13, ఏప్రిల్ 2014, ఆదివారం

సమస్యాపూరణం - 1381 (యోగి వాంఛించె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
యోగి వాంఛించె వెలయాలి కౌఁగిలింత.
(‘అభిలషతి హి వేశ్యాలింగనం సిద్ధయోగీ’
తిరుపతి వేంకట కవులు పూరించిన సంస్కృత సమస్యకు ఆంధ్రీకరణము)

26 కామెంట్‌లు:

  1. మధుర మైనట్టి జీవన సుధను గ్రోలి
    భోగ భాగ్యము లనునవి యోగ మనక
    సన్య సించగ గోల్పోతి సౌఖ్యము లని
    యోగి వాంచించె వెలయాలి కౌగి లింత

    రిప్లయితొలగించండి
  2. ఆట వెలదియందెంతయొ హాయిగాను
    వేదమేజెప్పె గాచూడ వేమనపుడు
    యోగియగుటకు ముందు విరాగి వేమ
    యోగి వాంఛించె వెలయాలి కౌగి లింత

    రిప్లయితొలగించండి
  3. అక్షయంబగు మోక్షము దక్ష ణం బె
    యోగి వాం ఛిం చె, వెలయాలి కౌగిలింత
    సదృశ మగునార్య !పొరలుట శవము మీ ద
    ఆదరించగ నర్హులు నాడు వారు

    రిప్లయితొలగించండి
  4. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    చిత్తమున సదా శ్రీ హరి చింతజేయు
    యోగి విప్రనారాయణున భోగి జేసె
    దేవదేవినా బరగు యందాలవేశ్య
    నగలుతెచ్చిన రమ్మన వగను జెంది
    యోగి వా౦ఛిoచె వెలయాలి కౌగిలింత.

    రిప్లయితొలగించండి
  5. పుణ్య కార్యములను సల్పి పుడమిమీద,
    యోగి వాంచించె వెలయాలి కౌగలింత
    దేవ లోకమునందున తీరుగాను,
    యోగియయ్యెనిల దివిని భోగిగాగ

    రిప్లయితొలగించండి
  6. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    విరుపుతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీరావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    రెండవ పాదంలో ఒక అక్షరం ‘న’ ఎక్కువయింది. మూడవ పాదంలో యతి తప్పింది. సవరించండి.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. "కామి గాక నెవడు మోక్ష గామి కాడు"
    యనెడు మాటలు ప్రతిరోజు నాలకించి
    జరుపు విధులను విడి బ్రహ్మచారి యనెడి
    యోగి వాంఛించె వెలయాలి కౌగిలింత

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నమస్కారం అండి, నాదో ప్రశ్న. "కామి గాక నెవడు మోక్ష గామి కాడు" అంటే పెళ్లి చేసుకోకుండా ఎవ్వడూ మోక్షము పొందలేడు అనా? లేక మోక్షము ఆసించడు అనా? దాని అర్థం వివరించ గలరా

      తొలగించండి
    2. ఇక్కడ కామం అంటే లైంగికజీవితానికి సంబంధించినది అని సామాన్యాన్వయం చేయకూడదు. కామ‌ం అంటే కోరిక - ఈ లోకంలో 'నేను' అనేవాడిని ఒకణ్ణున్నానూ‌ నాకు ఈ లోకంలో 'సుఖం'గా జీవించటానికి ఇది కావాలీ అది కావాలీ అని నిరంతరం మనస్సులో రేగే లాలస కారణంగా కలిగే అన్ని కోరికలూ ఇందులోనికి వస్తాయి. ఒకడు మోక్షాన్ని ఆశించేముందుగా ఈ సుఖలాలసనుండి జనించే కోరికలను అన్నింటినీ విడవాలి. విడవటం‌ అంటే అవి, ఉన్నాయి తనను అంటి పెట్టుకొని కాబట్టే, విడువ వలసి వస్తోంది కదా. అందుకని స్వభావతః అందరూ కామ పురుషార్థంలో ఉండే వారే. క్రమంగా నిజమైన సుఖేఛ్ఛ కలుగుతుంది - ఈ‌ లౌకికాలను కామించి జననమరణ చక్రంలో తిరగటంలో నిజమైన సుఖం‌ లేదన్నది ఆత్మలో నాటుకున్నాక. ఈ‌సుఖేఛ్ఛ అన్నదే మొదటి మోక్ష భూమిక. అది కలిగిన నాటినుండి వాడు మోక్షగామి అవుతున్నాడు.

      తొలగించండి
  8. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘కాడు + అనెడు’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ సంధి నిత్యం.

