6, ఏప్రిల్ 2014, ఆదివారం

సమస్యాపూరణం - 1374 (మగవానికి గర్భమాయె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
మగవానికి గర్భమాయె మానినిఁ గూడన్.
(అవధాని అందె వెంకటరాజం పూరించిన సమస్య. పృచ్ఛకుని పేరు గానీ, పూరణ పద్యం కానీ దొరకలేదు)

28 కామెంట్‌లు:

 1. భగవంతుని వరమదె యొక
  మగవానికి, గర్భమాయె మానిని గూడన్
  తగ వాని ధర్మపత్నికి
  సుగుణాఢ్యుండైన యొక్క సుతుడొదవె బళా!

  రిప్లయితొలగించండి
 2. నిగమములు తెలిసి యుండిన
  మగవానికి , గర్భమాయె మానిని గూడన్
  తగురీతి ధర్మ పత్నికి
  జగమెరిగిన బ్రాహ్మ ణుండు సంతస మొందన్

  రిప్లయితొలగించండి
 3. క్షమించాలి \
  చివరి పాదం
  జగమెరిగిన బ్రాహ్మణుండు జన్మించెనుగా "
  అని ఉంటే బాగుంటుందేమొ

  రిప్లయితొలగించండి
 4. ఇటువంటి పరిస్థితులని సృష్టించిన రసవత్తర కావ్యం కళాపూర్ణోదయము. వీలైతే చదవమని మనవి. చాలా ఓపిక కావాలి. అల్లిక మరియు కథ రెండూ జిగిబిగియే.

  రిప్లయితొలగించండి
 5. తగు శస్త్ర చికిత్స జరుగ
  యగణిత ధనరాశి కరిగె, యనుకూలించెన్
  భగవత్కరుణా ఫలమున
  మగవానికి, గర్భమాయె మానినిఁ గూడన్

  రిప్లయితొలగించండి
 6. యుగముల లక్ష ణ మరయుము
  జగమున మఱి వింత లెన్నొ జరుగును జూడన్
  నగుబాటు గలుగు విధముగ
  మగవానికి గర్భ మాయె మానిని గూడన్

  రిప్లయితొలగించండి
 7. పండిత నేమాని వారూ,
  విరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగుంది. మొదటిది, సవరించినది రెండూ... అభినందనలు.
  *
  చంద్రశేఖర్ గారూ,
  ధన్యవాదాలు.
  *
  సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘జరుగ నగణిత...’, "కలిగె ననుకూలించెన్’ అనండి.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 8. సగభాగము నీవంచును
  తగ వలపుల కురియజేసె ధవుడును, సతియున్
  వగ లొలుకుచు ప్రేమ నిడెను
  మగవానికి, గర్భమాయె మానినిఁ గూడన్.

  రిప్లయితొలగించండి
 9. మిస్సన్న గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. వగచిన సంతతి లేదని
  మగవానికి, గర్భమాయె మానిని గూడన్
  తగు శుభ తిథి సమయమ్మున
  మగనాలికి దీరె కోర్కె మనముప్పొంగెన్

  రిప్లయితొలగించండి
 11. గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. జగదాంబివ్వంగ వరము
  మగవానికి, గర్భమాయె మానిని గూడన్
  మగనాలిలోని మార్పుకు
  తెగమురిసెనతడు కనుగొని తీరగు రూపున్

  రిప్లయితొలగించండి
 13. తగ దైవగతింబొనరెన్
  మగవానికి, గర్బమయ్యె మానిని గూడన్
  సుగుణాలరాశి భార్యకు
  సొగసైన సుతుడు జనించి సౌఖ్యము నొసగెన్

  రిప్లయితొలగించండి
 14. ఎగనామమ్మిడి పనులకు
  తెగబలిసినవానిజూసి,తెంపరినెగతా
  ళిగపలికి నవ్వె ,గనరే
  మగవానికి గర్భమాయె మానిని గూడన్ !!!

  రిప్లయితొలగించండి
 15. చిన్న సవరణ...

