గురువు గారికి నమస్కారములు.కవి మిత్రులందరికీ నమస్సులు. మన శంకరాభరణం బ్లాగులో విజయవాడ మరియు గుంటూరు నగరాలలో నివసిస్తున్న కవి మిత్రులు తమ ఫోన్ నంబరు ఇవ్వవలసినదిగా ప్రార్థన. మే మరియు జూన్ నెలలలో నేను విజయవాడలో ఉంటాను వీలు చూసుకొని అందరినీ కలుద్దామని ఆకాంక్ష. ధన్యవాదములు. వామన కుమార్. 9818486076
రాజేశ్వరి అక్కయ్యా, మంచి భావంతో పూరణ చెప్పారు. అభినందనలు. కాకుంటే అన్యయం కాస్త గజిబిజిగా ఉండి. * పండిత నేమాని వారూ, మాయాసంసార వర్జితుని గురించి మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు. * మిస్సన్న గారూ, రామనామేతర సారము లేనివాని గురించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. * భాగవతుల కృష్ణారావు గారూ, మీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉంది. అభినందనలు. * నాగరాజు రవీందర్ గారూ, మీ రెండు పూరణలూ చక్కగా ఉన్నాయి. అభినందనలు. ‘గౌరయ్య + అతి’ అన్నప్పుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. గౌరయ యతి/కడు...’ అనండి. మీ మూడవ పూరణ చాలా బాగుంది. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, సంసారము లేని హనుమను గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
మంద పీతాంబర్ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * నాగరాజు రవీందర్ గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. * అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * సుబ్బారావు గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. జ్యోతిస్వరూపుడు అన్నప్పుడు ‘తి’ గురువై గణభంగం. * గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * సహదేవుడు గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. * సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు.
శ్రీరాముని శ్రీ లంకకు
రిప్లయితొలగించండిపారా వారమును దాట పావని సతికై
రారా సేతువు గట్టగ
సారము లేనట్టి వాడు శైలము నెత్తెన్
ఘోరమగు శిలావర్షపు
రిప్లయితొలగించండిబారిన పడకుండ ప్రజకు భద్రము గూర్చన్
శౌరి మహా మయా సం
సారము లేనట్టివాడు శైలము నెత్తెన్
శ్రీ రామానుజు గావగ
రిప్లయితొలగించండినౌరా తృటిలోన జేరె నట నోషధికై
శ్రీ రఘువరు నామేతర
సారము లేనట్టివాఁడు శైలము నెత్తెన్.
వేరొక నామము బలుకక
రిప్లయితొలగించండినా రాముని నామ జపమె యనవరతమ్మున్
నోరారగననియడి సం
సారము లేనట్టివాఁడు శైలము నెత్తెన్.
ఓ రోడ్డున నాటకమున
రిప్లయితొలగించండిశ్రీరాముని బంటుననుచు చిరునటవర్యుం
డోఱాతిని యెత్తి వదలె
సారము లేనట్టివాఁడు శైలము నెత్తెన్.
ఆరఘురాముని భక్తుడు
రిప్లయితొలగించండితేరాగను మూలికలను తెలియక నెవియో
దారాసుతలును నిజసం
సారము లేనట్టివాఁడు శైలము నెత్తెన్.
గురువు గారికి నమస్కారములు.కవి మిత్రులందరికీ నమస్సులు.
రిప్లయితొలగించండిమన శంకరాభరణం బ్లాగులో విజయవాడ మరియు గుంటూరు నగరాలలో నివసిస్తున్న కవి మిత్రులు తమ ఫోన్ నంబరు ఇవ్వవలసినదిగా ప్రార్థన. మే మరియు జూన్ నెలలలో నేను విజయవాడలో ఉంటాను వీలు చూసుకొని అందరినీ కలుద్దామని ఆకాంక్ష.
ధన్యవాదములు.
వామన కుమార్.
9818486076
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమంచి భావంతో పూరణ చెప్పారు. అభినందనలు.
కాకుంటే అన్యయం కాస్త గజిబిజిగా ఉండి.
*
పండిత నేమాని వారూ,
మాయాసంసార వర్జితుని గురించి మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
రామనామేతర సారము లేనివాని గురించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
*
భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉంది. అభినందనలు.
*
నాగరాజు రవీందర్ గారూ,
మీ రెండు పూరణలూ చక్కగా ఉన్నాయి. అభినందనలు.
‘గౌరయ్య + అతి’ అన్నప్పుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. గౌరయ యతి/కడు...’ అనండి.
మీ మూడవ పూరణ చాలా బాగుంది.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
సంసారము లేని హనుమను గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
పారావారము దాటెను
రిప్లయితొలగించండిశ్రీ రామునిధర్మపత్ని సీతను వెదకన్
ధీరతలోమలినపు కా
సారము లేనట్టి వాడు శైలము నెత్తెన్
ఆరాముని కారణమున
రిప్లయితొలగించండివారధి కట్టిరి ముదమున వానర మూకల్
వారిధిపై, నచ్చట నే
సారము లేనట్టివాడు శైలము నెత్తెన్
నీ రసము నొందు నిరతము
రిప్లయితొలగించండిసారము లేనట్టి వాడు శైలము నెత్తె
న్నారని జోతి స్వరూపుడు
పారంగతు జేయు సకల ప్రాణుల దయతోన్
నేరక నట సంజీవిని
రిప్లయితొలగించండిశ్రీ రాముని భక్త వరుడు చింతాతురుడై
భూరి పరాక్రమమున సం
సారము లేనట్టివాఁడు శైలము నెత్తెన్.
పండిత నేమాని గారికి పూజ్యులుగురుదేవులు శంకరయ్య
రిప్లయితొలగించండిగారికి వందనములు
సారము లేనట్టి వాడు శైలము నెత్తెన్
పూరణ:స్వారాట్టు గోకులంమ్మును
ధారాధర ములను బంపి ధ్వంస మొనర్పన్
పోరడు కృష్ణుడు కొరవడు
సారము లేనట్టివాడు శైలము నెత్తెన్
శ్రీరాముడానతించగ
రిప్లయితొలగించండిజారిన లక్ష్మణుని లేప సంజీవినికై
మారుతి చని బెదరెడు ని
స్సారము లేనట్టి వాడు శైలము నెత్తెన్
శ్రీరఘువంశతిలకుఁడగు
రిప్లయితొలగించండినారాముని యాజ్ఞమీద నాకశమందున్
శూరుఁడు హనుమంతుఁడు ని
స్సారము లేనట్టివాఁడు శైలమునెత్తెన్.
ఆకసమందున్ అని వుండాలి.
రిప్లయితొలగించండిమంద పీతాంబర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
*
నాగరాజు రవీందర్ గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
జ్యోతిస్వరూపుడు అన్నప్పుడు ‘తి’ గురువై గణభంగం.
*
గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
సహదేవుడు గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
మూరెడు తేనీటి విపణి
రిప్లయితొలగించండిభారత దేశమ్మునెత్తె బాహుల మీద
న్నౌరా! ఇది యెట్లన్నన్:
సారము లేనట్టివాఁడు శైలము నెత్తెన్!
కోరుచు వెన్నను మట్టిని
రిప్లయితొలగించండితీరికగా వేణునూది త్రిప్పల నిడెడిన్
దారలు పుత్రులతో సం
సారము లేనట్టివాఁడు శైలము నెత్తెన్