9, ఏప్రిల్ 2014, బుధవారం

సమస్యాపూరణం - 1377 (సజ్జనులకు ప్రీతికరము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
సజ్జనులకు ప్రీతికరము సారాకొట్టే.

20 కామెంట్‌లు:

 1. అజ్జము చదివిన తరుణము
  సజ్జనులకు ప్రీతి కరము , సారా కొట్టే
  రజ్జువు గాంచిన చాలును
  ముజ్జగ ములుద్రిప్పి సతిని ముంచును మంటన్

  అజ్జము = కొన్ని పనసలు గల వేద భాగము
  రజ్జువు = స్త్రీలజడ , త్రాడు

  రిప్లయితొలగించండి

 2. ముసారా కొట్టే వానకై వేచిన
  ఇచ్చిరి 'ఇసుకూలు' సెలవు;
  సాగించెద ఇక శంకరాభరణ కొలువు !
  సజ్జనులకు ప్రీతికర, 'ముసారా' కొట్టే !


  జిలేబి

  రిప్లయితొలగించండి
 3. మజ్జిగ వేసవిఁ ద్రాగుట
  సజ్జనులకు ప్రీతికరము, సారా కొట్టే
  ముజ్జగముల తేల్చు ఖలుని
  బజ్జీలు తినుచు మదిరను పరమని గ్రోలన్

  రిప్లయితొలగించండి
 4. మజ్జిగ వేసవిఁ ద్రాగుట
  సజ్జనులకు ప్రీతికరము, సారా కొట్టే
  కజ్జాలఁ దెచ్చు గణపతి
  మజ్జన రోజున, నిజముగ మదిరను మానుట మేలౌ

  రిప్లయితొలగించండి
 5. కవిమిత్రులకు నమస్కృతులు.
  మా చెల్లాయి (బావమరది భార్య) నల్లబెల్లి అనే గ్రామంలో యంపిటిసి గా పోటీ చేస్తున్నది. నిన్న రోజంతా ఆ ఊళ్ళోనే గడిచింది. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను. ఇవాళ రేపు అక్కడే. పునర్దర్శనం ఎల్లుండి.
  మూడు రోజులకొరకు సమస్యలను, పద్యరచన శీర్షికను షెడ్యూల్ చేసి వెళ్తున్నాను. దయచేసి సహకరించండి.
  ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 6. కజ్జురమును తినుటయనిన
  సజ్జనులకు ప్రీతి కరము, సారా కొట్టెే
  కజ్జలకది కారణమౌ
  మజ్జిగ త్రాగుచు మదిరను మానుట మేలౌ

  రిప్లయితొలగించండి
 7. బొజ్జగణపతిని కొలుచుట
  సజ్జనులకు ప్రీతికరము ; సారాకొట్టే
  ముజ్జగముల వేల్పుండెడు
  నుజ్జయినీ పురముచెంత నుండుట తగునే ?

  రిప్లయితొలగించండి
 8. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
  శంకరయ్య గారికి వందనములు

  ముజ్జగముల బ్రోచెడి హరి
  సజ్జనులకు ప్రీతికరము. సారా కొట్టే
  గజ్జెల గుర్రపు పడుచుల
  పజ్జను దుర్జనుల వీడు పరికిoపంగన్

  రిప్లయితొలగించండి
 9. ఇజ్జగమున తేనీరే
  సజ్జనులకు ప్రీతికరము, సారా కొట్టే
  బజ్జీలు తినుచు ద్రాగే
  తజ్జనులకు స్వర్గ మండ్రు ధారుణి యందున్.

  రిప్లయితొలగించండి
 10. ఒజ్జలను గౌరవించుట
  సజ్జనులకు ప్రీతికరము ,సారా కొట్టే
  లజ్జను పోగొట్టునుగద
  సజ్జనులకుహానికలుగు సత్యము నిదియే!

  రిప్లయితొలగించండి

 11. బెజ్జాల 'సా'యి 'రా'ముని
  సజ్జాపూర్లో పిలుతురు 'సారా' యనుచున్
  బజ్జీల కొట్టు యతనిది
  సజ్జనులకు ప్రీతికరము సా.రా. కొట్టే!

  రిప్లయితొలగించండి
 12. సజ్జన సాంగత్యమె యిల
  సజ్జనులకు ప్రీతికరము సారా కొట్టే
  నుజ్జుగ జేయును బ్రదు కని
  యొ జ్జలు మఱి చెప్పి రార్య ! యుద యంబు ననే

  రిప్లయితొలగించండి
 13. మిత్రులారా! శుభాశీస్సులు.
  ఈ నాడు వచ్చిన పూరణలు అన్నియును బాగుగ నున్నవి. అందరికి అభినందనలు.
  కొన్ని కొన్ని అక్కడక్కడ సూచనలు:

  శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు:
  గణపతి మజ్జన రోజున అన్నారు. రోజు అనునది తెలుగు పదము కాదు. ఇలాగ మార్చుదాము:
  ......దంతి నిమజ్జన దినమున......
  4వ పాదములో కొన్ని అక్షరములు ఎక్కువగా నున్నవి. నిజముగ అను పదమును తొలగించండి.

  శ్రీ పుష్యం గారు:
  కొట్టు + అతనిది = అనుచోట యడాగమము రాదు. కొట్టు వానిది అందాము.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 14. త్రాగుదు బోతు వారలన్నట్లు.......
  ముజ్జగముల నేలు సురలు
  లజ్జనకన్ త్రావ సురను , రభసే కనమే
  యిజ్జగమున మన బోలిన
  సజ్జనులకు ప్రీతికరము సారా కొట్టే1

  రిప్లయితొలగించండి
 15. లజ్జను బొందరు కొందరు
  బుజ్జీ ! మానండనినను బుద్ధిగ వినరే ?
  మజ్జిగ నీయగ దొరకరు
  సజ్జనులకు, ప్రీతికరము సారాకొట్టే.

  రిప్లయితొలగించండి
 16. సజ్జనులుగ దుర్జనులవ
  సజ్జనులకు ప్రీతికరము; సారా కొట్టే
  బొజ్జలు నిండని బ్రతుకుకు
  గుజ్జనగూళ్ళగును మదిర గ్రోలి నశించన్

  రిప్లయితొలగించండి
 17. బుజ్జిది మన రాష్ట్రమ్మై
  ముజ్జగముల లోన మెండు మురియునదవగా...
  బజ్జీల తోడ గ్రోలెడు
  సజ్జనులకు ప్రీతికరము సారాకొట్టే!

  రిప్లయితొలగించండి


 18. సజ్జన పుష్పాపచయము
  సజ్జనులకు ప్రీతికరము, సారాకొట్టే
  సజ్జ గద జిలేబీ మజ
  గజ్జెలు లేకయు నటనము ఘల్లన జేయన్ :)

  జిలేబి

  రిప్లయితొలగించండి