    రిప్లయితొలగించండి
  9. మిత్రులారా! శుభాశీస్సులు.
    గత 4 దినముల నుండి తీవ్ర జ్వరముతో బాధనొందితిని. అయినను వీలు చేసుకొని ఉడత భక్తితో మిత్రుల పద్యములను చూచి సూచనలు గావించితిని. నేడు bridgewater వేంకటేశ్వర మందిరములో నేను శ్రీమదధ్యాత్మ రామాయణమును గురించి ఉపన్యాసమును ఈయవలసి యున్నది. భగవంతుని కృపతో నా ప్రయత్నమును నేను గావించెదను. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  10. బయట వారల కాయన పరమ యోగి
    ఆశ్రమంబున లీలలు అవగతమ్ము
    సన్య సించగ జేరగ సాని యొకతె
    యోగి వాంఛించె వెలయాలి కౌగిలింత

    రిప్లయితొలగించండి
  11. శ్రీ కంది శంకరయ్య గురువరులకు నమస్కారములు సూచనకు ధన్యవాదములు
    సవరించి వ్రాసిన ఈ పద్యమును చూడండి
    "కామి గాక నెవడు మోక్ష గామి కాడు"
    నిత్య మీ వాక్య మిని మారి నిర్మలముగ
    జరుపు విధులను విడి బ్రహ్మచారి యనెడి
    యోగి వాంఛించె వెలయాలి కౌగిలింత

    రిప్లయితొలగించండి
  12. బయట వారల కాయన పరమ యోగి
    ఆశ్రమంబున లీలలు అవగతమ్ము
    సన్య సించగ జేరగ సాని యొకతె
    యోగి వాంఛించె వెలయాలి కౌగిలింత

    రిప్లయితొలగించండి
  13. శ్రీ కంది శంకరయ్య గురువరులకు నమస్కారములు సూచనకు ధన్యవాదములు
    సవరించి వ్రాసిన ఈ పద్యమును చూడండి
    "కామి గాక నెవడు మోక్ష గామి కాడు"
    నిత్య మీమాట విని మారి నిర్మలముగ
    జరుపు విధులను విడి బ్రహ్మచారి యనెడి
    యోగి వాంఛించె వెలయాలి కౌగిలింత

    రిప్లయితొలగించండి
  14. భోగియై వెన్క వేమన యోగి యయ్యె
    భోగ మొందెద ముందని వాగి కపట
    యోగి వాంఛించె వెలయాలి కౌఁగిలింత.
    యోగి యగుటకు బదులుగా రోగియయ్యె

    రిప్లయితొలగించండి
  15. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు సవరించిన పద్యము
    ప్రస్తుతించు చున్నాను

    చిత్తమున సదా శ్రీ హరి చింతజేయు
    యోగి విప్రనారాయణు భోగి జేసె
    దేవదేవినా బరగెడి దిట్ట సాని
    నగలుతెచ్చిన రమ్మన వగను జెంది
    యోగి వా౦ఛిoచె వెలయాలి కౌగిలింత.

    రిప్లయితొలగించండి
  16. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు
    మరియొక పూరణ:పగటి పూటను తానొక పరమ యోగి
    ప్రజల మెప్పును సేవలు బడయు చుండు
    రేయి దొంగ వ్యాపారము జేయు కపట
    యోగి వా౦ఛి౦చు వెలయాలి కౌగిలింత.

    రిప్లయితొలగించండి
  17. మాస్టరుగారూ ! ధన్యవాదములు.
    అస్వస్థులై ఉండి కూడా మా పద్యములను వీక్షించి తగిన సూచనలిచ్చిన శ్రీ నేమాని వారి వాత్సల్యమునకు శత సహస్ర వందనములు

    రిప్లయితొలగించండి
  18. పూజ్య గురువులకు ప్రణామములు
    త్వరగా కోలుకోవాలని భగవంతుని కోరుతూ .

    రిప్లయితొలగించండి
  19. నీరసమున నున్న నేమని గురువులు
    రామ చరిత జెప్పు లక్ష్యమెంచ
    వేంకటేశ్వరుండు ప్రేమతో దీవించ
    భారతియు కరుణించి వాక్కులొసగు

    రిప్లయితొలగించండి
  20. మీ యొక్క సాహిత్యాభిలాష ఎంత తీవ్రముగా నున్నదో తెలియుచున్నది. త్వరగ స్వస్థత నొందగలరు.
    ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  21. పండిత నేమాని వారూ,
    మీ ఉపన్యాస కార్యక్రమం విజయవంతమైనది భావిస్తున్నాను.
    రామకృపారసపానం చేసిన మీరు త్వరగా కోలుంకుంటారని ఆశిస్తున్నాను.
    స్వస్తి!
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘లీలలు అవగతమ్ము’ అని విసంధిగా వ్రాయరాదు కదా... ‘లీలలో యవగతమ్ము’ అనండి.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    ‘వాక్య మిని’ అంటే మీ భావం.. వాక్యము విని అనియా? ‘విని’ని ‘ఇని’ అనరాదు కదా... ‘నిత్యవాక్యమ్ము విని మారి...’ అనండి.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    నేమాని వారికి స్వస్థత చేకూరాలని కోరుకున్న మిత్రులందరికీ ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  22. నా స్వస్థత గురించి స్పందించిన మిత్రులకు శుభాశీస్సులు.
    జ్వరము దగ్గు ఆయాసములు ఇంకను ఇబ్బంది గూర్చు చున్నవి.
    ఈ నాటి నా ప్రసంగము చాల చక్కగ విజయవంత మైనది. స్వస్తి.

    రిప్లయితొలగించండి