5, ఏప్రిల్ 2014, శనివారం

పద్య రచన – 557

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

14 కామెంట్‌లు:

 1. సుదతీ! నీ మృదుపాణి పల్లవముతో సొంపారగా వానికిన్
  వదనంబున్ దళుకొత్త జేయు నిపుణత్వం బబ్బె నేరీతి నాన్
  బదులిచ్చెన్ వనజాక్షి తీవ్ర కృషితో ప్రాప్తించె నా కివ్విధిన్
  ముదితల్ నేర్వగలేని విద్యకలదే మోదాన నేర్పించుచో?

  రిప్లయితొలగించండి
 2. ఆడు వార లబల లంచు ననగ ద్రొక్క బోకుమీ
  నేడు చూడు చిత్ర మందు నెలత చేయు చున్నదా
  వాడి కత్తి తోడను మగ వాని గడ్డ మిత్తరిన్
  జూడ చోద్యమౌను గాని సుప్రయోగ కార్యమే.

  రిప్లయితొలగించండి
 3. కులపు వృత్తిఁజేయు కూర్మి సోదరులతో
  కోరి క్షౌర వృత్తిఁ జేరె మహిళ
  అన్ని రంగములను నారి తేరిరి గదా!
  నేటిమహిళలంత నిర్భయముగ.

  రిప్లయితొలగించండి
 4. గడ్డమైన గీయు కంఠమైనను గోయు
  వంట వార్చు, గెలిచి ప్రజల నేలు
  నంతరిక్షమేగి యంతరార్థ మెరుగు
  ముదిత నేర్వ లేని బోధ గలదె?

  రిప్లయితొలగించండి
 5. భామలేమియైన చేయ వచ్చుననుచు చెప్పుచున్
  నీమమడ్డు తగులకుండ నీతితోడ కార్యమున్
  మేముగూడ జేతుమంచు మిగులగౌరవమ్ముగా
  గీములోని పనులె గాక గీసి చూపె గడ్డమున్

  రిప్లయితొలగించండి
 6. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 7. గీ యుచుండెను నొక్కతె గె డ్డ మచట
  తనదు మృదువైన కరముల దనరు నట్లు
  అమెరి కా యందు భామలే యందముగను
  చేయు చుందురు క్షవరము సీ త ! వినుము

  రిప్లయితొలగించండి
 8. మగువలు నేర్వని విద్యలు
  జగమున లేవనుట నిజము చక్కగ నేర్పన్
  మగవారికి చేదోడుగ
  సగభాగము పంచుకొనును సాధ్వీ మణులే!


  సంగరమందున నురుకును
  నింగిని సైతము వెలుగును, నిప్పుల నార్పున్
  శృంగము లెక్కును చివరకు
  మంగలిపనికూడ నేర్చు మహిళా మణులే

  రిప్లయితొలగించండి
 9. క్షుర కర్మ జేయు టతివల్
  సరి కాదీ పుణ్య ధాత్రి చక్కని ప్రతిభన్
  మరియొక వృత్తిని జూపుము
  సరివత్తురె నీకు ధరణి సబలా! పురుషుల్?

  రిప్లయితొలగించండి
 10. మిత్రులారా! శుభాశీస్సులు.
  ఈ నాటిపద్య రచన అంశమునకు వైవిధ్యముతో పద్యములు వచ్చినవి. అన్నియును బాగుగ ఉన్నవి. అందరికి అభినందనలు.
  అక్కడక్కడ ఉన్న కొన్ని పొరపాటులకు కొన్ని సూచనలు:

  శ్రీమతి శైలజ గారూ:
  ఈ పాదమును చూడండి:
  సగ భాగము పంచుకొనును సాధ్వీమణులే.
  సాధ్వీమణులు బహువచనము కాబట్టి పంచుకొనెదరు అనుట సాధువు.

  అదే రీతిగా:
  మంగలి పని కూడ నేర్చు మహిళామణులే --
  బహువచనము కాబట్టి:
  మంగలి పని నేర్వగలరు మహిళామణులే - అనుట బాగుగ నుండును.

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 11. రోగి యయిన పతిని రోయక సేవించు
  సతియె మనకు నొక్క చక్కనైన
  పాఠమొకటి నేర్పె పడతుల కెల్లనా
  దర్శమయిన నారి దండమమ్మ!

  రిప్లయితొలగించండి
 12. కవిమిత్రులకు నమస్కృతులు.
  ఇల్లు మారడం జరిగిపోయింది. నా సిస్టంను సెట్ చేసుకున్నాను. నెట్ కనెక్షన్ కూడా వచ్చింది. కాకుంటే బాగా అలసిపోయాను. ఈ మూడు రోజులు పద్యరచన చేసిన వారికి అభినందనలు.
  మిత్రుల పద్యాలను సమీక్షించిన గురుదేవులు పండిత నేమాని వారికి ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 13. కర్మంబని తలపక క్షుర
  కర్మనె తాజేయుచుండె కలికిట జూడన్
  నిర్మల మనమున సలిపెడి
  కర్మలకే దోషమింక గలుగదు గాదా !


  రిప్లయితొలగించండి