25, ఏప్రిల్ 2014, శుక్రవారం

పద్య రచన – 577

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

9 కామెంట్‌లు:

 1. తప్పు లెంచక గృపజూడు తండ్రి వీవ
  నిన్ను భజియింతు సేవింతు నిరత మార్య !
  రక్షసేయుము మమ్ముల లక్షణముగ
  నార సింహుడ! మఱి నీ కు నతులు సేతు .

  రిప్లయితొలగించండి
 2. దైత్యుడౌ హిరణ్యాక్షుడు తనను బెట్టు
  బాధలన్నియు భూదేవి బ్రహ్మతోడ
  విన్నవించగ, సురలతో విష్ణు కడకు
  నేగి ప్రార్థించె నాతడా యిందిరపతిఁ
  దీర్చ భూదేవి బాధలన్ తీరుగాను
  హరి వరాహవతారమునవని బుట్టి
  సమరమొనరించి దైత్యుని సమయ జేసి
  తాను చేపట్టె భూదేవి తనివితోడ

  రిప్లయితొలగించండి
 3. ధర ముంచు హిరణ్యాక్షులు
  నిరతము మాముందుఁ దిరుగ నెదిరించగ మా
  తరమె? ధరణీ రమణ! మము
  వరాహ రూపమునఁ గావ పరుగున రారా!

  రిప్లయితొలగించండి
 4. ధరణిన్ జాపగ జుట్టి దానవుడు సంద్రంబందు ద్రోయన్ జనన్
  త్వరగా వాని నెదిర్చి గూల్చి ధరకున్ దైన్యంబున్ బాపితో
  యరవిందాసన వాసవాది వినుతా! ఆనంద సంధాయకా!
  సురసంసేవ్య! వరాహరూపవిభవా! క్షోణీశ! నిన్ గొల్చెదన్

  భక్త రక్షకుడవు ముక్తి ప్రదాతవు
  వందనమ్ము నీకు వాసుదేవ!
  అఖిల లోకములకు నాధారమగు దేవ!
  చేతియూత మిమ్ము శ్రీనృసింహ!

  వందే యజ్ఞ వరాహం త్వాం
  వందే ధాత్రీ విభుం ప్రభుం
  వందే దానవ హంతారం
  వందేహం ధర్మ రక్షకం

  సంశ్రితార్తిహరం వందే
  ధారుణీ తాప హారిణం
  దంష్ట్రాయుధవరం వీరం
  వందేహం క్రోడ మచ్యుతం

  పాహిమాం కిటి రూపేశ!
  పాహిమాం లోక రక్షక!
  పాహిమాం దేవదేవేశ!
  పాహిమాం కరుణాకర!

  రిప్లయితొలగించండి
 5. శ్రీ అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు: శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
  హరి వరాహావతార తారుడై యవని వెలసి అని అందామా?
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 6. పూజ్య గురుదేవులు పండిత నేమాని గారికి నమస్సులు. తమరిసవరణలకు ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 7. భూమిన్ జుట్టగ జుట్టి క్రూరముగ నమ్భోరాశిలో ముంచగా
  నా మూర్ఖుండగు హేమలోచనుడు, క్రోడాకారముం బొందవే
  భూమిన్ దేల్చగ కోరపంటిని హరీ! పోరాడి భంజించి రే-
  గామున్, మాలిమి నేలవే ధరణి శ్రీ కాంతన్, నమో వాకముల్.

  రిప్లయితొలగించండి
 8. ఈనాటి పద్యరచన శీర్షికకు మంచి పద్యాలను అందించిన కవిమిత్రులు...
  పోచిరాజు సుబ్బారావు గారికి,
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
  సహదేవుడు గారికి,
  పండిత నేమాని వారికి,
  మిస్సన్న గారికి
  అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 9. ఆదివరాహా ! శ్రీశా !
  మేదిని నే చుట్ట జుట్టి మ్లేచ్ఛుడు వెడలన్
  మోదుఛు వ్రేలిచి వానిని
  మోదమునే గూర్చి నావు మురహరి ! జేజే !

  రిప్లయితొలగించండి