17, ఏప్రిల్ 2014, గురువారం

సమస్యాపూరణం - 1385 (తరువున వెల్గొందుచుండె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
తరువున వెల్గొందుచుండె తారాగణముల్.
(ఆకాశవాణి సమస్య)

25 కామెంట్‌లు:

 1. సరసులు,నటనాచతురులు,
  పరమ యశోధనులు నలరు వంశమ్మది య
  ద్దిర వంశ వృక్షమిదె యీ
  తరువున వెల్గొందుచుండె తారాగణముల్

  రిప్లయితొలగించండి
 2. పరమేశుని పెండిలి కట
  సుర గణములు తరలి వచ్చె సోయగ మంచున్
  వరపూజ జేయ గౌరియె
  తరువున వెల్గొందు చుండె తారా గణముల్

  రిప్లయితొలగించండి
 3. పురమున క్రై స్తవుల గో
  పురమున జనులంత క్రీస్తు పుట్టిన దినమున్
  జరిపెడువేళన నటగల
  తరువున వెల్గొందుచుండె తారాగణముల్!!!

  రిప్లయితొలగించండి
 4. అరుదెంచె వసంత మదిగొ
  పరమానందమ్ము గొలుప పచ్చని పూలున్
  వఱలెను నక్షత్రము లటు
  తరువున వెల్గొందుచుండె తారాగణముల్.

  రిప్లయితొలగించండి

 5. గరిమగల చిత్రకారుడు
  శరదృతువు చంద్రుని పటము చక్కగ వేసెన్
  పరికించి చూడ ఆ చి
  త్తరువున వెల్గొందుచుండె తారా గణముల్

  రిప్లయితొలగించండి
 6. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
  శంకరయ్య గారికి వందనములు

  హరు శిరమున కేశము లం
  బర వీధిని గ్రమ్ముకొనుచు భానుని మ్రింగన్
  మెరసెడి మిణుగురులా యన
  తరువున వెల్గొందుచుండె తారా గణముల్

  రిప్లయితొలగించండి
 7. పండిత నేమాని వారూ,
  వంశవృక్షాన మెరిసిన తారల గురించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  ‘తారు (తాము) + ఆ గణముల్’ అని విభాగమా? చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  మంద పీతాంబర్ గారూ,
  డిసెంబర్ వచ్చిందంటే సర్వసాధారణంగా కనిపించే దృశ్యమే అది. బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ మిణుగురు పురుగుల పూరణ బాగుంది. అభినందనలు.
  *
  భాగవతుల కృష్ణారావు గారూ,
  చుక్కల్లాంటి పువ్వుల పూరణ బాగుంది. అభినందనలు.
  *
  పుష్యం గారూ,
  మీ చిత్తరువు పూరణ బాగుంది. అభినందనలు.
  మీ రన్నట్టు రెండవ పాదంలో గణదోషం.. ‘శరదృతువు శశాంకు పటము చక్కగ వేసెన్’ అనండి.

  రిప్లయితొలగించండి
 8. ఇరులుకొనంగ గగనమున
  పరికించితి నొకపరి; శశి ఫలముగఁ దోచెన్,
  విరులై దూరపు గగనపు
  తరువున వెల్గొందుచుండె తారాగణముల్.

  రిప్లయితొలగించండి
 9. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  హరుని శిరమునే తరువుగ జేసిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  గగనపు తరువును పూలు పూయించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. అరిగెల వారింటను గల
  తరువది శోభించు నటుల దటిల్లతలతోన్
  విరివిగ నలం క రించగ
  తరువున వెల్గొందు చుండె తారా గణముల్

  రిప్లయితొలగించండి
 11. మరణించియు సతము సినీ
  తరువున వెల్గొందు చుండె తారాగణముల్
  పరులకొరకు జీవించుచు
  పరమును పొందుదురుసతము పావన చరితుల్


  రిప్లయితొలగించండి
 12. సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  రెండవ పాదంలో ‘తటిల్లత’ అన్నచోట గణదోషం.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. మురియుచు కంటిని కలలో
  నరుదెంచెనుజాబిలిలకు నద్ధ్బుత రీతిన్
  విరిసెను కలువలు మరియా
  తరువున వెల్గొందుచుండె తారాగణముల్

  రిప్లయితొలగించండి
 14. శైలజ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘జాబిలి యిల కద్భుతరీతిన్’ అనండి.

  రిప్లయితొలగించండి
 15. ధరపైబడ పత్రమ్ములు
  పరవశమొనరించుకుసుమ పాదపములతో
  కరమగు శోభను గూర్చుచు
  తరువున వెల్గొందుచుండె తారాగణముల్


  రిప్లయితొలగించండి
 16. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ తాజా పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 17. వరమిడ ప్రభుత్వమది యు
  త్తరువున, వెల్గొందు చుండె తార గణముల్
  విరమణ యరువది యేండ్లని
  మురిసిన సిబ్బంది యిండ్ల పున్నమి సిరులై!

  రిప్లయితొలగించండి
 18. మరణించిన నటరత్నము
  సరి నటసామ్రాట్టు యస్వి సావిత్రి నటన్
  మురిపించగ వేసిన చి
  త్తరువున వెల్గొందుచుండె తారాగణముల్.

  రిప్లయితొలగించండి
 19. మురిపెముగ నటుని పెండ్లికి
  నరుదెంచిరి చిత్రసీమ నందరు నట క్రొ-
  వ్విరి తావులె జల్లిన య-
  త్తరువున, వెల్గొందుచుండె తారాగణముల్.

  రిప్లయితొలగించండి
 20. బరువుగ బిరియాని తినుచు
  విరివిగ సారాయి త్రాగి వేకువ జామున్
  పొరలగ నడివీధి నహహ
  తరువున వెల్గొందుచుండె తారాగణముల్

  రిప్లయితొలగించండి


 21. కరువుల్లేనిభువి గదా !
  తరువున వెల్గొందుచుండె తారాగణముల్,
  సిరిసిరి మువ్వుల వెల్గుల
  కరివరదుని కరుణ గాన కంద జిలేబీ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 22. బరువగు మనమున చెప్పెద
  సరిగా వినవే ప్రియంక! జడియక మోడిన్
  పరుగిడగా మన కోర్కెలు
  తరువున వెల్గొందుచుండె తారాగణముల్

  రిప్లయితొలగించండి