22, ఏప్రిల్ 2014, మంగళవారం

పద్య రచన – 574

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

15 కామెంట్‌లు:

 1. అందమున నచ్చరల మించు నట్టి వారు
  భామ లేవురు కన్నుల పండువగుచు
  సరస భంగిమ లలరారు సరణి దివ్య
  నృత్యములు సేయుచుండిరి నేర్పు మీర

  రిప్లయితొలగించండి
 2. లలిత లావణ్య సుకుమార లలన లంత
  నింద్ర సభనుండి దిగివచ్చెనేమొ నిలకు
  విలసి తంబైన నృత్యము వివిధ గతుల
  కనుల కింపుగ జేయుచు కావ్య మలర

  రిప్లయితొలగించండి
 3. ముద్దు గుమ్మలు గుమిగూడి ముచ్చటగను
  జేయు చుండిరి నృత్యము చిత్ర మందు
  నాట్య తీ రును జూడగ నాట్య మదియ
  కూచి పూడిగ భావింతు గోమలాంగి !

  రిప్లయితొలగించండి
 4. సుబ్బారావు గారు,
  అది కూచిపూడి నృత్యప్రదర్శనే.
  కోమలమైనట్టి కుసుమ సములగు కోమలులాడంగ కొలకుల నిండ
  ప్రేమలు నిండగ పేర్మినిఁ గూర్చి విన్నవించితి వీను విందుగ; పదము
  నీమముఁ దప్పక నేరిచి యోర్మి, నిష్ఠలఁ జూపుచు నిల్చువారలకు
  సోమశేఖరుని , యచ్యుతుని చలువపు చూపొసంగుననుచు శుభము.

  తరువోజ
  పద్య లక్షణములు:

  4 పాదములు ఉండును.
  ప్రాస నియమం కలదు
  ప్రతి పాదమునందు 3,5,7 గణముల మొదటి అక్షరములు యతి స్థానములు.
  ప్రతి పాదమునందు మూడు ఇంద్ర , ఒక సూర్య , మూడు ఇంద్ర , ఒక సూర్య గణములుండును.

  రిప్లయితొలగించండి
 5. రంభ, యూర్వసులను మించి రమ్యమైన
  ముద్దుగుమ్మలేగురు బహుముదముతోడఁ
  జలుపు చుండిరి నాట్యమున్ చక్కగాను
  కరము తుష్టిని పొందరే కాంచు వారు?

  రిప్లయితొలగించండి
 6. ఇంద్రుడెవరికి భయపడి యింత మంది
  యప్సరసలను బంపెనో యంతు జూడ
  భామకొక శకుంతల పుట్టి భరతునిగన
  దేశ నామంబు లెట్టుల తీరునేమొ?

  రిప్లయితొలగించండి
 7. ఇంద్రుడెవరికి భయపడి యింత మంది
  యప్సరసలను బంపెనో యంతు జూడ
  భామకొక శకుంతల పుట్టి భరతునిగన
  దేశ నామంబు లెట్టుల తీరునేమొ?

  రిప్లయితొలగించండి
 8. పండిత నేమాని వారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘దిగివచ్చిరేమొ యిలకు’ అనండి.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  మీ తరువోజ పద్యం సుందరంగా ఉంది. అభినందనలు.
  ఆ చిత్రాన్ని మీ ఫేస్‍బుక్ పోస్ట్‌లోనుండే స్వీకరించాను. మీకు ధన్యవాదాలు చెప్పడం మరిచిపోయాను. మన్నించండి.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  బాగుంది మీ పద్యం. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. అమ్మా! లక్ష్మీ దేవి గారూ! శుభాశీస్సులు.
  మీ తరువోజ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
  4వ పాదము చివరలో గణములను ఒక మారు చూడండి.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 10. గురువుగారు,
  ఆ చిత్రం నేనూ షేర్ చేసిందే, నా సొంతమేమీ కాదు కదా! నాకు మీరు చెప్పవలసినదేమీ లేదు.
  మీ మెప్పు పొందే పద్యం వ్రాయగలిగినందుకు సంతోషమే నాకు.

  రిప్లయితొలగించండి
 11. కోమలమైనట్టి కుసుమ సములగు కోమలులాడంగ కొలకుల నిండ
  ప్రేమలు నిండగ పేర్మినిఁ గూర్చి విన్నవించితి వీను విందుగ; పదము
  నీమముఁ దప్పక నేరిచి యోర్మి, నిష్ఠలఁ జూపుచు నిల్చువారలకు
  సోమశేఖరు కనుచూపు, నచ్యుతుని చూపుల చలువయు శుభముల నొసగు.

  రిప్లయితొలగించండి
 12. కుసుమ కోమల కాంతలు కూర్మితోడ
  నాట్యమాడుచునుండిరి నయముగాను
  గరిమకెక్కిన మనజాతి గురుతు గాదె
  భరతదేశము కళలకు బట్టుగొమ్మ

  రిప్లయితొలగించండి
 13. పూడిచి వేయక కళ కా
  పాడుచు నేకూచిపూడి బ్రతుకగ జేయన్
  వేడుకగా నేరిచి మరి
  నేడిట నాట్యమ్ము జేయు నెలతలకే జై !

  రిప్లయితొలగించండి