  తగ దైవగతింబొనరెన్
  మగవానికి, గర్బమయ్యె మానిని గూడన్
  సుగుణాలరాశి భార్యకు
  సొగసైన సుతుడు జనించి సుఖమున్ నొసగెన్

  రిప్లయితొలగించండి
 16. సుగతిని బొందుట కొరకై
  సొగసగు పుత్రుని బడయగ సుకృతములెల్లన్
  వగవక చేయుచు నుండెడు
  మగవానికి; గర్భమాయె మానిని గూడన్!

  రిప్లయితొలగించండి
 17. సహదేవుడు గారూ,
  మీ భావమే సరియైనది. నేను తొందరపాటుతో ‘కలిగె’ అన్నాను. ఐనా అక్కడ ‘కరిగె ననుకూలించెన్’ అని ఉండాలి.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘జగదాంబ’ అనడం దోషం. అది ‘జగత్ + అంబ = జగదంబ’. దాని తరువాత వచ్చిన అచ్చుకు యడాగమం రావాలి. సంధి లేదు. దానిని ‘జగదంబ వరము నివ్వగ/ జగదంబ యివ్వఁగ వరము’ అనండి.
  *
  శైలజ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  మంద పీతాంబర్ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 18. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
  శంకరయ్య గారికి వందనములు

  వగ జెందు సంతులేదని
  మగవానికి.గర్భ మయ్యె మాని[బ్రాహ్మణుడు]ని గూడన్
  మగనాలికి,రాజన్యుడు
  తగు రీతిని సత్కరించె ధరణీదేవున్


  రిప్లయితొలగించండి
 19. గురువు గారికి ధన్యవాదాలు. తమరి సూచన మేరకు సవరించిస పద్యం.
  తగు శస్త్ర చికిత్స జరుగ
  నగణిత ధనరాశి కరిగె, ననుకూలించెన్
  భగవత్కరుణా ఫలమున
  మగవానికి, గర్భమాయె మానినిఁ గూడన్

  రిప్లయితొలగించండి
 20. తెగ పూజలెన్నొ సలుపుచు
  మగ డాక్టరు చెప్పినట్టి మందులు వాడెన్
  తెగిపోయెను దోషంబులు
  మగవానికి; గర్భమాయె మానిని గూడన్

  రిప్లయితొలగించండి
 21. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  మాని శబ్దానికి మానము కలవాడు అనే అర్థం ఉంది కాని బ్రాహ్మణుడు అనే అర్థం ఉన్నట్టు లేదు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి

 22. పూజ్యగురుదేవులుశంకరయ్యగారికివందనములు
  “మాని” యన్న శబ్దమునకు “బ్రాహ్మణుడు” యని అర్ధము. దయతో ఆచార్య జి.యన్ .రెడ్డిగారి తెలుగు పర్యాయపద నిఘంటువు లో
  118 పుట 2429 సంఖ్యను పరిశీలించుడు

  రిప్లయితొలగించండి
 23. తిమ్మాజీరావు గారూ,
  నిజమే... బ్రాహ్మణునకు మాని అన్న పర్యాయపదాన్ని ఆచార్య జి.యన్.రెడ్డి గారు పేర్కొన్నారు. గమనించాను. మీ ప్రయోగంలో దోషం లేదు.
  కాని శబ్దరత్నాకరం, శబ్దార్థచంద్రిక, బ్రౌణ్యం, సూర్యరాయాంధ్ర్రనిఘంటువు, శ్రీహరి నిఘంటువులలో ఎక్కడా ఆ శబ్దానికి బ్రాహ్మణుడు అన్న అర్థాన్ని ఇవ్వలేదు.

  రిప్లయితొలగించండి
 24. రగడీ ప్రధాని పదవని
  మగువొక పన్నాగమల్లి మన్మోహనుకున్
  నగుమోముననిడి నంతనె
  మగవానికి గర్భమాయె మానినిఁ గూడన్

  రిప్లయితొలగించండి


 25. చిగురించగ మోహమ్మది
  మగవానికి, గర్భమాయె, మానినిఁ గూడన్
  జగమే ఊయల యై తూ
  గ గాను ప్రకృతికృపగాన, కరుణామయికిన్ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 26. మగవాడిని నాకేటని
  బిగువగు గోచీని కట్టి బింకము మీరన్
  తగవుకు నమేఠి వెడలగ
  మగవానికి గర్భమాయె మానినిఁ గూడన్

  రిప్లయితొలగించండి