శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో..... నేడు దేశ సంపద దోచు కొని దాచు కొన్న వారు గొప్ప వారు ===============*================ తగని పనులు జేయంగ జ లగల వలన,పంది కొక్కుల వలన లాభ మ్ము గలదని నమ్ముచు జనులు జగతిని దోచు కొని దాచి సజ్జను లయ్యెన్!
పుడమి బెల్ల గిం చుచుదమ ముట్టి తోడ గుల్ల చేయును భూమిని గోప్యముగను దాని మూలాన పంటలు దండిగాను పండు నిజమిది కావున ప్రజలు లార ! పంది కొక్కుల వలనలా భంబు గలదు
బడుగు బ్రతుకుల పీడించి బాగు బడుచు
రిప్లయితొలగించండిరాజ కీయపు రాబందు భాజ నమ్ము
నింపు కొనగోరి మేపెడి నేత కనగ
పంది కొక్కుల వలన లాభమ్ము గలదు
అక్రమంబుగ దోచి చరాస్తినిధిని
రిప్లయితొలగించండిగుప్తముగదాచ భూమిని గుండిగలను
దాని వేలిదీయ మానవ తరముగాదు
పందికొక్కులవలన లాభమ్ము గలదు.
కుటిల నేతలు పందికొక్కులవిధమ్ము
రిప్లయితొలగించండిదోచుకొని దాచు కొందురు దొడ్డి దారి
సుతులకును బంధు హితులకు సతులకిట్టి
పందికొక్కులవలన లాభమ్ము గలదు.
కుటిల నేతలు పందికొక్కులవిధమ్ము
రిప్లయితొలగించండిదోచుకొందురు డబ్బును దొడ్డి దారి
సుతులకును బంధు హితులకు సతులకిట్టి
పందికొక్కులవలన లాభమ్ము గలదు.
భూమిలోపల మద్యమ్ము భూరిగాను
రిప్లయితొలగించండిదాచిపెట్టిన వైనమ్ము జూచినటులె
వాసననుబట్టి పసిగట్టి బైటపెట్టు
పంది కొక్కుల వలన లాభమ్ము గలదు !!!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినోట్లు పంచి జనంబుల యోట్లు పొంది
రిప్లయితొలగించండిపదవినెక్కిన తదుపరి వదలివేసి
రజ్జులాడుచు ప్రజదోచు రాజ కీయ
పందికొక్కుల వలన లాభమ్ము గలదు
బంధు మిత్రులు హితులకు పొందుగాను
శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
రిప్లయితొలగించండినేడు దేశ సంపద దోచు కొని దాచు కొన్న వారు గొప్ప వారు
===============*================
తగని పనులు జేయంగ జ
లగల వలన,పంది కొక్కుల వలన లాభ
మ్ము గలదని నమ్ముచు జనులు
జగతిని దోచు కొని దాచి సజ్జను లయ్యెన్!
పండిత నేమాని గారికి పూజ్యులుగురుదేవులు శంకరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించండిపందికొక్కుల వలనలాభమ్ము కలదు
యనుచు విదురుడు జూపెను యనిలజునకు
ఖనకు దెప్పించి గుప్తమ్ముగను బిలమున ననయమొనరించె లాక్షా గృహమ్ము నుండి
పుడమి బెల్ల గిం చుచుదమ ముట్టి తోడ
రిప్లయితొలగించండిగుల్ల చేయును భూమిని గోప్యముగను
దాని మూలాన పంటలు దండిగాను
పండు నిజమిది కావున ప్రజలు లార !
పంది కొక్కుల వలనలా భంబు గలదు
రిప్లయితొలగించండిపట్టిచంపగ లేములే పాడు పాడు
వాటి జంపగ మందులే బరగ జేసి
అమ్మ జూపెడు వారికి నట్టి యెలుక
పందికొక్కులవలన లాభమ్ము గలదు.
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిఅత్యవసరంగా వర్ధన్నపేట గ్రామానికి వెళ్ళి ఇప్పుడే ఇల్లు చేరాను. అందువల్ల మీ పూరణలకు వెంటవెంటనే స్పందించలేకపోయాను. మన్నించండి. రోజంతా ఎండలో ప్రయాణం. బాగా అలసిపోయాను.
ఈనాటి సమస్యకు చక్కని పూరణల నందించిన మిత్రులు....
రాజేశ్వరి అక్కయ్యకు,
భాగవతుల కృష్ణారావు గారికి,
గండూరి లక్ష్మినారాయణ గారికి,
మంద పీతాంబర్ గారికి,
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
కందుల వరప్రసాద్ గారికి,
నాగరాజు రవీందర్ గారికి,
కెంబాయి తిమ్మాజీరావు గారికి,
పోచిరాజు సుబ్బారావు గారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి
అభినందనలు, ధన్యవాదాలు.
*
వరప్రసాద్ గారూ,
‘సజ్జనులైరే’ అనండి.
*
తిమ్మాజీ రావు గారూ,
‘కలదు + అనుచు’, ‘జూపెను + అనిలజునకు’ అన్నప్పుడు సంధి నిత్యం. యడాగమం రాదు. మీ మొదటి రెండు పాదాలను ఇలా సవరిస్తున్నాను.
‘పందికొక్కుల వలనలాభమ్ము కలద
టంచు విదురుడు జూపినా డనిలజునకు’
*
సుబ్బారావు గారూ,
‘ప్రజలార’ సరియైన ప్రయోగం. అక్కడ ‘ప్రజలు వినుడు’ అనండి.
పూజ్యులుగురుదేవులు శంకరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించండిమీరు సూచించిన సవరణలకు ధన్యవాదములు