరె మౌనియున్.
స్నాన మొనరించి వత్తును నదికి బోయి
శిష్యులను గూడి యో రాజ! చెప్పి మౌని
నదికి బోయెను రాడాయె నాడు ద్వాద-
శి యగుటను రాజు జలముల స్వీకరించె.
దూర్వాసో ముని యంతను
గర్వితుడై యంబరీషు ఘను హరి భక్తున్
పర్వును మాపగ నెంచెను
దుర్వారంబైన కృత్యతో దండించన్.
హరి యది చూచె రాజుపయి కయ్యెడ వచ్చుట, గావ భక్తునిన్
సరగున చక్రమున్ బరపె, చయ్యన చక్రము ద్రుంచి కృత్యనున్
తిరిగెను మౌని వంక కడు తీవ్రత నిప్పులు గ్రక్కుచున్, కటా
పరుగున బోయె నా ఋషియు బ్రహ్మ మహేశ్వర విష్ణు లోకముల్.
రక్షణ దొరకక నెచటను
శిక్షింపగ వచ్చు చుండ చెంతకు నరియున్
రక్షింపు మీవె యని ఋషి
తక్షణ మా యంబరీషు దయకై వేడెన్.
హరి గావవే దయామయ
సరగున దూర్వాస మునిని క్షమియించి యనన్
హరి జేరెను చక్రమ్మును
సరి బ్రతికితి నంచు జనెను సంయమి యంతన్.
హరి భక్తుల కెవరైనను
తొర దలచిన తానె వచ్చు త్రుటిలో గావన్
హరి యని చెప్పుట కొరకై
జరిపించెను దీని హరియె సర్వులు వినరే.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికారణమ్మని మిక్కిలి కనలి మునిని
రిప్లయితొలగించండిఅంబరీషుడు సతతమ్ము హరిని గొల్చు
రిప్లయితొలగించండిపరమ భక్తుడు, ద్వాదశ వ్రతము భార్య
తోడ జరిపె తా నిష్టతో, తుదకు తాను
భక్తి తో దాన ధర్మముల్ బ్రాహ్మణులకు
నొసగి మన్ననలను బొంది యొప్పుగాను
దీక్షవిరమించు నంతలో తేజ మలర
మౌని దుర్వాశు డేతెంచె తనదు శిష్య
బృందమును వెంటనిడుకొని పేర్మి తోడ
స్వాగతించె రాజవరుడు సంతసముగ
భొజనమునకు పిలువగా పోయి యమున
కేగి స్థానము నొనరించి నిటకు వత్తు
నని తెలిపి శిష్యులన్ గొనిచనియె మౌని
ఎంతవేచినను ముని తా నిక్క రాక
వ్రతపు ఘడియల్ ముగియుచుండ పండితులను
సంప్రదించి తాను గొనియె జలము కొంత
దివ్య దృష్టిన దానిని తెలుసు కొనియె
మౌని, కోపమడర తన మహిమతోడ
సృష్టి జేసెనుతానొక్క దుష్ట శక్తి
పద్మనాభుని పనుపున పరమ భక్తు
గాయుచున్నట్టి చక్రము ఖండన మొన
రించె నా దుష్ట శక్తిని, యెంచి మునియె
కారణమ్మని మిక్కిలి కనలి మునిని
సంహరించ వెంటబడెను జముని పగిది
మూడులోకములు తిరిగి ముని భయమున
కాచు వారెవ్వరు తనకు కాన రాక
భక్తి గొప్పతనమ్మును శక్తి నెఱిగి
యంబరీషుని చేరెను యార్తి తోడ
చనియె మునిని వీడి దివికి చక్రమపుడు
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండినిన్న మా మేనల్లుని కూతురు నిశ్చితార్థానికి వెళ్ళి రాత్రి తిరిగివచ్చాను. ప్రయాణపుటలసట కారణంగా మిత్రుల రచనల సమీక్ష, ఈ నాటి పోస్టుల షెడ్యూల్ చేయలేకపోయాను. మన్నించండి.
*
లక్ష్మీదేవి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
అంబరీషునిపై మీ ఖండిక చాలా బాగుంది. అభినందనలు.
*
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ తేటగీతిక అంబరీషుని వృత్తాంతాన్ని వివరంగా తెలియజేస్తున్నది. చాలా బాగుంది. అభినందనలు.
టైపాటు లున్నవి ... స్నానము-స్థానము, దుర్వాసుడు-దుర్వాశుడు...
పండిత శిరోమణి శంకరాభరణం కంది శంకరయ్యగారికి ప్రణామాలు. అయ్యా నేను ముఖ పుస్తకంలో పెట్టిన అంబరీషోపాఖ్యాన పద్యంపై మీరిచ్చిన ఆత్మీయ స్పందనకి ధన్యవాదాలు. ఆ విధంగా లక్ష్మిగారి, సుబ్బారావు గారి, సత్యన్నారాయణ రెడ్డి గారి పద్యాలు, మిస్సన్న గారి ఖండికలు ఆస్వాదించే అదృష్టం కలిగింది. వారలకు అభినందనలు మీకు మరొక్కమారు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి