25, ఏప్రిల్ 2014, శుక్రవారం

సమస్యాపూరణం - 1393 (భ్రూణహత్యలఁ జేసిన)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
భ్రూణహత్యలఁ జేసినఁ బుణ్య మబ్బు.
ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

16 కామెంట్‌లు:


  1. భ్రూణహత్యలఁ జేసినఁ బుణ్య మబ్బు
    ఖలసంబంధమ్ము క్షేమకారణంబవ్వు
    భగవంతుని పూజసేయ పాపంబగు
    నీతి పరుని మాట పన్నీటి మూట !

    శుభోదయం
    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. క్లిష్ట తరమైన కవలలు సృష్టిలోన
    బుట్ట, వైద్యులు విడదీయ గిట్టుచుండ
    విజ్ఞు లైనట్టి వైద్యులు ప్రాజ్ఞులయిన
    భ్రూణహత్యలఁ జేసినఁ బుణ్య మబ్బు.

    విజ్ఞప్తి :-
    తే 31/12/2013దీ నాటి సమస్య సంఖ్య 1280 ను గమనించ మనవి

    రిప్లయితొలగించండి
  3. పుట్ట గొడుగుల మాదిరి పుట్టు చుండె
    వేల కొలదిగ శిశువులు విశ్వ మందు
    భరత మాతకు మోయని భార మగుట
    భ్రూ ణ హత్యలజేసిన బుణ్య మబ్బు

    రిప్లయితొలగించండి
  4. హీన వెజ్జకు కల్గుకీ డెప్పుడైన
    భ్రూణహత్యలు జేసిన, పుణ్య మబ్బు
    సూను కొరకు తపించక, మానసమున
    సూనను సమానముగ జూచు మానవునకు


    రిప్లయితొలగించండి
  5. చిదుము చుండిరి గర్భస్థ శిశివు నకట!
    ఘోర పాపము నేరము కూడుకొనును
    భ్రూణ హత్యల జేసిన; బుణ్య మబ్బు
    హత్యలను జేయువారిని యడ్డు కొనిన

    రిప్లయితొలగించండి


  6. చుట్టు కొనునార్య ! పాపము చుట్టుకొనును
    భ్రూ ణ హత్యల జేసిన,బుణ్య మబ్బు
    పేదవారికి యన్నము బెట్టు నెడల
    కల్లకాదిది నిజమునే బలుకు చుంటి



    రిప్లయితొలగించండి
  7. విలయ మేర్పడె యణుశక్తి వెలిగి మండ
    నాశకర శక్తికి గురైన నారి జనపు
    గర్భమందలి శిశువులు కలుగ కుండ
    భ్రూణ హత్యలఁ జేసినఁ బుణ్యమబ్బు

    రిప్లయితొలగించండి
  8. పండిత నేమాని గారికి పూజ్యులుగురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    భ్రూణ హత్యలు జేసిన బుణ్య మగును”అన్న సమస్యను”బుణ్యమబ్బు” నని మార్చినారు
    ఆసమస్య 31.12,2013 నాడుయిచ్చియు0డిరి గ్రహించగలరు
    పూరణ:బుద్ధ దేవుని భూమిలో పుట్టి యుండి పూలుకోయగ వలదని గోల జేసి
    “భ్రూణ హత్యలు జేసిన బుణ్య మబ్బు”
    ననగ తగునయ్య యో పెద్ద మనిషి నీకు

    రిప్లయితొలగించండి
  9. పండిత నేమాని గారికి పూజ్యులుగురుదేవులు శంకరయ్య
    గారికి వందనములు
    మరియొక పూరణ:చట్టబద్ధము యౌనని శాసనమ్ము
    నేర మేమియు కాదని నిర్ణయమ్ము
    జేసిరేగాని కోర్టులు చెప్పలేదు
    “భ్రూణ హత్యలు జేసిన బుణ్య మబ్బు”

    రిప్లయితొలగించండి
  10. మెచ్చ రెవ్వరు దీనిని మేదినందు
    ఘోర నరకంబు ప్రాప్తించు భార మనుచు
    భ్రూణ హత్యల జేసిన, బుణ్య మబ్బు
    దిక్కు లేని వారికి తగుదిక్కు జూప

    రిప్లయితొలగించండి
  11. జన్యు లోపముల్ తెలిసిన సమయమందు
    వెజ్జు, తల్లిని కాపాడ వివర ణిచ్చి
    భ్రూణ హత్యలు జేసిన, పుణ్య మబ్బు
    నాడ పిల్లని చంపిన నఘము గల్గు

    రిప్లయితొలగించండి
  12. మిత్రులారా! శుభాశీస్సులు.
    ఈ నాటి పూరణలౌ అన్నియును అలరించు చున్నవి. అందరికి అభినందనలు.
    కొన్ని సూచనలు:

    శ్రీ భాగవతుల కృష్ణా రావు గారు: నమస్కారములు.
    మీరు కవలలు అని వాడేరు. అది వ్యావహారికము. కవ అంటేనే జత అని అర్థము కదా.

    శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు:
    1వ పద్యము : హీన వెజ్జకు అనుట సాధువు కాదు. హీనుడగు వెజ్జునకు అనుట సాధువు.
    2వ పద్యము : వివరణనిడి అనండి.

    శ్రీ సుబ్బా రావు గారు:
    పేదవారికి + అన్నము అనుచోట యడాగమము రాదు. పేదవారికినన్నము అగును.
    4వ పాదములో ప్రాసయతి సరిగా వేయబడ లేదు.

    శ్రీమతి శైలజ గారు:
    మేదిని + అందు = మేదినియందు అగును. మేదినందు అనుట సరికాదు.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  13. పూజ్య గురుదేవులు పండిత నేమాని గారికి నమస్సులు. తమరిసవరణలకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  14. హీనుడగు వెజ్జునకుఁ కీడు హెచ్చు, తాను
    భ్రూణహత్యలు జేసిన, పుణ్య మబ్బు
    సూను కొరకు తపించక, మానసమున
    సూనను సమానముగ జూచు మానవునకు

    రిప్లయితొలగించండి
  15. హత్య యన్నది పాపమే యరయ నెపుడు
    తలచి మదిలోన బూనుచు తగ్గ కృషిని
    అంత మందించ మరియాత్మహత్య,హత్య
    భ్రూణ హత్యల - జేసిన బుణ్య మబ్బు

    రిప్లయితొలగించండి
  16. కవిమిత్రులకు నమస్కృతులు.
    రోజంతా పెళ్ళిపనుల్లో వ్యస్తుడనై బ్లాగును చూసి మిత్రుల పూరణలను సమీక్షించలేకపోయాను. మన్నించండి.
    కెంబాయి తిమ్మాజీ రావు గారు చెప్పినట్లు ఈ సమస్య పునరుక్తమే. రోజురోజుకు నా మతిమరుపు ఎక్కువౌతున్నది. క్షమించండి.
    చక్కని పూరణల నందించిన కవిమిత్రులు...
    భాగవతుల కృష్ణారావు గారికి,
    పోచిరాజు సుబ్బారావు గారికి,
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
    గండూరి లక్ష్మినారాయణ గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    సహదేవుడు గారికి,
    కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
    శైలజ గారికి
    అభినందనలు, ధన్యవాదాలు.
    *
    పండిత నేమాని వారూ,
    మిత్రుల పూరణల గుణదోషాలను సమీక్షించినందుకు ధన్యవాదాలు.
    *
    జిలేబీ గారూ,
    మీరు బ్లాగును ఎంతబాగా ‘ఫాలో’ అవుతున్నారో అర్థమయింది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి