18, ఏప్రిల్ 2014, శుక్రవారం

పద్య రచన – 570

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

15 కామెంట్‌లు:

  1. చండార్కోగ్ర పరాక్రమం బలరగా శాసించుచున్ విశ్వమున్
    గండంబుల్ సృజియించుచున్ జనులకున్ గల్గించుచున్ బాధలన్
    చండాఖ్యాదులు పెచ్చరిల్ల ననిలో చండాస్త్రముల్ పూని చా
    ముండా! కూల్చితిగాదె యా దనుజులన్ ముల్లోకముల్ మెచ్చగా

    రిప్లయితొలగించండి
  2. రౌద్ర రూపము దాల్చిన భద్ర కాళి
    భువన భాండము నిండుగ బోన మనుచు
    దైత్య సం హార మొనరించ ధరను నిలచి
    నుపశ మించుము రక్షించ నుగ్ర రూపు

    రిప్లయితొలగించండి
  3. చండామార్కుల ద్రుంచిన
    చండీ! చాముండి!మాత శాంభవి జోతల్!
    మెండగు భక్తిన గొలువగ
    గండములన్నియునుబాపి గాచును కృపతో

    రిప్లయితొలగించండి
  4. చండీ! వందనమమ్మ! వాహనముగా శార్దూలమున్ గల్గి నీ
    ఖండింపంగను దైత్యులన్, జనులు నీ కారుణ్యముల్ పొంది వే
    దండమ్ముల్ గొనుమంచు పుష్పముల చేతన్ బూని పూజింపరే!
    నిండెన్ మానసముల్ భవత్కరుణ గాన్పింపంగనెవ్వేళనున్!

    రిప్లయితొలగించండి
  5. ఫ్రణామములు గురువుగారు,..చండామార్కుల పదప్రయోగం తప్పేమోనని ..సవరణ..

    భండుల మదమడగించిన
    చండీ! చాముండి!మాత శాంభవి జోతల్!
    మెండగు భక్తిన గొలువగ
    గండములన్నియునుబాపి గాచును కృపతో

    రిప్లయితొలగించండి
  6. భండ దైత్యులఁ బోలిన వారినుండి
    భువిని రక్షించు కార్యమ్ము భుజము మోయ
    రౌద్రరూపము దాల్చుతు లలిత రావె!
    నిన్నె నమ్మిన వారల నీడ నీవె!

    రిప్లయితొలగించండి
  7. దనుజులన్ దున్మి శిష్టుల దయను బ్రోచు
    ముగ్గురమ్మల మూలపు మూర్తి తాను
    కనక దుర్గ చండి యని తా ఖ్యాతి కెక్కె
    వందనమ్ముల నాతల్లి కంద జేతు

    రిప్లయితొలగించండి
  8. చండి! చాముండి! చాలించు భయపు రూపు
    కోళ్ళు మేకలు తెగటార్చి కోరిన నటుల
    పెట్టుటకు సిద్ధమైనారు పట్టు కొనుము
    నేతలిది యెన్నికల వేళ నిజము తల్లి !

    రిప్లయితొలగించండి
  9. శ్రీ గండూరి లక్ష్మీ నారాయణ గారు: శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    1వ పాదములో యతిని మరిచేరు.
    తరువాతి పాదములో ఒక అక్షరము ఎక్కువగా నున్నది. టైపు పొరపాటు కావచ్చు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  10. కవిమిత్రులకు నమస్కృతులు.
    నిన్న రోజంతా మా మిత్రుని కుమార్తె పెళ్ళి పనులలో తిరగడంతో బ్లాగును సమీక్షించే అవకాశం లభించలేదు. మన్నించండి.
    *
    పండిత నేమాని వారూ,
    మీ చండీస్తుతి బాగుంది. అభినందనలు.
    మిత్రుల పూరణలను సమీక్షించి, తగు సూచనలు చేసినందుకు ధన్యవాదాలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘ధరను నిలిచి/ యుపశమించుము’ అనండి.
    *
    శైలజ గారూ,
    సవరించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘భక్తిని గొలువగ’ అనండి.
    *
    లక్ష్మీదేవి గారూ,
    బాగుంది మీ శార్దూలవృత్తం. అభినందనలు.
    మొదటిపాదం చివర ఉన్న ‘నీ’ శబ్దానికి అన్వయం కుదరడం లేదు. అక్కడ ‘గల్గియున్’ అంటే సరిపోతుందనుకుంటాను.
    *
    సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘దాల్చుతు’ను ‘దాల్చుచు’ అనండి.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    బాగున్నది మీ పద్యం. అభినందనలు.
    నేమాని వారి సూచనలను గమనించారు కదా!
    మొదటి పాదాన్ని ‘చండి! చాముండి! భయదవేషమ్ము చాలు!’ అనండి.
    రెండవ పాదంలో ‘కోరినటుల’ అనండి.

    రిప్లయితొలగించండి
  11. గురువుగారికి ధన్యవాదములతో తమరి సూచిత సవరణతో పద్యం:
    భండ దైత్యులఁ బోలిన వారినుండి
    భువిని రక్షించు కార్యమ్ము భుజము మోయ
    రౌద్రరూపము దాల్చుచు లలిత రావె!
    నిన్నె నమ్మిన వారల నీడ నీవె!

    రిప్లయితొలగించండి
  12. గురువుగారు,
    నీ = నీవు అనే అర్థంలో క్రిందటి రోజు పూరణకు వాడినానండీ, అది తప్పు అన్వయాన్నిస్తున్నదా?

    రిప్లయితొలగించండి
  13. గౌరివి లక్ష్మివి వాణివి
    ధీరతతో మహిషుజంపు కాళియునీవే
    జేరిచి కరముల మ్రొక్కెద
    కూరిమితో శుభములనే కురియగరావే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పద్యం బాగున్నది
      చివరి పాదంలో గణదోషం. "శుభము లెల్ల కురియగ రావే" అనండి

      తొలగించండి
  14. ధన్యవాదాలు గురువుగారు, మీరు సూచించిన సవరణతో

    గౌరివి లక్ష్మివి వాణివి
    ధీరతతో మహిషుజంపు కాళియునీవే
    జేరిచి కరముల మ్రొక్కెద
    కూరిమితో శుభములెల్ల కురియగరావే

    రిప్లయితొలగించండి