పిన్నవయస్సులో తగిన ప్రేమను బొందగ తల్లి దండ్రిపై చిన్నది బెంగ పెట్టుకొని చెంపల వెంబడి నీరు కార్చుచున్ సన్నగ యేడ్చుచుండెను, విశాల ప్రపంచమునందు నెందరో కన్నీరు గార్చుచుండిరి సకాలమునందున ప్రేమ నొందగా!
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * శైలజ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ‘బుగ్గలు + ఎఱ్ఱబడగ’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘తనబుగ్గ లెఱ్ఱబడగ’ అందాం. * బొడ్డు శంకరయ్య గారూ, మీ ఉత్పలమాల బాగుంది. అభినందనలు. చివరి పాదంలో ‘కన్నీరు’ అన్నచోట గణభంగం. అక్కడ ‘కన్నుల నీర్దొఱంగిరి...’ అందాం.
శ్రీ కంది శంకరయ్య గురుదేవులకు నమస్సులు, గణభంగము జరిగింది. తమరు సూచించిన సవరణతో....
పిన్నవయస్సులో తగిన ప్రేమను బొందగ తల్లి దండ్రిపై చిన్నది బెంగ పెట్టుకొని చెంపల వెంబడి నీరు కార్చుచున్ సన్నగ యేడ్చుచుండెను, విశాల ప్రపంచమునందు నెందరో కన్నుల నీర్దొరంగిరి సకాలమునందున ప్రేమ నొందగా!
పాల బుగ్గలఁ కన్నీరు జాలు వార
రిప్లయితొలగించండికారణంబేమి చిన్నారి కలికి చెపుమ?
అమ్మ నాన్నలు కొట్టిరా? యలుక వీడు
నీదు శ్రేయముఁ గోరెడి నేస్తులమ్మ!
ముద్దు లొలికించు బాలిక మొగము జూడ
రిప్లయితొలగించండికంటి నుండియు కన్నీరు కారి నట్లు
కాన వచ్చెను మఱి యేమి కారణం బొ ?
యడిగి జెప్పుదు మీకును నార్యు లార !
సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
తల్లిదండ్రులు కొలువుకు వెళ్ళి పోవ
రిప్లయితొలగించండికారుచుండెను కన్నీరు ధారవోలె
పసిడి బొమ్మకు కరువయ్యె పలుకరింపు
చిరుకుటుంబము లోనున్న చింత గనుడు
పాలు గాఱెడు చిన్నారి పాప యొకతి
రిప్లయితొలగించండిఏడ్చు చుండెను బుగ్గలు యెఱ్ర బడగ
కనుల జారెను నీలాలు కలవరమున
ఏమి కారణ మేమియో యెవ్వ రెరుగు?
పిన్నవయస్సులో తగిన ప్రేమను బొందగ తల్లి దండ్రిపై
రిప్లయితొలగించండిచిన్నది బెంగ పెట్టుకొని చెంపల వెంబడి నీరు కార్చుచున్
సన్నగ యేడ్చుచుండెను, విశాల ప్రపంచమునందు నెందరో
కన్నీరు గార్చుచుండిరి సకాలమునందున ప్రేమ నొందగా!
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
*
శైలజ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘బుగ్గలు + ఎఱ్ఱబడగ’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘తనబుగ్గ లెఱ్ఱబడగ’ అందాం.
*
బొడ్డు శంకరయ్య గారూ,
మీ ఉత్పలమాల బాగుంది. అభినందనలు.
చివరి పాదంలో ‘కన్నీరు’ అన్నచోట గణభంగం. అక్కడ ‘కన్నుల నీర్దొఱంగిరి...’ అందాం.
రిప్లయితొలగించండిశ్రీ కంది శంకరయ్య గురుదేవులకు నమస్సులు, గణభంగము జరిగింది. తమరు సూచించిన సవరణతో....
పిన్నవయస్సులో తగిన ప్రేమను బొందగ తల్లి దండ్రిపై
చిన్నది బెంగ పెట్టుకొని చెంపల వెంబడి నీరు కార్చుచున్
సన్నగ యేడ్చుచుండెను, విశాల ప్రపంచమునందు నెందరో
కన్నుల నీర్దొరంగిరి సకాలమునందున ప్రేమ నొందగా!