ఈ అయ్యవారిని పెండ్లాడి మోస పోతి తీపి తీపి కబుర్లు తో సరిపెట్టే ను సుమా ఆ మామిడి పండ్ల వాడిని మనువాడి ఉంటే జీవితం మామిడి రసమయి ఉండదా సుమీ !!జిలేబి
జిలేబీ గారూ, మీ భావానికి నా పద్యరూపం.....అయ్యవారిని పెండ్లాడి యయ్యొ మోసపోతి, తీపికబురులతోఁ బ్రొద్దుపుచ్చుఁగాని మామిడి పండ్లమ్మువానిఁ బట్టబ్రతుకు విలసిల్లు నేమొ తా రసమయమయి.
బాల ! చూడుము మామిడి పండ్ల రాశిజూడ బంగిని పల్లి మా మిడిని బోలిపసిమి రంగున మెఱయుచు బాగు గానునూరు చుండెను దినగను నోరు నాది
పోచిరాజు సుబ్బారావు గారూ, బాగుంది మీ పద్యం. అభినందనలు.రెండవ పాదంలో ప్రాసయతి తప్పింది. ఆ పాదాన్ని ‘మించి బంగినపల్లి మామిడిని పోలి’ అనండి.
నూజి వీడు నుండి నూయార్కు నగరమునరుగు చుండె నాంధ్రు లామ్ర ఫలముచూచి యాగలేరు సుగరురోగులు గూడనారగించు చుండ్రి యాత్రముగను
నగరమ్ము
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
రాశి పోసి నట్టి రసమయ మామిళ్ళరంగు జూచి నంత పొంగి పోయియేరి కైన మిగుల నోరూర కుండునా?దేవ దేవుడైన తినగ జూచు!
మామిడి పండ్లను జూడగప్రేమముతో నోరు యూరి వేగము కొనగాఏమని చెప్పుదు రామా?క్షేమంబగు ధరలు గలవె సుఖముగ తినగన్!
మంచి జాతికి జెందిన మధురమైనచూత ఫలములు సంతలో జూడగానెతినగ నాలోన తలుపులు తెరచు కొనియెనీవు ప్రియసఖా !యవి కొనితేవ నాకు
చిన్న సవరణ...మామిడి పండ్లను జూడగప్రేమముతో నోరు యూరి వేగము కొనగాఏమని చెప్పుదు రామా?క్షేమంబగు ధరలు గలవె సేవింపంగన్
వాసి కెక్కిన పండ్లను రాశి పోసిజూడ చక్కగ బేర్చెను జూపు లలరపండ్లు జూడగ బంగిన పల్లి యగునుమండు వేసవి మరపించు మావి పండ్లు
సహదేవుడు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.‘రసమయ మామిళ్ళు’ అని సమాసం చేయరాదు కదా... ‘రసమున్న మామిళ్ళ’ని అనండి.*శైలజ గారూ, బాగుంది మీ పద్యం. అభినందనలు.‘నోరు + ఊరి’ అన్నప్పుడు సంధి నిత్యం. యడాగమం రాదు. ఆ పాదాన్ని ‘ప్రేమను నోరూరి కొనగ వేగిరపడగా/ నేమని’ అనండి. *గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.‘కొని తెమ్ము నాకు’ అనండి.
శైలజ గారూ, మీ తాజా పద్యం తాజామామిడిపండే సుమా! బాగుంది. అభినందనలు.
ధన్యవాదములు గురువుగారు...మీ సూచనతో పద్యం ఇప్పుడు బాగుంది..మామిడి పండ్లను జూడగప్రేమను నోరూరి కొనగ వేగిర పడగానేమని చెప్పుదు రామా?క్షేమంబగు ధరలు గలవె సేవింపంగన్
బంగరు చాయతో బంగనపల్లియ....మామిడి ఫలములు మనసు దోచుమేలిమి రుచులతో క్రాలు రసాలముల్....తమ సాటి యెవరంచు దనరుచుండునెర్రగా పచ్చగా నింపుగాను సువర్ణ....రేఖలెంతేనియు బ్రీతి గొలుపుకొబ్బరి మామిడి క్రొంగ్రొత్త రుచులతో....పలు మెప్పులొందును పచ్చిదేనితాండ్ర కొరకు కలక్టరు తనరు చాలరాజమాను బారామాసి రకము లెన్నొపుష్టి తుష్టియు నొసగుచు భూజనులకుమేలుగూర్చును వేసవి కాలమందు
చూత ఫలమ్ము లియ్యెడను చూడగ నోరహొ యూరుచుండెలే చూతమ వేవి జాతులవొ సొంపగు బంగినపల్లి జాతివే ప్రీతిగ దోచె పెక్కులుగ పిమ్మట నిక్షు రసమ్ము లల్లదే చేతము దోచెడిన్ కనగ, చేతము బేరము కొందమిప్పుడే.
పండిత నేమాని వారూ, మామిడి పండ్ల రకాలను, ప్రయోజనాలను వివరిస్తూ అందమైన సీసపద్యాన్ని రచించారు. అభినందనలు, ధన్యవాదాలు.*మిస్సన్న గారూ, చక్కని వృత్తాన్ని రచించారు. అభినందనలు.
బంగారు రంగు పండ్లివి బంగినపల్లంద్రు వీని బాగుగ పండన్ హంగుగ గనపడు కళ్ళకు మ్యాంగోయని వీనినంద్రు మాన్యులు వింటే !
మామిడి పండ్లనుఁ జూసిననే మనుజునకైన మిగుల నింపగు, సతతంబామని వేళల మల్లెయుమామిడి సంబరములెల్ల మఱిమఱి పెంచున్.
రిప్లయితొలగించండిఈ అయ్యవారిని పెండ్లాడి మోస పోతి
తీపి తీపి కబుర్లు తో సరిపెట్టే ను సుమా
ఆ మామిడి పండ్ల వాడిని మనువాడి ఉంటే
జీవితం మామిడి రసమయి ఉండదా సుమీ !!
జిలేబి
జిలేబీ గారూ,
రిప్లయితొలగించండిమీ భావానికి నా పద్యరూపం.....
అయ్యవారిని పెండ్లాడి యయ్యొ మోస
పోతి, తీపికబురులతోఁ బ్రొద్దుపుచ్చుఁ
గాని మామిడి పండ్లమ్మువానిఁ బట్ట
బ్రతుకు విలసిల్లు నేమొ తా రసమయమయి.
బాల ! చూడుము మామిడి పండ్ల రాశి
రిప్లయితొలగించండిజూడ బంగిని పల్లి మా మిడిని బోలి
పసిమి రంగున మెఱయుచు బాగు గాను
నూరు చుండెను దినగను నోరు నాది
పోచిరాజు సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిబాగుంది మీ పద్యం. అభినందనలు.
రెండవ పాదంలో ప్రాసయతి తప్పింది. ఆ పాదాన్ని ‘మించి బంగినపల్లి మామిడిని పోలి’ అనండి.
నూజి వీడు నుండి నూయార్కు నగరము
రిప్లయితొలగించండినరుగు చుండె నాంధ్రు లామ్ర ఫలము
చూచి యాగలేరు సుగరురోగులు గూడ
నారగించు చుండ్రి యాత్రముగను
నగరమ్ము
రిప్లయితొలగించండిఅన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
రాశి పోసి నట్టి రసమయ మామిళ్ళ
రిప్లయితొలగించండిరంగు జూచి నంత పొంగి పోయి
యేరి కైన మిగుల నోరూర కుండునా?
దేవ దేవుడైన తినగ జూచు!
మామిడి పండ్లను జూడగ
రిప్లయితొలగించండిప్రేమముతో నోరు యూరి వేగము కొనగా
ఏమని చెప్పుదు రామా?
క్షేమంబగు ధరలు గలవె సుఖముగ తినగన్!
మంచి జాతికి జెందిన మధురమైన
రిప్లయితొలగించండిచూత ఫలములు సంతలో జూడగానె
తినగ నాలోన తలుపులు తెరచు కొనియె
నీవు ప్రియసఖా !యవి కొనితేవ నాకు
చిన్న సవరణ...
రిప్లయితొలగించండిమామిడి పండ్లను జూడగ
ప్రేమముతో నోరు యూరి వేగము కొనగా
ఏమని చెప్పుదు రామా?
క్షేమంబగు ధరలు గలవె సేవింపంగన్
వాసి కెక్కిన పండ్లను రాశి పోసి
రిప్లయితొలగించండిజూడ చక్కగ బేర్చెను జూపు లలర
పండ్లు జూడగ బంగిన పల్లి యగును
మండు వేసవి మరపించు మావి పండ్లు
సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
‘రసమయ మామిళ్ళు’ అని సమాసం చేయరాదు కదా... ‘రసమున్న మామిళ్ళ’ని అనండి.
*
శైలజ గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
‘నోరు + ఊరి’ అన్నప్పుడు సంధి నిత్యం. యడాగమం రాదు. ఆ పాదాన్ని ‘ప్రేమను నోరూరి కొనగ వేగిరపడగా/ నేమని’ అనండి.
*
గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘కొని తెమ్ము నాకు’ అనండి.
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ తాజా పద్యం తాజామామిడిపండే సుమా! బాగుంది. అభినందనలు.
ధన్యవాదములు గురువుగారు...మీ సూచనతో పద్యం ఇప్పుడు బాగుంది..
రిప్లయితొలగించండిమామిడి పండ్లను జూడగ
ప్రేమను నోరూరి కొనగ వేగిర పడగా
నేమని చెప్పుదు రామా?
క్షేమంబగు ధరలు గలవె సేవింపంగన్
బంగరు చాయతో బంగనపల్లియ
రిప్లయితొలగించండి....మామిడి ఫలములు మనసు దోచు
మేలిమి రుచులతో క్రాలు రసాలముల్
....తమ సాటి యెవరంచు దనరుచుండు
నెర్రగా పచ్చగా నింపుగాను సువర్ణ
....రేఖలెంతేనియు బ్రీతి గొలుపు
కొబ్బరి మామిడి క్రొంగ్రొత్త రుచులతో
....పలు మెప్పులొందును పచ్చిదేని
తాండ్ర కొరకు కలక్టరు తనరు చాల
రాజమాను బారామాసి రకము లెన్నొ
పుష్టి తుష్టియు నొసగుచు భూజనులకు
మేలుగూర్చును వేసవి కాలమందు
చూత ఫలమ్ము లియ్యెడను చూడగ నోరహొ యూరుచుండెలే
రిప్లయితొలగించండిచూతమ వేవి జాతులవొ సొంపగు బంగినపల్లి జాతివే
ప్రీతిగ దోచె పెక్కులుగ పిమ్మట నిక్షు రసమ్ము లల్లదే
చేతము దోచెడిన్ కనగ, చేతము బేరము కొందమిప్పుడే.
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిమామిడి పండ్ల రకాలను, ప్రయోజనాలను వివరిస్తూ అందమైన సీసపద్యాన్ని రచించారు. అభినందనలు, ధన్యవాదాలు.
*
మిస్సన్న గారూ,
చక్కని వృత్తాన్ని రచించారు. అభినందనలు.
బంగారు రంగు పండ్లివి
రిప్లయితొలగించండిబంగినపల్లంద్రు వీని బాగుగ పండన్
హంగుగ గనపడు కళ్ళకు
మ్యాంగోయని వీనినంద్రు మాన్యులు వింటే !
బంగారు రంగు పండ్లివి
రిప్లయితొలగించండిబంగినపల్లంద్రు వీని బాగుగ పండన్
హంగుగ గనపడు కళ్ళకు
మ్యాంగోయని వీనినంద్రు మాన్యులు వింటే !
మామిడి పండ్లనుఁ జూసిన
రిప్లయితొలగించండినే మనుజునకైన మిగుల నింపగు, సతతం
బామని వేళల మల్లెయు
మామిడి సంబరములెల్ల మఱిమఱి పెంచున్.