20, ఏప్రిల్ 2014, ఆదివారం

పద్య రచన – 572

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

9 కామెంట్‌లు:

  1. నిమ్మ రుచి తోడ చిలుకలు కమ్మ గుండు
    రంగు రంగుల తోడను రసన తడుపు
    చిన్న పిల్లలు తిను చుంద్రు మిన్న తుష్టిఁ
    మరచి పోలేము చిన నాటి మక్కువలను

    రిప్లయితొలగించండి
  2. తీయ తీయని దొనలను దెఱచి పెట్ట
    నూరు చుండెను నానోరు నొక్క యుదుట
    పోయి తిందును మఱి మీరు వాయి తోడ
    తిట్ట కుండగ నుండుడు చట్టు లార !

    రిప్లయితొలగించండి
  3. నెమ్మనమున చిన్ని గుఱుతు
    నిమ్మతొనలుజూడగానె నోరూరునుగా
    అమ్మిచ్చిన తాయిలమివి
    కమ్మని రుచిగలుగు తొనలు కనుమఱుగాయెన్

    రిప్లయితొలగించండి
  4. చిన్న నాట చేత చిల్లర దొరికెనా
    పరుగు దీసి కొనుచు మురిసి తినెడు
    నిమ్మ తొనల తీపి కమ్మటి రుచులు
    గురుతు కొచ్చె నేడు తెరను జూడ

    రిప్లయితొలగించండి
  5. నిమ్మ రుచిని గలిగి యుండు నిమ్మ తొనలు జూడగా
    కమ్మదనము తోడ నోట కరిగి పోవు తీయగా
    అమ్మ కొనగ పాప తినగ నన్ని తొనలు హాయిగా
    చెమ్మ గిల్లు కనులలోన చిన్నతనము కదిలెగా

    రిప్లయితొలగించండి
  6. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    చక్కని పద్యాలను చెప్పారు. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. నోరూరును చూడగనే
    నీరసమే మాయమౌను నిమ్మల రుచితో
    నీ రస గుళికల నోటను
    మీరందరు చప్పరించ మీకే తెలియున్.

    రిప్లయితొలగించండి
  8. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ‘మధుర’మైన పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి