28, ఏప్రిల్ 2014, సోమవారం

పద్య రచన – 580

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

17 కామెంట్‌లు:

  1. కూడు సరిగ లేదు, గూడు తిన్నగ లేదు
    జీవితమ్ము కొరకు చింత లేదు
    పెద్ద చదువు లొదవు పిల్ల కనెడి యాశ
    కాంతి గూర్చు చుండు స్వాంతములను

    రిప్లయితొలగించండి
  2. కూడు గుడ్డ లేదు కులగోత్ర ములులేవు
    నీటి తూర లందు మోటు బ్రతుకు
    బడికి పోయి నీవు బంగారు బాటపై
    కాంతు లీను చుండ కలను గంటి

    రిప్లయితొలగించండి
  3. గొట్టము మన యిల్లిది నిన్
    గొట్టనులే బాగ చదువు కొనవే! బడినె
    గ్గొట్టక చదివిన భావిని
    కట్టింతుము నిజము తల్లి ! కనకపు మేడన్.

    రిప్లయితొలగించండి
  4. కూడు గుడ్డ మరియు గూడు లేకున్నను
    తనయ చదువుకొరకు తల్లడిల్లు
    చుండె తల్లి మనసు, నండ నిచ్చి విధిగ
    నందమౌ భవితను నందజేయు

    రిప్లయితొలగించండి
  5. పండిత నేమాని వారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. నీటి తూర లోన నివసించు చుంటిమి
    యుండ యిల్లు మఱియు నొడల బట్ట
    సరిగ లేదు , బాగ చదువుకొ నుముబాల !
    యనుచు దల్లి కూతు ననున యించె

    రిప్లయితొలగించండి
  7. గూడు కూడు నిలువ నీడ లేకున్నను
    బాగ చదువు కొనుము బడికి పోయి
    పెద్ద చదువు చదివి గద్దెలెక్కవలయు
    వేగ బోయి రమ్ము వేద నేల?

    రిప్లయితొలగించండి
  8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి

  9. విద్దె నెరుంగకన్ బ్రతుకు వీధుల పాలయి పోయెనంచు తా

    ముద్దుల కూతురున్ బడికి పూనిక తోడను పంప దల్చియున్

    హద్దులు మీరి కార్యముల హర్నిశముల్ ఘటియించి యార్తితో

    ప్రొద్దున లేచి దుస్తులను పొందుగ వేయుచునుండె బిడ్డకున్.

    రిప్లయితొలగించండి
  10. సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మంచి పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. కవిమిత్రులారా,
    పద్యరచన శీర్షికకు నేను సేకరించి పెట్టుకున్న చిత్రాలు అయిపోయాయి.
    దయచేసి పద్యరచనకు అవకాశాన్నిచ్చే చిత్రాలను నాకు పంపి సహకరించవలసిందిగా మనవి.
    shankarkandi@gmail.com

    రిప్లయితొలగించండి
  12. 1.చదువుకో నా తల్లి చదువు యెదుగు నిచ్చు!
    చదువుకో నా తల్లి చదువు పదవి నిచ్చు!
    చదువుకో నా తల్లి చదువు సౌధ మిచ్చు!
    చదువుకో నా తల్లి చదువు సౌఖ్యమిచ్చు!
    2.గొట్టపు నీడన చదువుము
    పట్టా లెన్నో వరించు పాపా నీకున్!
    దిట్టవని దెల్సి వత్తురు
    చుట్టాలందరు పదవిన చూడగ నిన్నే !

    రిప్లయితొలగించండి
  13. సొడ్డులఁ జెప్పుచున్ చదువుఁ జుల్కనఁ జేయుట పాడియౌనొకో?
    బిడ్డకు విద్య నేర్పుటకు ప్రేమను కష్టము నోర్చు తల్లికే
    యడ్డము లేకపోయెనను యర్థముఁ జెప్పెడు బొమ్మఁ గాంచుడీ!
    చెడ్డదినమ్ములున్ గడచు; జీవన చిత్రము మారు నమ్ముమా!

    రిప్లయితొలగించండి
  14. శ్రీమతి లక్ష్మీ దేవి గారు: శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. పోయెనను + అర్థము = అనుచోట యడాగమము రాదు కదా. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  15. సహదేవుడు గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    బాగున్నది మీ పద్యం. అభినందనలు.
    ‘పోయెనను నర్థము...’ అనవచ్చు.

    రిప్లయితొలగించండి
  16. గురువుగార్లకు ధన్యవాదములు.
    మీ సవరణ బాగున్నది. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  17. గూడు లేదు కాని గుండెకు నిబ్బర
    మున్న దిచట జూడ, నెన్నికలను
    ప్రభువు లైన వారు పట్టించుకొన వీరి
    గతులు మారు కలుగు గౌరవమ్ము.

    రిప్లయితొలగించండి