12, ఏప్రిల్ 2014, శనివారం

పద్య రచన – 564

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

8 కామెంట్‌లు:

 1. గులక రాలను నింపగ కొంత పైకి
  పొంగి పొరలెను సలిలమ్ము నింగి వరకు
  పరవ శమ్మున త్రాగెను వాయ సమ్ము
  బుద్ధి కుశలత యుండిన భోగ మహిషి

  భోగ మహిషి = పట్టపు రాణి , రాజు భార్య

  రిప్లయితొలగించండి
 2. ఎండ జూడగ భగభగ మండుచుండె
  కాగుచుండెను నీరేమొ కాకి జూడ
  పాత కథనేమొ తలచుక పట్టితెచ్చె
  మంచు ముక్కను ముక్కుననుంచి కాకి

  రిప్లయితొలగించండి
 3. పాత్ర యందున్న జలమున వాయస మట
  మంచు గడ్డను బడ వేయ ,యంచు వరకు
  వారి వచ్చుట గమనించి వాయసంబు
  తీ యతీయగ దాహము దీ ర్చు కొనెను

  రిప్లయితొలగించండి
 4. కాకి యొక్కటి దప్పిచే కష్ట పడుతు
  నెండ కాలము పలుతావు లెదికి చూచె
  పెరడులో నొక గ్లాసులో పిసరుదకము
  గ్లాసులో నైసు ముక్కను వేయ నీరు
  చల్లబడి పైకి వచ్చెను మెల్లగాను
  త్రాగె నీ కాకి యలనాటి కాకి కాదు.

  రిప్లయితొలగించండి
 5. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  కాని కాకికి, భోగమహిషికి సంబంధం ఏమిటో అర్థం కాలేదు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  బాగున్నది మీ పద్యం. అభినందనలు.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘వెదకి’ని ‘ఎదికి’ అన్నారు..

  రిప్లయితొలగించండి
 6. గురువులకు ప్రణామములు

  నిజమే కాకికి భోగ మహిషికి సంబంధం లేదు . కానీ కాకివలె బుద్ధి కుశలత ఉంటే ఎంతటి ఇబ్బంది నైన దాటి భోగం లభించ వచ్చును అని
  అదన్న మాట అసల్ సంగతి

  రిప్లయితొలగించండి
 7. నీళ్ళు లేని పాత్ర నీరసంబున గని
  పట్న వాస కాకి బాధ పడుచు
  మంచు ముక్క దొరక నుంచి పాత్రఁ గరుగు
  బుద్ధి వెలుగఁ ద్రాగె మూతిఁ బెట్టి!

  రిప్లయితొలగించండి
 8. కరము దాహము గల్గిన కాకి యొకటి
  జలము కోసమై వాడల సంచరించి
  కాంచె కొంచెము నీటిని గ్లాసులోన
  వాడి రవికిరణములతో వేడియైన
  నీరు చల్లార్చ గానెంచి జారవిడిచె
  ముక్కుతో హిమ స్పటికపు ముక్క యొకటి
  చల్లనైన నీటిని త్రాగె సంతసముగ

  రిప్లయితొలగించండి