11, ఏప్రిల్ 2014, శుక్రవారం

పద్య రచన – 563

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

13 కామెంట్‌లు:

  1. నమ్మి కొలిచెను సావిత్రి నెమ్మి భవుని
    వెంబ డించెను కాలుని వేడు కొనుచు
    ప్రాణ బిక్షను కోరెను భర్త కనగ
    యముని మెప్పించి సాధ్విగ యశము నొందె

    రిప్లయితొలగించండి
  2. శ్రీమతి రాజేశ్వరి గారూ: శుభాశీస్సులు.
    మీ పద్యము చక్కగ వచ్చినది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. యముని తనదు మాటలతో
    రమణియు మెప్పించి వరములందిన వేళన్
    కమనీయముగా చిత్రము
    నమరినదీ దృశ్యమందు నద్భుతమందున్.
    భళిభళి యంచు లోకములు పత్నిని భూరి ప్రశంసజేయగా
    నళినముఁ బోలు కన్నులవి నల్గగ నశ్రువు జార, ప్రాణముల్
    కళకళలాడు భర్తఁ గని కాంతకు సంతసమింతలంతలై
    గళమది రుద్ధమయ్యె యమ కారుణికత్వముఁ బొందినంతనే.

    రిప్లయితొలగించండి
  4. యముని నెటులనో నొప్పించి యాయమ తన
    భర్త ప్రాణములిప్పించె భవ్యముగను
    వరల సావిత్రి వంటి పావనుల కుమఱి
    సాధ్యమే గద జగతిని సర్వ ము నిక

    రిప్లయితొలగించండి
  5. పతిని బ్రతికించుకొనుటకై పడతి యపుడు
    యముని వెంబడి పోరాడి యద్భుతముగ
    భర్త ప్రాణమ్ము వరముగా పత్ని బౌందె
    పరమ పావన సావిత్రి ప్రణతులమ్మ

    రిప్లయితొలగించండి
  6. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు


    పద్యరచన:భారత వధువు సావిత్రి
    పలికె యమునితో సావిత్రి “పరమ పురుష ,
    భర్త ప్రాణముల్ దీయంగ వలదు దేవ ,
    నాదుయసువులు గొంపోయి నమ్మబలుకు
    కట్నవేధి౦పులకు నన్ను గాల్చి రనుచు
    బ్రతికి నరకమ్ము జూడంగ వలయు నతడు

    రిప్లయితొలగించండి
  7. భారత దేశమందు తన భర్తను వీడిన గోలుపోయినన్
    భారత నారి జీవనమ పార పరా భవ మొందకుండునే
    ధీర పరేతరాజ! పతి దేవుని ప్రాణము నిమ్ము లేనిచో
    చేరుచుమయ్య నాధవుని చెంతకు మ్రొక్కెద చేతులెత్తియున్

    రిప్లయితొలగించండి
  8. మిత్రులారా! అందరికీ శుభాశీస్సులు.
    ఈ నాటి అందరి పద్యములును అలరించుచున్నవి. అభినందనలు.

    శ్రీ తిమ్మాజీ రావు గారు:
    నాదు + అసువులు అనుచోట నుగాగమము వచ్చును = నాదు నసువులు అగును.

    కట్న వేధింపులకు బదులుగా - కట్నముల బాధలకు అందామా?

    రిప్లయితొలగించండి
  9. పతికి ప్రాణంబు దక్క, నే వరమునిత్తు
    కోరుకొమ్మని కొమ్మనే కోర కోరె
    నాడు సావిత్రి సమవర్తి నడ్డగించి
    తికమకలె బెట్టి పతిబొందె తీరుగాను.

    రిప్లయితొలగించండి
  10. పండిత నేమాని గారికి వందనములు
    మీసూచనలకు ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  11. కాంచె పావని సావిత్రి కరము వేగ
    తన పతిప్రాణముల్ గొని తరలుచున్న
    యంచకాల ప్రచండుని నధిక విస్మ
    యముగ, నేగె తా నా యము ననుసరించి
    పతిని కాపాడ గానెంచి వరము గొనగ

    రిప్లయితొలగించండి